Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్​పై భారీ సబ్సిడీలు.. ఏ రాష్ట్రం ఎంత సబ్సిడీ ఇస్తోందో తెలుసా.. ?

ola scooter

ప్రముఖ క్యాబ్​ సర్వీసుల సంస్థ ఓలా(Ola) అందుబాటులోకి తెచ్చిన ఎస్​ 1, ఎస్​1 ప్రో ఎలక్ట్రిక్​ స్కూటర్లకు ఊహించని రెస్పాన్స్(Responce)​ వచ్చింది. సెప్టెంబర్​ 15న ఆన్​లైన్​ సేల్స్​ ప్రారంభించగా రూ. 1,100 కోట్ల విలువ చేసే స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఓలా ఎలక్ట్రిక్ ఎస్ 1, ఎస్ 1 ప్రో బేస్​ వేరియంట్లు రూ. 99,999, రూ. 1,29,999 ధర వద్ద అమ్మకానికి వచ్చాయి.

  • Share this:
ప్రముఖ క్యాబ్​ సర్వీసుల సంస్థ ఓలా(Ola) అందుబాటులోకి తెచ్చిన ఎస్​ 1 (Ola S1) , ఎస్​1 ప్రో (Ola S1 Pro) ఎలక్ట్రిక్​ స్కూటర్లకు (Electric Scooters) ఊహించని రెస్పాన్స్ ​ వచ్చింది. సెప్టెంబర్​ 15న ఆన్​లైన్​ సేల్స్​ ప్రారంభించగా రూ. 1,100 కోట్ల విలువ చేసే స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఓలా ఎలక్ట్రిక్ ఎస్ 1, ఎస్ 1 ప్రో బేస్​ వేరియంట్లు రూ. 99,999, రూ. 1,29,999 ధర వద్ద అమ్మకానికి వచ్చాయి. అయితే వీటిపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ లు (Subsidy on Electric scooters) అందిస్తున్నాయి. తద్వారా దాదాపు రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు అదనపు డిస్కౌంట్​ లభిస్తోంది.

భారతదేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీ విషయంలో ముందు వరుసలో ఉన్న గుజరాత్.. ఓలా ఈ-స్కూటర్లపై రూ. 20,000 సబ్సిడీ అందిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ రూ. 14,900 నుంచి రూ. 19,850 మధ్య సబ్సిడీ ఇస్తోంది. రాజస్థాన్‌ రూ. 10,000. మహారాష్ట్ర రూ. 5,000 అందిస్తోంది. డిసెంబర్ 2021లోపు కొనుగోలు చేసే వారికి మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 15 వేల సబ్సిడీ ఇస్తామని ప్రకటించింది.

Hyderabad News: మీకు రూ.30 వేలు కావాలా.. అయితే ఈ పని చేసిపెట్టండి..


ఈ సబ్సిడీలను పరిగణనలోకి తీసుకుంటే.. ఢిల్లీలో ఓలా ఎస్ 1, ఓలా ఎస్ 1 ప్రో వరుసగా రూ. 85,099, రూ. 1,10,149 ధర వద్ద అందుబాటులో ఉంటాయి. గుజరాత్​లో రూ. 79,999, రూ. 1,09,999 వద్ద, మహారాష్ట్రలో రూ. 94,999 రూ. 1,24,999, రాజస్థాన్​లో రూ. 89,968, రూ. 1,19,138 ధరల వద్ద లభిస్తాయి. అయితే మిగతా రాష్ట్రాల్లో మాత్రం సాధారణ ధరలే అమల్లో ఉంటాయి.

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయంతో ఈ పనులు చేస్తే...నెలకు రూ.2 లక్షల ఆదాయం పక్కా...


అన్ని ఇతర రాష్ట్రాల్లో ఓలా ఎస్​1 రూ. 99,999, ఎస్​1 ప్రో రూ. 1,29,999 ధర వద్ద అందుబాటులో ఉంటాయి. ఓవైపు ఆకట్టుకునే ఫీచర్లు, మరోవైపు సబ్సిడీలతో ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్లు భారీగా అమ్ముడవుతున్నాయి. ఈ నెల 15న సేల్స్​ ప్రారంభించగా​ ప్రతి సెకనుకు నాలుగు స్కూటర్లు బుక్ అయ్యాయని ఓలా ఇండియా సీఈవో భవిష్​ అగర్వాల్​ చెప్పడం గమనార్హం. విపరీతమైన డిమాండ్​ కారణంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. తదుపరి సేల్​ డేట్​ను త్వరలోనే ప్రకటించనుంది.

Electric Vehicle: హైదరాబాద్ లో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించి బుకింగ్స్ ఓపెన్.. పూర్తి వివరాలివే..


ఆకట్టుకునే ఫీచర్లు..
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో అట్రాక్టివ్​ ఫీచర్లను చేర్చింది. ఓలా ఎస్​ 1 ఈ–స్కూటర్​ 2.98 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇక, S1 ప్రో 3.97 kWh బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంటుంది. రెండు స్కూటర్లు 8.5 kW ఎలక్ట్రిక్ మోటారుతో వస్తాయి. ఓలా ఎస్​1ని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 121 కి.మీ. ప్రయాణాన్ని అందిస్తుంది. S1 ప్రోని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 181 కి.మీ. ప్రయాణాన్ని ఇస్తుంది.

ఈ రెండు స్కూటర్లలో రివర్స్ డ్రైవ్ మోడ్​ను కూడా అందించింది. అంతేకాదు, 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, నావిగేషన్, కీలెస్ యాక్సెస్, హిల్-హోల్డ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, జియోఫెన్సింగ్, లైవ్ లొకేషన్ ట్రాకింగ్, యాంటీ-థెఫ్ట్ అలర్ట్ మొదలైన అద్భుతమైన కనెక్ట్​ ఫీచర్లను చేర్చింది.
Published by:Veera Babu
First published: