Ola Referral Program: కంపెనీలు తమ ప్రొడక్ట్స్ మార్కెట్‌ను పెంచుకోవడానికి ఆఫర్స్ ప్రకటిస్తుంటాయి. కస్టమర్లను ఆకర్షించడానికి ప్రత్యేక డీల్స్‌ను అందిస్తుంటాయి. తాజాగా యాప్ బేస్డ్ టాక్సీ సేవల సంస్థ ఓలా (Ola) తన ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్స్ పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బెంగళూరు బేస్డ్గా పనిచేసే ఈ కంపెనీ ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో, ఓలా ఎస్1 ఎయిర్ వంటి మోడల్స్‌పై రిఫరల్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా ఓలా కస్టమర్లు కంపెనీ ఎలక్ట్రిక్ (Ola Electric) స్కూటర్ కొనుగోలు చేయడానికి ముగ్గురిని రిఫర్ చేస్తే.. ఓలా మనీ రూపంలో గరిష్టంగా రూ.4,500 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఈ మేరకు రిఫరల్ ప్రోగ్రామ్ వివరాలను ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Starting a referral program for all Ola customers today! Refer your friends who could be interested in our Ola S1 on this link: https://t.co/seIRS3QrNr pic.twitter.com/A5uOxH6KBd
— Bhavish Aggarwal (@bhash) December 6, 2022
ఓలా స్కూటర్స్ మోడల్స్ ధరలు
ప్రస్తుతం మార్కెట్లో ఓలా నుంచి మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ఓలా S1, ఓలా S1 Pro, ఓలా S1 Air పేర్లుతో ఇవి లభిస్తున్నాయి. Ola S1 ప్రో 2021లో లాంచ్ కాగా, Ola S1 ఈ సంవత్సరం ఆగస్టులో అందుబాటులోకి వచ్చింది. ఈ మోడల్‌ను ప్రస్తుతం రూ.99,000కి కొనుగోలు చేయవచ్చు. Ola S1 Air వేరియంట్ 2022 దీపావళికి లాంచ్ అయింది. ఇది అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా గుర్తింపు పొందింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో లెటెస్ట్ MoveOS 3 ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే ఇది 76 కీమీ రేంజ్ ఇస్తుంది. ఈ స్కూటర్ రూ.85,000 ధరతో అందుబాటులో ఉంది.
ఓలా సీఈవో ట్వీట్
రిఫరల్ ప్రోగ్రామ్ గురించి ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు. ఈ రోజు Ola కస్టమర్ల కోసం రిఫరల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. https://olaelectric.com/referrals అనే లింక్ ద్వారా Ola S1 స్కూటర్ కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న స్నేహితులను రిఫర్ చేయండని పేర్కొన్నారు.
క్యాష్‌బ్యాక్ పొందండి ఇలా
ఓలా వెబ్సైట్ ప్రకారం.. ఓలా స్కూటర్‌ను కొనుగోలు చేయడానికి మరొక వ్యక్తిని సక్సెపుల్గా సూచించిన కస్టమర్ క్యాష్‌బ్యాక్ పొందడానికి అర్హులు. https://olaelectric.com/referrals అనే లింక్‌పై క్లిక్ చేస్తే రిఫరల్ ప్రోగ్రామ్ పేజీ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ చేసిన తరువాత ‘Start Referring’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, ఆ పై ఫోన్‌కు వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్ చేయాలి. ఆ తర్వాత ఓలా స్కూటర్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న ముగ్గురు స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల కాంటాక్ట్ వివరాలను యాడ్ చేయాలి. ఓలా కంపెనీ తన స్కూటర్లను డెలివరీ చేసినప్పుడు, ప్రతి సక్సెస్ పుల్ సిఫార్సుపై రూ.1500 క్యాష్‌బ్యాక్ అందజేస్తుంది. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా మొత్తంగా ముగ్గురుని సిఫార్సు చేస్తే రూ.4,500 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Ola electric