హోమ్ /వార్తలు /బిజినెస్ /

Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ దీపావళి సర్‌ప్రైజ్‌..రూ.80 వేలకే కొత్త స్కూటర్‌!

Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ దీపావళి సర్‌ప్రైజ్‌..రూ.80 వేలకే కొత్త స్కూటర్‌!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓలా ఎలక్ట్రిక్‌ కంపెనీ తక్కువ ధరలకు బెస్ట్‌ ఫీచర్లతో స్కూటర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా Ola S1 స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా దీపావళికి మరో బిగ్‌ అనౌన్స్‌మెంట్‌కు సిద్దమైంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Ola Electric : ఓలా ఎలక్ట్రిక్‌(Ola Electric) కంపెనీ తక్కువ ధరలకు బెస్ట్‌ ఫీచర్లతో స్కూటర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా Ola S1 స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా దీపావళికి మరో బిగ్‌ అనౌన్స్‌మెంట్‌కు సిద్దమైంది. S1 కంటే తక్కువ ధరకు అదే స్థాయి ఫీచర్లతో మరో స్కూటర్‌ను అందించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఓలా ఎలక్ట్రిక్‌ సీఈవో ఓ ట్వీట్‌ చేశారు. వినియోగదారులకు బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఉందని పేర్కొన్నారు. కొత్త ప్రొడక్ట్‌ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రూ.80 వేల కంటే తక్కువ ధర

ఇండియన్‌ మార్కెట్‌లోకి ఓలా ఎలక్ట్రిక్‌(Ola Electric) కొత్త స్కూటర్‌ను లాంచ్‌ చేయబోతోంది. ఈ స్కూటర్‌ S1 కంటే తక్కువ ధరకు వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త స్కూటర్ ధర రూ.80,000 కంటే తక్కువగా ఉంటుందని, ఇది దేశంలో అత్యంత ఆఫర్డబుల్‌ ప్రీమియం ఇ-స్కూటర్‌లలో ఒకటిగా మారుతుందని న్యూస్18కి కొందరు సంబంధిత అధికారులు తెలిపారు. ఫీచర్ల పరంగా కొత్త స్కూటర్ దాదాపు S1 తరహాలోనే ఉంటుందని, కంపెనీ MoveOS సాఫ్ట్‌వేర్‌పై రన్‌ అవుతుందని సమాచారం.

నెలాఖరుకు బిగ్‌ ప్లాన్‌

దీనికి సంబంధించి ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ తాజాగా చేసిన ఓ ట్వీట్‌లో సంకేతాలు ఇచ్చారు. ఓలా లాంచ్‌ చేయనున్న కొత్త ప్రొడక్ట్‌ వివరాలను భవిష్‌ అగర్వాల్‌ వెల్లడించలేదు. ఈ నెలాఖరులో ఇండియన్‌ మార్కెట్లోని తమ వినియోగదారుల కోసం బిగ్‌ ప్లాన్‌ వేచి చూస్తోందని వివరించారు.

Honda: ఇండియాలో నెం.1 టూ వీలర్ బ్రాండ్‌గా హోండా

Ola S1 బెస్ట్‌

ఈ సంవత్సరం ప్రారంభంలో ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్‌ ఇండియన్‌ మార్కెట్లోకి S1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్కూటర్‌ను రూ.99,999 (ఎక్స్-షోరూమ్) ధరకు అందుబాటులోకి తీసుకొచ్చింది. Ola S1 డెలివరీలు సెప్టెంబర్ 7 నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ స్కూటర్ 3kWh బ్యాటరీ ప్యాక్‌తో ఒకే ఛార్జ్‌పై 141 కిమీ రేంజ్‌ను అందిస్తుంది. 95kmph గరిష్ట వేగంతో వచ్చిన ఈ స్కూటర్‌ ఈ సెగ్మెంట్లో బెస్ట్‌గా నిలిచింది.

2024లో ఆల్‌ ఎలక్ట్రిక్‌ కార్‌

ఓలా ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. అవి S1 ప్రో, S1. కంపెనీ ఒక ఆల్-ఎలక్ట్రిక్ కారును లాంచ్‌ చేసే ప్రయత్నాల్లో ఉంది. ఈ కార్‌ను 2024లో లాంచ్‌ చేసే అవకాశం ఉంది. కార్‌ను ఒక ఛార్జ్‌కి 500 కిమీ రేంజ్‌ అందించేలా రూపొందిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా 0.21 తక్కువ డ్రాగ్ కోఎఫీషియంట్ కారణంగా ఇది కేవలం 4 సెకన్లలో 0-100kmph స్ప్రింట్‌ను పూర్తి చేస్తుంది. ఆసక్తికరంగా ఓలా ఎలక్ట్రిక్ కారు కీలెస్, హ్యాండిల్‌లెస్‌గా ఉండనున్నట్లు సమాచారం.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Diwali, Ola Electric Scooter

ఉత్తమ కథలు