Ola Rewards: మీకే రూ.400 కోట్ల స్టాక్స్‌.. ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఓలా..

ప్రతీకాత్మక చిత్రం

బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన ఈ స్టార్టప్.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకేలో కూడా సేవలను అందిస్తోంది. అంతేకాకుండా 100కి పైగా నగరాల్లో 10 లక్షలకు పైగా డ్రైవర్లను కలిగి ఉంది.

  • Share this:
భారత రైడ్ షేరింగ్ కంపెనీ ఓలా బహిరంగ మార్కెట్లో ఐపీఓకి (Initial Public Offer- IPO) వచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఇంతకంటే ముందు ఉద్యోగుల కోసం రూ.400 కోట్ల విలువైన స్టాక్స్‌ను కేటాయిస్తున్నట్లు సంస్థ బుధవారం ప్రకటించింది. అంతేకాకుండా ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ పూల్(ESOP)ను రూ.3000 కోట్లకు విస్తరిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈఎస్ఓపీ ప్రోగ్రాం విస్తరణలో భాగంగా ఉద్యోగులకు రూ.400 కోట్ల మేర స్టాక్స్ కేటాయించడంతో పాటు వారి ప్రతిభను ప్రోత్సహించడం ద్వారా దీర్ఘకాలిక సంపద వృద్ధి అవకాశాలను పెంపొందిస్తున్నట్లు తెలిపారు సంస్థ వ్యవస్థాపకులు భవీష్ అగర్వాల్.

ఓలా సంస్థ ఐపీఓ కోసం సిద్ధమవుతున్న తరుణంలో టెమాసెక్ హోల్డింగ్స్, వార్బర్గ్ విన్కస్ అనుబంధ సంస్థలు పెట్టుబడిదారుల నుంచి 500 మిలియన్ల డాలర్లను(దాదాపు 3700 కోట్లకు పైగా) సమీకరించే ప్రణాళికలను కూడా ఓలా ప్రకటించింది. ఐపీఓకు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ భౌగోళిక విస్తరణ కొససాగుతుందని కంపెనీ ప్రతినిధి చెప్పారు.

* పెరుగుతున్న ఐపీఓలు
టెక్ కంపెనీలపై పెరుగుతున్న ఆంక్షల కారణంగా చైనా నుంచి వైదొలగాలని చూస్తున్న ప్రపంచ పెట్టుబడిదారులను భారత్ ఆకర్షిస్తోంది. అంతేకాకుండా ఓలాతో పాటు భారతదేశపు అతిపెద్ద సంస్థలైన పేటీఎం, నైకా ఈ ఏడాది స్టాక్ మార్కెట్లో ప్రవేశించాయి. ఫుడ్ టెక్ స్టార్టప్ జోమాటో గత వారం ప్రవేశించింది. ఈ కంపెనీ ఇష్యూ ధరకు 55 శాతం స్టార్ ప్రీమియంతో లిస్ట్ అవ్వడం విశేషం.

పెట్టుబడిదారుల నుంచి వస్తున్న ఈ బలమైన స్పందన తప్పనిసరిగా అంకురాలను ఐపీఓ మార్గంలో వెళ్లేలా పోత్సహిస్తోంది. రైడ్ హెయిలింగ్ బిజినెస్ పై మహమ్మారి ప్రభావం ఏర్పడినప్పటికీ ఆంక్షలు సడలించినప్పటి నుంచి వ్యాపారం పుంజుకుంటోందని ఓలా వ్యవస్థాపకులు భవీష్ అగర్వాల్ తెలిపారు. "గత 12 నెలల్లో మేమే రైడ్ హెయిలింగ్ బిజినెస్‌ను మరింత దృఢంగా, స్థితిస్థాపకంగా, సమర్థవంతంగా చేశాం. మా కస్టమర్ల పట్టణ మొబిలిటీ అవసరాలను తీర్చడానికి కృషి చేస్తున్నాం" అని చెప్పారు.

బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన ఈ స్టార్టప్.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకేలో కూడా సేవలను అందిస్తోంది. అంతేకాకుండా 100కి పైగా నగరాల్లో 10 లక్షలకు పైగా డ్రైవర్లను కలిగి ఉంది. అగర్వాల్‌కు చెందిన మరో స్టార్టప్ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ.. బెంగళూరు వెలుపల విద్యుత్ స్కూటర్లను ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉంది.
Published by:Shiva Kumar Addula
First published: