Ola Cars: సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్​లోకి ఓలా.. ఈఎంఐ, వారంటీ వివరాలు ఇలా..

ప్రతీకాత్మక చిత్రం

Ola Cars: ప్రముఖ మల్టీనేషనల్​ రైడింగ్ షేరింగ్ సంస్థ ‘ఓలా’(Ola) సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్​లోకి అడుగుపెట్టింది. యూజ్డ్​ కార్ల మార్కెట్ (Market)​ప్లేస్​ను తీసుకొచ్చింది. ఈ ప్లాట్​ఫామ్​కు ఓలా కార్స్ (Ola Cars) అని పేరుపెట్టింది. ట్రై అండ్ బై(Try And Buy) (ట్రై చేయండి.. కొనండి) సర్వీస్​ను ఓలా కార్స్ ప్రారంభించింది.

  • Share this:
ప్రముఖ మల్టీనేషనల్​ రైడింగ్ షేరింగ్ సంస్థ ‘ఓలా’(Ola) సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్​లోకి అడుగుపెట్టింది. యూజ్డ్​ కార్ల మార్కెట్ (Market)​ప్లేస్​ను తీసుకొచ్చింది. ఈ ప్లాట్​ఫామ్​కు ఓలా కార్స్(Ola Cars) అని పేరుపెట్టింది. ట్రై అండ్ బై(Try And Buy) (ట్రై చేయండి.. కొనండి) సర్వీస్​ను ఓలా కార్స్ ప్రారంభించింది. సెకెండ్ హ్యాండ్​ కార్లను కస్టమర్ ​ఇంటికే డెలివరీ(Delivery) చేయనుంది. అలాగే ఈఎంఐ(EMI) ఆప్షన్లు, ఓ సంవత్సరం వారంటీ లాంటి సదుపాయాలు కూడా కల్పించనుంది. ఓలా కార్స్ ప్లాట్​ఫామ్​లో యూజర్ల కార్లను అమ్మవచ్చు.. కొనవచ్చు. సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్​కు ప్రస్తుతం మంచి ఊపు ఉండడంతో ఓలా ఈ సర్వీస్​ను ప్రారంభించింది. 2030 నాటికి దేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్​ 70.8 బిలియన్ డాలర్ల విలువకు చేరుతుందని మార్కెట్ రీసెర్చ్(Market Research) సంస్థ పీఅండ్ఎస్ ఇంటెలిజెన్స్​ అంచనా వేసింది.

Ola Electric Scooter: ఓలా కొత్త ఆలోచన.. ఈ తరహా మోడల్ ను అమలు చేస్తున్న మొదటి కంపెనీగా ఓలా అవతరణ..

ప్రస్తుతం దేశంలో ఈ మార్కెట్ 18.3 బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో అనేక సంస్థలు సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్​లోకి ప్రవేశించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే చాలా ఫేమస్ అయిన ఓలా అడుగుపెట్టడంతో ఇక పోటీ మరింత తీవ్రం కానుంది. కార్​దేఖో(Car Dekho), కార్స్​24, కార్​ట్రేడ్​, డ్రూమ్​, స్పినీ లాంటి సంస్థలు ఇప్పటికే సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్​లో దూసుకెళుతున్నాయి. మరిన్ని సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి.

Ola E-Scooter: ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ ప్రారంభ తేదీపై కీలక ప్రకటన.. వివరాలివే..

దీంతో పోటీ తీవ్రతరం కానుంది. మరి ఇప్పటికే క్యాబ్​ సర్వీసుల్లో అగ్రగామిగా ఉన్న ఓలా(Ola).. యూస్డ్ కార్ల మార్కెట్​లో సత్తాచాటుతుందో? లేదో? తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు. ఇదిలా ఉంటే, ఇటీవలే ఎలక్ట్రిక్​ వాహనాల(Electric Vehicle) తయారీ రంగంలోకి అడుగు పెట్టిన ఓలా.. తాజాగా తన ఫస్ట్ ఎలక్ట్రిక్​ స్కూటర్​ను లాంచ్​ చేసింది. ఎస్​1 మోడల్​ను రూ.99,999, ఎస్​1 ప్రోను రూ.1,29,999 ధరల వద్ద విడుదల చేసింది.

Gold Merchants: బంగారు వ్యాపారులకు ఊరట.. నవంబర్​ 30 వరకు వాటి గడువు పెంపు.. పూర్తి వివరాలివే..

వీటికి అద్భుతమైన డిమాండ్​ కనిపించింది. మరోవైపు వచ్చే ఏడాదిలో అమెరికా(America)కు సైతం తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎగుమతి చేయాలని ఓలా ప్లాన్ చేస్తోంది. అంతలా ఆ సంస్థ దూసుకెళుతోంది. ఓలా ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ కోసం తమిళనాడు(Tamilanadu)లోని కృష్ణగిరిలో 500 ఎకరాల విస్తీర్ణంలోఫ్యాక్టరీని నెలకొల్పింది. ఏడాదికి కోటి వాహనాలను తయారు చేసి, ప్రపంచంలోనే అతిపెద్ద టూ వీలర్స్​ ఫ్యాక్టరీగా నిలువాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.

Income Tax Return Filing: ఐటీఆర్ దాఖలు చేయడానికి ఆ రోజే చివరి తేదీ.. లేదంటే భారీ ఫైన్​.. ఆన్​లైన్​లో ఇలా దాఖలు చేసుకోండి..

ఇందు కోసందాదాపు 1.5 నుంచి 2 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించుకునేందుకు పబ్లిక్ ఆఫరింగ్ (IPO)​కు వచ్చేందుకు సిద్ధమైంది. 2022 ప్రారంభంలో ఓలా ఐపీఓకు రానుంది. ప్రైమరీ ఇష్యూ, ఆఫర్ ఫర్ సేల్ (OFS​)ల ద్వారా తొలుత ఓలా నిధులను రాబట్టనుంది. కాగా ఓలా తన ఐపీవోను మేనేజ్ చేసే బాధ్యతను సిటీ గ్రూప్​, కోటక్ మహీంద్రా(Kotak Mahindrae), మోర్గాన్​ స్టాన్లీ(Morgan Stanly) సంస్థలకు అప్పగించనుంది.
Published by:Veera Babu
First published: