Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచింగ్ ఎప్పుడు? ఆసక్తికర ట్వీట్​ చేసిన సంస్థ సీఈఓ భవిష్ అగర్వాల్

ప్రతీకాత్మక చిత్రం

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్​పై భారత మార్కెట్​లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ స్కూటర్​ విడుదలకు ముందే అనేక సంచనాలు సృష్టిస్తోంది. ప్రీ​ బుకింగ్స్​లో దుమ్మురేపుతోంది.

  • Share this:
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్​పై భారత మార్కెట్​లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ స్కూటర్​ విడుదలకు ముందే అనేక సంచనాలు సృష్టిస్తోంది. ప్రీ​ బుకింగ్స్​లో దుమ్మురేపుతోంది. జూలై 15న ప్రీబుకింగ్స్​ ప్రారంభించగా 24 గంటల్లోనే ఒక లక్షకు పైగా బుకింగ్స్​ సాధించి రికార్డు సృష్టించింది. తద్వారా ప్రపంచంలోనే ఎక్కువ మంది బుక్​ చేసుకున్న ఈ–స్కూటర్​గా నిలిచింది. మరోవైపు ఈ స్కూటర్​కు సంబంధించిన ఫీచర్లు, డిజైన్​ గురించి ఒక్కొక్కటిగా కంపెనీ సీఈఓ భవిష్​ అగర్వాల్​ ట్వీట్​ చేస్తూ అందర్లో ఆసక్తి రేకెత్తిస్తున్నారు. దీంతో ఓలా ఈవీ టూవీటర్​ స్పీడ్ ఎంత? ఎంత మైలేజీ ఇస్తుంది? దాని ఫీచర్లేంటి? ఎప్పుడు విడుదలవుతుంది? వంటి విషయాలను తెలుసుకునేందుకు బైక్​ లవర్స్​ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, వారి ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తూ భవిష్​ అగర్వాల్​ తాజాగా ట్వీట్​ చేశారు.

ఈ బైక్​ విడుదల తేదీని స్పష్టంగా చెప్పకపోయినా.. దానిపై కొన్ని హింట్స్​ ఇచ్చారు భవిష్. పార్క్​లో కూర్చొని సరదాగా టీ తాగుతూ ఓలా ఎలక్ట్రిక్ బైక్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘త్వరలోనే బైక్​ లాంఛ్​ డేట్​ను అనౌన్స్​ చేయనున్నాం. ఇక నుంచి ఎవరినీ వెయిట్​ చేయించం.. ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా లాంచ్​ చేస్తాం. స్టే ట్యూన్డ్​’’ అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు, మీ బైక్​ను ఏ విధానంలో కొనుగోలు చేయాలనుకుంటున్నారు? అంటూ రెండు ఆప్షన్లు ఇచ్చారు భవిష్​ అగర్వాల్​. అందులో ఒకటి ఆన్​లైన్​ హోమ్​ డెలివరీ కాగా, మరొకటి ఫిజికల్​ డీలర్​షిప్​/ స్టోర్. ఈ రెండు విధానాల్లో మీరు దేన్ని ఎంచుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అని ట్వీట్​లో తెలిపారు.

కాగా, భవిష్​ ట్వీట్లపై స్పందించిన నెటిజన్లు ఆన్​లైన్​ హోమ్​ డెలివరీ కావాలని అడుగుతుండగా.. వారిలో ఎక్కువ మంది ఫ్యూయల్​ బైక్​పై ఎక్స్​చేంజ్​ ఆఫర్ కూడా​ ఇవ్వాలని కోరుతున్నారు. తద్వారా తమ పెట్రోల్ బైక్​ నుంచి ఎలక్ట్రిక్​ బైక్​కు సులభంగా మారగలమని చెబుతున్నారు.​ ఇక, కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఓలా స్కూటర్‌ను 18 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ 50% ఛార్జ్​తో 75 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. 100 శాతం ఛార్జింగ్​ చేయడం ద్వారా గరిష్టంగా 150 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు.

తాజాగా ఓలా స్కూటర్ కలర్ రేంజ్ కూడా వెల్లడైంది. స్కూటర్ మొత్తం 10 కలర్​ ఆప్షన్లతో వస్తుంది. ఇందులో మ్యాట్, మెటాలిక్, పాస్టెల్ అనే మూడు వేర్వేరు ఫినిష్‌లు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఓలా స్కూటర్​పై కూర్చొని​ బెంగళూరు రోడ్లపై పరుగులు పెట్టిన వీడియోను షేర్​ చేశారు భవిష్ అగర్వాల్. అప్పటి నుంచి దీనిపై అంచనాలు మరింత పెరిగాయి.
Published by:Sumanth Kanukula
First published: