Ola-SBI Credit Card: 'ఓలా మనీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్' వచ్చేసింది...

Ola Money SBI Credit Card | ఓలా యూజర్లు నేరుగా ఓలా యాప్ నుంచే క్రెడిట్ కార్డుకు అప్లై చేయొచ్చు. క్యాష్‌బ్యాక్స్, రివార్డ్స్ లభిస్తాయి. వాటిని ఓలా రైడ్స్, ఫ్లైట్, హోటల్ బుకింగ్స్ కోసం రీడీమ్ చేసుకోవచ్చు.

news18-telugu
Updated: May 16, 2019, 4:25 PM IST
Ola-SBI Credit Card: 'ఓలా మనీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్' వచ్చేసింది...
Ola-SBI Credit Card: 'ఓలా మనీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్' వచ్చేసింది... (image: Ola)
news18-telugu
Updated: May 16, 2019, 4:25 PM IST
రెండ్రోజుల క్రితం పేటీఎం ఫస్ట్ క్రెడిట్ కార్డ్ రిలీజైంది. ఇప్పుడు ఓలా కూడా క్రెడిట్ కార్డ్ రిలీజ్ చేసింది. ఇందుకోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఓలా ఒప్పందం కుదుర్చుకుంది. 'ఓలా మనీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్' రిలీజ్ చేసింది. ఇది వీసా కార్డ్. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సులువు. జాయినింగ్ ఫీజ్ కూడా లేదని ప్రకటించింది ఓలా. 2022 నాటికి కోటి మందికి 'ఓలా మనీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్' ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుంది. ఓలా యూజర్లు నేరుగా ఓలా యాప్ నుంచే క్రెడిట్ కార్డుకు అప్లై చేయొచ్చు. క్యాష్‌బ్యాక్స్, రివార్డ్స్ లభిస్తాయి. వాటిని ఓలా రైడ్స్, ఫ్లైట్, హోటల్ బుకింగ్స్ కోసం రీడీమ్ చేసుకోవచ్చు. మీకు 'ఓలా మనీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్' తీసుకోవాలని ఆసక్తి ఉంటే ఇక్కడ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

Read this: Paytm Credit Card: పేటీఎం నుంచి క్రెడిట్ కార్డ్... లావాదేవీలపై క్యాష్‌బ్యాక్

Ola Money SBI Credit Card, Ola Credit Card, Ola SBI Credit Card, SBI Credit Card, Ola Credit Card rewards, Ola Credit Card cashback, ఓలా మనీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్, ఓలా క్రెడిట్ కార్డ్, ఓలా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్, ఓలా క్రెడిట్ కార్డ్ రివార్డ్స్, ఓలా క్రెడిట్ కార్డ్ క్యాష్‌బ్యాక్
(image: Ola)


Ola Money SBI Credit Card: 'ఓలా మనీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్'తో లాభాలు ఇవే...




'ఓలా మనీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్' తీసుకోవడానికి జాయినింగ్ ఫీజు లేదు.
ఈ కార్డును ఓలా క్యాబ్ కోసం ఉపయోగిస్తే 7% క్యాష్‌బ్యాక్.
ఫ్లైట్ బుకింగ్స్ కోసం ఉపయోగిస్తే 5% క్యాష్‌బ్యాక్.
Loading...
డొమెస్టిక్ హోటల్ బుకింగ్స్ కోసం ఉపయోగిస్తే 20% క్యాష్‌బ్యాక్.
ఇంటర్నేషనల్ హోటల్ బుకింగ్స్‌కు 6% క్యాష్‌బ్యాక్.
ఫ్యూయెల్ ట్రాన్సాక్షన్స్‌కు 1% సర్‌ఛార్జ్ మినహాయింపు.
రెస్టారెంట్లలో ఉపయోగిస్తే 20% బ్యాక్.
మిగతా ట్రాన్సాక్షన్స్‌పై 1% క్యాష్‌బ్యాక్.
మీరు లావాదేవీలు జరిపిన మూడు రోజుల్లో క్యాష్‌బ్యాక్ ఓలా మనీ వ్యాలెట్‌లోకి వస్తాయి.
గరిష్టంగా రూ.500 క్యాష్‌బ్యాక్ మాత్రమే వస్తుంది.

OnePlus 7 Series: అదిరిపోయిన వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్స్


ఇవి కూడా చదవండి:

Gym Business: జిమ్‌ బిజినెస్‌తో లక్షల్లో సంపాదన... ఎలాగో తెలుసుకోండి

PAN Card: 48 గంటల్లో పాన్ కార్డ్... పొందండి ఇలా

IRCTC: రైలు టికెట్‌లో 50% డిస్కౌంట్... ఇలా బుక్ చేయండి
First published: May 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...