Ola Scooter | ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ తాజాగా కొత్త స్కూటర్‌ను (Scooter) మార్కెట్లో ఆవిష్కరించింది. కంపెనీ అందుబాటు ధరలో ఈ స్కూటర్‌ను తీసుకువచ్చింది. కంపెనీ నుంచి మార్కెట్లో వస్తున్న తక్కువ ధర స్కూటర్ ఇదే కావడం గమనార్హం. ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు ఓలా ఎస్1 ఎయిర్. అక్టోబర్ 22న జరిగిన ఒక వర్చువల్ ఈవెంట్లో ఓలా (Ola) ఎలక్ట్రిక్ సీఈవో భవేశ్ అగర్వాల్ ఈ స్కూటర్‌ను మార్కెట్లో ఆవిష్కరించారు.
ఓలా నుంచి వచ్చిన ఈ కొత్త ఎలక్ట్రిక స్కూటర్లో పలు రకాల ఫీచర్లు ఉన్నాయి. ఇందులో మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంటుంది. పార్టీ మోడ్ ఫీచర్ ఈ స్కూటర్లో పొందుపరిచారు. దీని ద్వారా మీరు మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. స్మార్ట్‌ఫోన్‌కు కరెక్ట్ చేసుకొని మ్యూజిక్ ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. కాలింగ్ మోడ్ కూడా ఉంది.
బంగారంపై భారీ తగ్గింపు.. ఏ ఏ జువెలరీ షాపులో ఎలాంటి ఆఫర్లు ఉన్నాయంటే?
స్కూటర్లో 4.5 కేడబ్ల్యూ హబ్ మోటార్ ఉంటుంది. 2.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని అమర్చారు. అంటే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.3 సెకన్లలోనే అందుకోవచ్చు. ఏఆర్ఏఐ ప్రకారం అయితే ఈ స్కూటర్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు వెళ్లొచ్చు. అయితే ఆన్‌రోడ్‌పై 76 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. ఎకో మోడ్‌లో ఈ మైలేజ్ వస్తుందని చెప్పుకోవచ్చు.
రూ.లక్ష పెట్టుబడితో రూ.14 లక్షల లాభం.. 29 పైసల షేరుతో డబ్బే డబ్బు!
ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రిజిస్ట్రేషన్స్ అక్టోబర్ 22 నుంచి ప్రారంభం అయ్యాయి. మీరు ఈ కొత్త స్కూటర్‌ను రూ. 999తో బుక్ చేసుకోవచ్చు. కంపెనీ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. 2023 ఏప్రిల్ నుంచి వీటి డెలివరీ ప్రారంభం అవుతుంది. కంపెనీ ఈ స్కూటర్ ధరను రూ. 84,999గా నిర్ణయించింది. అయితే కస్టమర్లు ఈ స్కూటర్‌ను దీపావళి ఆఫర్ కింద రూ. రూ.79,999కు పొందొచ్చు. ఆఫర్ అక్టోబర్ 24 వరకే ఉంటుంది.
4.5 గంటల్లో బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంటోంది. కేవలం 25 పైసల ఖర్చుతోనే కిలోమీటర్ వెళ్లొచ్చని తెలియజేస్తోంది. ఇంకా ఈ స్కూటర్లో రివర్స్ మోడ్ ఉంటుంది. 34 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. కొత్త స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు. కంపెనీ ఇతర దేశాల్లో కూడా ఈ స్కూటర్లను లాంచ్ చేయాలని భావిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తే.. వెంటనే రూ. 999తో బుక్ చేసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Electric Scooter, Ola electric, Ola Electric Scooter, SCOOTER