Ola Scooter: ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ విడుదల తేదీ ప్రకటన.. ఆ రోజే ఫీచర్లు వెల్లడి.. పూర్తి వివరాలు ఇవే..

ఓలా స్కూటర్లు (Image credit : twitter)

Ola Scooter: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ విడుదల తేదీని సంస్థ సీఈఓ భవీష్‌ అగర్వాల్‌ మంగళవారం ప్రకటించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న స్కూటర్‌ విడుదల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ట్విటర్‌లో వెల్లడించారు. పూర్తి వివరాలు ఇవే..

  • Share this:
    ఓలా ఎలక్ట్రిక్ స్కటర్ పై ప్రతీ ఒక్కరి కళ్లు పడ్డాయి. ఎప్పుడు విడుదల అవుతుందా.. అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ స్కూటర్​ విడుదలకు ముందే అనేక సంచలనాలు సృష్టించింది. ప్రీ​ బుకింగ్స్​లో దుమ్మురేపింది. జూలై 15న ప్రీబుకింగ్స్​ ప్రారంభించగా 24 గంటల్లోనే ఒక లక్షకు పైగా బుకింగ్స్​ సాధించి రికార్డు సృష్టించింది. తద్వారా ప్రపంచంలోనే ఎక్కువ మంది బుక్​ చేసుకున్న ఈ–స్కూటర్​గా నిలిచింది. మరోవైపు ఈ స్కూటర్​కు సంబంధించిన ఫీచర్లు, డిజైన్​ గురించి ఒక్కొక్కటిగా కంపెనీ సీఈఓ భవిష్​ అగర్వాల్​ ట్వీట్​ చేస్తూ అందర్లో ఆసక్తి రేకెత్తిస్తున్నారు. దీంతో ఓలా ఈవీ టూవీటర్​ స్పీడ్ ఎంత? ఎంత మైలేజీ ఇస్తుంది? దాని ఫీచర్లేంటి? ఎప్పుడు విడుదలవుతుంది? వంటి విషయాలను తెలుసుకునేందుకు బైక్​ లవర్స్​ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అందరూ ఎంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ విడుదల తేదీని సంస్థ సీఈఓ భవీష్‌ అగర్వాల్‌ మంగళవారం ప్రకటించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న స్కూటర్‌ విడుదల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ట్విటర్‌లో వెల్లడించారు.

    స్కూటర్‌ ఫీచర్లు, బుక్‌ చేసుకున్న వారికి ఎప్పటి నుంచి అందుబాటులోకి రానున్నాయి.. వంటి వివరాలు ఆరోజే ప్రకటిస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారత్‌లో తయారు చేస్తున్న ఈ స్కూటర్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వేగం, ఛార్జింగ్‌, బూట్‌ స్పేస్ విషయంలో ఈ విభాగంలో ఇదే అత్యుత్తమైనదిగా నిలిచే అవకాశం ఉందని సమాచారం. మొత్తం 10 రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది. ఆ రంగులను ఇటీవలే కంపెనీ బహిర్గతం చేసింది. ఇందులో మ్యాట్, మెటాలిక్, పాస్టెల్ అనే మూడు వేర్వేరు ఫినిష్‌లు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఓలా స్కూటర్​పై కూర్చొని​ బెంగళూరు రోడ్లపై పరుగులు పెట్టిన వీడియోను షేర్​ చేశారు భవిష్ అగర్వాల్. అప్పటి నుంచి దీనిపై అంచనాలు మరింత పెరిగాయి.


    ఈ స్కూటర్ ను ఇంటికే నేరుగా డెలివరీ చేయనుంది. ఈ స్కూటర్ ఒక సారి ఛార్జింగ్ చస్తే 150 కిలీ మీటర్ల వరకు ప్రయాణించనుంది. అయితే కేంద్రం తీసుకువచ్చిన FAME-II పథకం కింద ఈ స్కూటర్ పై రూ .50,000 వరకు సబ్సిడీని అందుకోవచ్చు. ఈ స్కూటర్ బ్యాటరీ సామర్థ్యం 3.6 kWh కి దగ్గరగా ఉంటుంది. నేడు భారతదేశంలో విక్రయించబడుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలల్లోని అత్యధిక సామర్థ్యాల్లో ఇది కూడా ఒక్కటి.
    Published by:Veera Babu
    First published: