Ola e–Scooter: ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్‌ వచ్చేస్తోంది... ఫుల్ ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు తిరగొచ్చో తెలుసా?

Ola e–Scooter: ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్‌ వచ్చేస్తోంది... ఫుల్ ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు తిరగొచ్చో తెలుసా? (image: Ola Electric)

Ola e–Scooter | ఓలా నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతోంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు తిరగొచ్చో తెలుసుకోండి.

  • Share this:
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని వాహన తయారీ సంస్థలు ఇప్పుడు ఎలక్ట్రికల్​ వాహనాల తయారీలో నిమగ్నమయ్యాయి. ఇందులో భాగంగానే ప్రముఖ టాక్సీ సేవల సంస్థ ఓలా కూడా తమ మొదటి ఎలక్ట్రిక్​ స్కూటర్​ను విడుదల చేయానున్నట్లు తెలిపింది. ఈ ఏడాది జులైలో భారత మార్కెట్​లోకి సరికొత్త ఓలా ఎలక్ట్రికల్​ స్కూటర్​ను లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందు కోసం 400 నగరాల్లో సుమారు లక్ష ఛార్జింగ్ పాయింట్లతో 'హైపర్‌ఛార్జర్ నెట్‌వర్క్'ను నెలకొల్పడంపై కసరత్తు చేస్తున్నట్లు ఓలా చైర్మన్ భవీష్​ అగర్వాల్​ తెలిపారు. మొదటి సంవత్సరంలో దేశంలోని 100 ప్రధాన నగరాల్లో 5,000 ఛార్జింగ్​ పాయింట్లను ఏర్పాటు చేసే ప్రణాళికతో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ హైస్పీడ్​ ఓలా ఛార్జింగ్ పారింట్ల​ ద్వారా కేవలం 18 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్​ చేయవచ్చని కంపెనీ తెలిపింది. దీన్ని ఒక్కసారి ఫుల్​ ఛార్జ్​ చేస్తే చాలు.. ఇది 75 కిలోమీటర్ల ప్రయాణాన్ని అందిస్తుందని పేర్కొంది.

గత సంవత్సరం ఓలా తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని తమిళనాడులో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఫ్యాక్టరీ జూన్​ కల్లా సిద్ధం కానుంది. ఈ ఫ్యాక్టరీ ద్వారా ప్రారంభ దశలో ఏటా 20 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయాలని నిర్ధేశించుకుంది. ఈ ప్లాంట్​ నిర్మాణం, స్కూటర్ల ఉత్పత్తి కోసం 2,400 కోట్ల పెట్టుబడి పెట్టింది. అయితే, భారత మార్కెట్​లోకి వీటిని ఎంత ధరకు విడుదల చేస్తుందన్న వివరాలను మాత్రం కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. భారతీయ కొనుగోలుదారులకు సరసమైన ధరలోనే దీన్ని అందిస్తామని ఓలా చెబుతోంది. ఇక్కడ తయారు చేసిన వాహనాలను విదేశీ మార్కెట్లకు సైతం ఎగుమతి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తుంది.

SBI Zero Balance Account: ఈ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు... ఓపెన్ చేయండిలా

5G Smartphones: 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలా... రూ.15,000 నుంచి లభించే బెస్ట్ మోడల్స్ ఇవే

దీనిపై ఓలా చైర్మాన్​ భవీష్​ అగర్వాల్​ మాట్లాడుతూ "ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయడానికి బలమైన ఛార్జింగ్ నెట్‌వర్క్ అవసరం. అయితే, దేశంలో ఛార్జింగ్​ స్టేషన్లు ఎక్కువగా లేనందువల్ల ఎలక్ట్రిక్​ వాహనాల పురోగతికి ఇది అడ్డంకిగా మారుతోంది. అందువల్లే, మేం కొత్త ఎలక్ట్రికల్​ వాహనాలను రూపొందించడం కంటే ఛార్జింగ్​ స్టేషన్లు నెలకొల్పడంపై ఎక్కువ దృష్టిపెట్టాం. మేం ప్రారంభించబోయే హైపర్‌ఛార్జర్ నెట్‌వర్క్ ద్విచక్ర వాహనాలకు అతిపెద్ద ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ అవుతుంది. ఈ నెట్‌వర్క్‌లో భాగంగా దేశంలోని 400 నగరాలు, పట్టణాల్లో లక్షకు పైగా ఛార్జింగ్ పాయింట్లను నెలకొల్పాలని యోచిస్తున్నాం." అని ఆయన చెప్పారు.

Xiaomi Mi 11: ఎంఐ 11 సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి... ధర, స్పెసిఫికేషన్స్ వివరాలివే

LIC Claims: కరోనాతో మరణిస్తే ఎల్ఐసీ పాలసీ క్లెయిమ్ వర్తిస్తుందా?

లక్ష ఛార్జింగ్​ పాయింట్ల లక్ష్యంతో


కాగా, ఎలక్ట్రిక్​ ఛార్జింగ్​ పాయింట్లను మాల్స్​, ఐటీ పార్కులు, ఆఫీస్​ కాంప్లెక్సులు, కెఫేలు మొదలైన చోట్ల కస్టమర్లకు దగ్గర్లో ఉండేలా స్టాండ్​ ఎలోన్​ టవర్లుగా ఏర్పాటు చేస్తామని అగర్వాల్​ పేర్కొన్నారు. ఇతర భాగస్వాములతో కలిసి ఈ నెట్​వర్క్​ను నిర్మిస్తున్నట్లు వివరించారు. ఓలా ఎలక్ట్రిక్​ యాప్​ ద్వారా ఛార్జింగ్​ పరిస్థితిని కస్టమర్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని, చెల్లింపులు కూడా యాప్​ ద్వారా సులభంగా చేయవచ్చు. అంతేకాక, ఈ యాప్​తో ఎక్కడెక్కడ ఆటోమేటెడ్​, మల్టీలెవల్ ఛార్జింగ్, పార్కింగ్ వ్యవస్థలు ఉన్నాయో సులభంగా తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు. ఓలా స్కూటర్‌ కొనుగోలు సమయంలో హోమ్ ఛార్జర్ కూడా వస్తుంది. దీనికి ఎటువంటి ఇన్‌స్టాలేషన్ అవసరం లేదు. దీన్ని రెగ్యులర్ వాల్ సాకెట్‌లోకి ప్లగ్ చేయడం ద్వారా వినియోగదారులు తమ వాహనాన్ని ఇంట్లోనే సులభంగా ఛార్జ్ చేసుకునే సౌకర్యం ఉంటుంది.
Published by:Santhosh Kumar S
First published: