Home /News /business /

OLA ELECTRIC SCOOTER SET TO BE ELIGIBLE FOR MASSIVE FAME II SUBSIDY OF OVER RS 50000 HERE FULL DETAILS NS

Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త.. రూ. 50 వేల సబ్సిడీ

ఓలా ఎలక్ట్రిక్ బైక్ (Image credit : Twitter)

ఓలా ఎలక్ట్రిక్ బైక్ (Image credit : Twitter)

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకో శుభవార్త. ఈ స్కూటర్ కొనుగోలుపై రూ. 50 వేల వరకు సబ్సిడీ అందుకోవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

    ఓలా ఎలక్ట్రిక్ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఆగస్టు నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ ఈ స్కూటర్ ప్రత్యేకతల గురించి ఇంకా సైలెంట్ గానే వ్యవహరిస్తోంది. అయితే ఈ స్కూటర్ ను ఇంటికే నేరుగా డెలివరీ చేయనుంది. ఈ స్కూటర్ ఒక సారి ఛార్జింగ్ చస్తే 150 కిలీ మీటర్ల వరకు ప్రయాణించనుంది. అయితే కేంద్రం తీసుకువచ్చిన FAME-II పథకం కింద ఈ స్కూటర్ పై రూ .50,000 వరకు సబ్సిడీని అందుకోవచ్చు. ఈ స్కూటర్ బ్యాటరీ సామర్థ్యం 3.6 kWh కి దగ్గరగా ఉంటుంది. నేడు భారతదేశంలో విక్రయించబడుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలల్లోని అత్యధిక సామర్థ్యాల్లో ఇది ఒకటి.
    Jio, Airtel, Vi నుంచి రూ. 500 కన్నా తక్కువ ధరకు లభించే బెస్ట్ ప్లాన్స్ ఇవే.. తెలుసుకోండి

    జూన్‌లో, కేంద్రం FAME-II పథకాన్ని సవరించింది, విద్యుత్ ద్విచక్ర వాహన ప్రోత్సాహకాన్ని kWh కి రూ .15,000 పెంచింది (గతంలో ఇది రూ. 10,000గా ఉండేది) మరియు సబ్సిడీ పరిమితిని ద్విచక్ర వాహన ధరలో 40 శాతానికి రెట్టింపు చేసింది. అంటే రూ. 1.50 లక్షల వరకు ఎక్స్-ఫ్యాక్టరీ ధర కలిగిన ఏదైనా ఇ-టూ-వీలర్‌కు 4 kWh బ్యాటరీ ఉంటే గరిష్టంగా రూ .60,000 FAME-II సబ్సిడీకి అర్హులు. దాని సామర్థ్యాన్ని బట్టి, ఓలా ఎస్ 1 ప్రో దాదాపు 51,000-52,000 రూపాయల FAME-II ప్రోత్సాహకానికి అర్హత పొందే అవకాశం ఉంది.

    ఇదిలా ఉంటే.. ఇంధన ధరలు మండుతున్న వేళ వాహన ప్రియుల దృష్టి ఎలక్ట్రిక్ వేకిల్స్‌పై పడింది. నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండటం, ప్రభుత్వ రాయితీలు, ఇతర ప్రయోజనాల కారణంగా వీటికి ఆదరణ పెరుగుతోంది. 2030 నాటికి భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సంఖ్య 25-35 శాతానికి చేరుకుంటుందని కొన్ని నివేదికలు తెలిపాయి. దీంతో చిన్న స్టార్టప్‌ల నుంచి ప్రముఖ కంపెనీలు సైతం ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకునే పనుల్లో నిమగ్నమయ్యాయి. ఈ రంగంలోకి ప్రవేశించిన ఓలా సంస్థ.. ఇటీవల ఈ-స్కూటర్ల బుకింగ్‌లను సైతం ప్రారంభించింది.

    రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే బుకింగ్‌లు మొత్తం పూర్తవడం విశేషం. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వేకిల్స్‌కు ఇన్సూరెన్స్ అంశం తెరపైకి వస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లు అమ్మకాలు పెరుగుతున్నందువల్ల, వాటికి బీమా చేయడం కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎలక్ట్రిక్ వేకిల్స్ కోసం పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వాహనాల బ్యాటరీతో సహా సమగ్ర కవరేజీని అందించే ప్లాన్లు, యాడ్-ఆన్ ప్లాన్లు సైతం ఉన్నాయి. కొత్తగా ఈ-వేకిల్స్‌ తీసుకునేవారు, వాటికి ఇన్సూరెన్స్ సైతం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Ola bikes, Ola Electric Scooter

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు