Home /News /business /

OLA ELECTRIC TO UNVEIL A NEW ELECTRIC SCOOTER IN OLA S1 PRO SEGMENT ON AUGUST 15 HERE IS ITS SPECIALTY SK

Ola Electric: ఓలా నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్..ఆగస్టు 15న లాంచ్.. దాని ప్రత్యేకత ఇదే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

OLA Electric: ఆగస్టు 15న ఓలా ఎలక్ట్రిక్ కారు గురించి కూడా కీలక ప్రకటన విడుదల చేసే అవకాశముంది. ఈ కంపెనీ తమ మొదటి ఎలక్ట్రిక్ కారుపై ఏడాది కాలంగా పనిచేస్తోంది. వచ్చే ఏడాది దానిని లాంచ్ చేయవచ్చన్న అంచనాలున్నాయి

    ఎలక్ట్రిక్ వాహన (Electric Vehicles)  రంగంలో ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) కంపెనీ దూసుకెళ్తోంది. ఈ కంపెనీ తీసుకొచ్చిన ఓలా ఎస్ 1, ఎస్ 1 ప్రో స్కూటర్లకు మార్కెట్ భారీగా డిమాండ్ ఉంది. ఈ క్రమంలో పంద్రాగస్టు వేళ ఓలా ఫ్యాన్స్‌కు అదిరిపోయే వార్త చెప్పింది. ఓలా ఎలక్ట్రిక్ S1 ప్రో స్కూటర్ నుంచి మరో కొత్త కలర్ మోడల్‌ను ఆగస్టు 15న విడుదల చేయబోతోంది. ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు, CEO భవిష్ అగర్వాల్ (Bhavish Aggarwal) మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో దీనికి సంబంధించిన టీజర్‌ను పంచుకున్నారు. ఐతే దేనిని లాంచ్ చేయబోతున్నారో స్పష్టమైన వివరాలేవీ ఇవ్వలేదు. ఓలా కంపెనీ ఇప్పటివరకు తయారు చేసిన 'గ్రీనెస్ట్ EV'ని లాంచ్ చేయబోతున్నామని మాత్రమే పేర్కొన్నారు. దానిని పచ్చని చెట్ల వీడియోను జత చేయడంతో.. ఓలా ఎలక్ట్రిక్ S1 ప్రో నుంచి ఆకుపచ్చ రంగు వేరియంట్‌ను విడుదల చేయవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

    Ola Electric S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ 2021 సంవత్సరంలో రూ. 1.29 లక్షలతో లాంచ్ అయింది. ఐతే ఓలా కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం స్కూటర్ ధరను ₹ 1.40 లక్షలకు పెంచింది. ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం భారతదేశంలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. ఇందులో ఓలా ఎస్1 , ఓలా ఎస్1 ప్రో ఉన్నాయి.

    Ola S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ARAI సర్టిఫైడ్ రేంజ్‌తో.. ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 185 kms వరకు ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 115 కి.మీ. అని ఓలా కంపెనీ క్లెయిమ్ చేసింది. ఇది 3 సెకన్లలో 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకోగలదని తెలిపింది. ఓలా ఎలక్ట్రిక్ ఈ స్కూటర్ సాఫ్ట్‌వేర్‌ని కూడా అప్‌డేట్ చేసింది. మూవ్ OS 2.0 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ ఈ స్కూటర్లు అందుబాటులోకి వచ్చాయి. Ola S1 ప్రో స్కూటర్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, క్రూయిజ్ కంట్రోల్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.



    ఇప్పటికే ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో సంచలనాలు సృష్టిస్తున్న ఓలా.. కార్ మార్కెట్‌లోకి కూడా ప్రవేశించబోతోంది. ఆగస్టు 15న ఓలా ఎలక్ట్రిక్ కారు గురించి కూడా కీలక ప్రకటన విడుదల చేసే అవకాశముంది. ఈ కంపెనీ తమ మొదటి ఎలక్ట్రిక్ కారుపై ఏడాది కాలంగా పనిచేస్తోంది. వచ్చే ఏడాది దానిని లాంచ్ చేయవచ్చన్న అంచనాలున్నాయి. ఓలా కంపెనీ తన EV ఫోర్-వీలర్ ఫ్యాక్టరీ కోసం 1,000 ఎకరాల భూమిని సేకరించాలని చూస్తోంది. ఇది S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తయారు చేస్తున్న ప్రస్తుత ఫ్యూచర్ ఫ్యాక్టరీకి దాదాపు రెండు రెట్లు ఎక్కువ. ఓలా ఎలక్ట్రిక్ కారు మార్కెట్‌లోకి వస్తే.. ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌లో భారీగా మార్పులు చోటుచేసుకోవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ రేటు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. ఓలా ఎలక్ట్రిక్ కారుకు ఆదరణ పెరగవచ్చనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Business, Ola, Ola electric, Ola Electric Scooter

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు