Home /News /business /

OLA ELECTRIC OFFERS RS 139000 WORTH OLA S1 PRO SCOOTER FOR FREE KNOW HOW TO WIN THIS ELECTRIC SCOOTER SS

Ola S1 Pro: రూ.1,39,000 విలువైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఉచితం... వారికి మాత్రమే

Ola S1 Pro: రూ.1,39,000 విలువైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఉచితం... వారికి మాత్రమే
(image: Ola Electric)

Ola S1 Pro: రూ.1,39,000 విలువైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఉచితం... వారికి మాత్రమే (image: Ola Electric)

Ola Electric Scooter | ఓలా ఎస్1 ప్రో అమ్మకాలు ఇటీవల మళ్లీ ప్రారంభమయ్యాయి. 1,39,000 విలువైన ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro) గెరువా కలర్ ఉచితంగా గెలుచుకోవచ్చు. ఈ స్కూటర్ ఎలా గెలుచుకోవచ్చో కంపెనీ వివరించింది.

ఓలా ఎలక్ట్రిక్ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. రూ.1,39,000 విలువైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ (Ola Electric Scooter) ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. కానీ ఇందుకు కొన్ని షరతులు వర్తిస్తాయని వివరించింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సింగిల్ ఛార్జ్‌లో 200 కిలోమీటర్ల పైనే నడిపినవారికి ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro) గెరువా కలర్ ఉచితంగా ఇస్తామని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీష్ అగర్వాల్ ప్రకటించారు. మొదటి 10 మంది ఈ స్కూటర్ గెలుచుకోవచ్చని తెలిపారు. ఇప్పటికే ఇద్దరు ఈ లక్ష్యాన్ని అందుకున్నారని, మిగతావారికి కూడా ఇది సాధ్యమని ట్వీట్ చేశారు.ఈ ఫీట్ సాధించేవారు కూడా ఓలా ఎస్1 ప్రో గెరువా కలర్ ఉచితంగా గెలుచుకోవచ్చు.


కార్తీక్ అనే ఓ యూజర్ తను సాధించిన ఫీట్‌కు సంబంధించిన ఫోటోస్ షేర్ చేశారు. తాను సింగిల్ ఛార్జ్‌తో 202 కిలోమీటర్లు ప్రయాణించానని, యావరేజ్ స్పీడ్ గంటకు 27 కిలోమీటర్లు అని, టాప్ స్పీడ్ గంటకు 48 కిలోమీటర్లు ప్రయాణించానని, ట్రాఫిక్‌లో వాహనం నడపడంతో పాటు హైవే పైనా ప్రయాణించానని వివరాలు వెల్లడించారు. కార్తీక్ అన్ని రికార్డుల్ని బద్దలు గొట్టాడంటూ ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీష్ అగర్వాల్ అభినందించడం విశేషం.

Bank Holidays: ఖాతాదారులకు అలర్ట్... జూన్, జూలైలో బ్యాంకులకు సెలవులు లేవు

ఓలా సీఈఓ ఇప్పటికే ఈ ఫీట్ సాధించిన వ్యక్తికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఉచితంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓలా ఎస్1 ప్రో గెరువా కలర్ మోడల్ స్పెషల్ ఎడిషన్‌గా లాంఛ్ అయింది. హోలీ సందర్భంగా ఈ కలర్‌ను లాంఛ్ చేసింది కంపెనీ. అప్పుడు ఈ కలర్ ఓలా ఎస్1 ప్రో కొనాలనుకునేవారి కోసం రెండు రోజులు పర్చేస్ విండో ఓపెన్ చేసింది. ఇక ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల మళ్లీ అమ్మకాలు ప్రారంభించింది.

PAN Card Rule: పాన్ కార్డ్ ఉన్నవారికి నేటి నుంచి కొత్త రూల్... వివరాలు ఇవ్వాల్సిందే

ఓలా ఎస్1 ప్రో ధర రూ.10,000 పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎక్స్ షోరూమ్ ధర రూ.1,39,000. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీతో ధర తగ్గుతుంది. ఇటీవల ఓఎస్ 2.0 రోల్ అవుట్ చేశామని, అందుకే ధర పెంచామని కంపెనీ వివరించింది. ఓలా ఎస్1 ప్రో స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 3.97 kWh యూనిట్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 181 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని కంపెనీ ప్రకటించింది. అయితే 200 కిలోమీటర్ల రేంజ్ కూడా దాటుతున్నట్టు వాహనదారులు ప్రకటించడం విశేషం. ఓలా ఎస్1 ప్రో కొనేవారికి పోర్టబుల్ హోమ్ ఛార్జర్ లభిస్తుంది. 6.30 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే గంటకు 115 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Electric bike, Electric Scooter, Ola electric, Ola Electric Scooter

తదుపరి వార్తలు