OLA ELECTRIC SCOOTER CUSTOMERS COMPLAINING OF QUALITY AND RANGE ISSUES GH VB
Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో సాంకేతిక సమస్యలు.. ఆ సమస్యలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు..
ప్రతీకాత్మక చిత్రం
ఓలా స్కూటర్లను అందుకున్న కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఓలా ఈ–స్కూటర్ల రైడింగ్‌లో వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పలువురు కస్టమర్లు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు.
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల(Electric Vehicle) మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఓవైపు ఇంధన ధరలు పెరగడం, మరోవైపు పర్యావరణ కాలుష్యంతో వాహనాదారుల చూపు ఎలక్ట్రిక్ వాహనాలపై పడింది. దీంతో ప్రముఖ ఆటో మేకర్స్‌తో పాటు స్టార్టప్‌లు(Startup) ఈ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలా(Ola) ఈ ఏడాది ఆగస్టులో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఓలా ఎస్ S1, S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లు(Electric Scooters) ప్రారంభమైన నాటి నుంచి అనూహ్యమైన రెస్పాన్స్‌తో దూసుకెళ్తున్నాయి.
బుకింగ్ ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే స్టాక్ మొత్తం క్లియర్ అయ్యిందంటే వీటికి ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. కాగా, ఎప్పటి నుంచో కస్టమర్లు ఎదురుచూస్తోన్న ఒలా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. బెంగళూరు, చెన్నై, పుణె వంటి ప్రధాన నగరాల్లో కొంత మంది కస్టమర్లు వాహనాలను అందుకున్నారు.
అయితే ఓలా స్కూటర్లను అందుకున్న కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఓలా ఈ–స్కూటర్ల రైడింగ్‌లో వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పలువురు కస్టమర్లు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. కొంత మంది తమ వాహనాలపై గీతలు, డెంట్లు పడ్డాయని ఫిర్యాదు చేయగా.. మరికొందరు తమకు సరైన కండీషన్లో లేని వాహనాలను డెలివరీ చేసినట్లు పేర్కొన్నారు. కొందరైతే ప్యానల్లో మెకానికల్ సమస్యలను ఎదుర్కొంటున్నామని తెలిపారు.
An OLA S1 Pro was delivered to me at the Visakhapatnam event today.
It has cracks & dents all over the body. The manager says she will get it repaired before delivery. But repair is not the option. I paid for a new product, not a refurbished product@OlaElectric@don4every1#Olapic.twitter.com/ifZnDsJaXg
ఫిర్యాదులు పరిష్కరిస్తామని హామీ..
ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఇలా పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంపై సంస్థ దిద్దుబాటు చర్యలకు దిగింది. దెబ్బతిన్న ప్యానెల్లను రిప్లేస్ చేసేందుకు ఓలా అంగీకరించింది. మరికొందరికి కొత్త స్కూటర్‌ను డెలివరీ చేస్తామని వాగ్దానం చేసింది. రేంజ్, బ్రేకింగ్ సౌండ్ సమస్యల గురించి ఫిర్యాదు చేసిన కస్టమర్లు వాహనాలను తమకు పంపించాల్సిందిగా కోరింది.
ఆయా వాహనాలను మరమ్మతు చేసి తిరిగి అందజేస్తామని తెలిపింది. ఇప్పటికే సెమీకండక్టర్ల కొరత కారణంగా వాహన తయారీ నెమ్మదించిన నేపథ్యంలో కస్టమర్ల నుంచి వస్తున్న ఫిర్యాదులు ఓలాకు ప్రతికూలంగా మారాయి. అందుకే, కస్టమర్ల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టింది.
మొత్తం రెండు వేరియంటట్లలో లభ్యం
కాగా, ఓలా ఈ–స్కూటర్ మొత్తం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఓలా ఎస్1 ప్రో వేరియంట్లో 3.97 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించింది. ఎస్1 గరిష్టంగా 115 km/h, ఒకేఛార్జ్పై 181 km డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. ఇక, ఎంట్రీ-లెవల్ ఎస్1 2.98 kWh బ్యాటరీతో వస్తుంది. ఇది 121 km/ఛార్జ్ పరిధిని అందిస్తుంది. స్కూటర్ గరిష్టంగా 90 km/h వేగాన్ని అందుకుంటుంది. ఓలా S1 బ్యాటరీని 4 గంటల 48 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. అయితే ఎస్1 ప్రో పోర్టబుల్ ఛార్జర్‌ని ఉపయోగించి ఫుల్ ఛార్జ్ చేయడానికి 6 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.