Ola e-scooters: 10 రంగుల్లో అందుబాటులోకి రానున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. త్వరలోనే లాంచ్.. ధర ఎంతంటే..  

ప్రతీకాత్మకచిత్రం

ఓలా స్కూటర్‌కు సంబంధించిన ధర వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. మీడియా రిపోర్టుల ప్రకారం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.80,000 నుంచి రూ.1,00,000 మధ్య ఉండే అవకాశమున్నట్లు సమాచారం.

  • Share this:
క్యాబ్, ట్రాన్స్ పోర్ట్ రంగాల్లో ఇప్పటి వరకు సేవలందించిన ఓలా సంస్థ ఆటోమొబైల్ రంగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. తన సరికొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనుందీ కంపెనీ. త్వరలో విడుదల చేయనున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన కలర్ ఆప్షన్ల గురించి ఓలా తెలియజేసింది. 10 విభిన్న కలర్ ఆప్షన్లలో సరికొత్త ఈ-స్కూటర్ లభ్యమవుతుందని స్పష్టం చేసింది. మ్యాటీ బ్లాక్, గ్లాస్ బ్లూ రంగులతో పాటు ఇతర వైబ్రెంట్ షేడ్స్‌లోనూ అందుబాటులోకి రానుంది. ఎరుపు, పింక్, పసుపుతో పాటు సిల్వర్, వైట్ వైబ్రెంట్ షేడ్స్‌లోనూ లభ్యం కానుంది. ప్రస్తుతానికి కచ్చితంగా ఏయే కలర్స్‌లో అందుబాటులోకి రానుందో స్పష్టత లేదు. ఈ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేసే రోజు మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది.

ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన టీజర్ వీడియోను.. ఓలా యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఈ వీడియో ప్రకారం 10 విభిన్న రంగులతో పాటు సరికొత్త డిజైన్‌తో కొత్త వేకిల్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓలా ఈ-స్కూటర్‌కు సంబంధించిన బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. వీటికి డిమాండ్ విపరీతంగా ఏర్పడింది. గత వారమే రిజర్వేషన్లు ప్రారంభమవగా.. 24 గంటల్లోనే దాదాపు లక్ష మంది బుకింగ్ చేసుకున్నారు.

ఓలా స్కూటర్‌కు సంబంధించిన ధర వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. మీడియా రిపోర్టుల ప్రకారం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.80,000 నుంచి రూ.1,00,000 మధ్య ఉండే అవకాశమున్నట్లు సమాచారం. ఆన్ లైన్లో బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు రూ.499 రిఫండబుల్ అమౌంట్‌తో స్కూటర్‌ను డోర్ స్టెప్ డెలివరీ ఇస్తామని ఓలా గత వారం హామీ ఇచ్చింది. ఈ మోడళ్లను సంస్థ తమిళనాడులోని ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో తయారీ చేసింది. మొదటి దశలో ఏడాదికి రెండు మిలియన్ల యూనిట్లు ఉత్పత్తి చేయనుంది. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి 10 మిలియన్ల యూనిట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది.
First published: