Home /News /business /

OLA ELECTRIC LAUNCHES OLA S1 ELECTRIC SCOOTER PRICED AT RS 99999 BUY THIS SCOOTER WITH RS 2999 EMI OFFER SS

Ola S1: ఓలా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్... ఈఎంఐ రూ.2,999 మాత్రమే

Ola S1: ఓలా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్... ఈఎంఐ రూ.2,999 మాత్రమే
(image: Ola Electric)

Ola S1: ఓలా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్... ఈఎంఐ రూ.2,999 మాత్రమే (image: Ola Electric)

Ola S1 Booking | ఓలా ఎలక్ట్రిక్ నుంచి నుంచి ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ (Ola S1 Electric Scooter) రిలీజైంది. కేవలం రూ.2,999 ఈఎంఐతో ఈ స్కూటర్ సొంతం చేసుకోవచ్చు. రూ.499 చెల్లించి ప్రీ-రిజర్వ్ చేయొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam
ఓలా ఎలక్ట్రిక్ నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooter) వచ్చేసింది. ఓలా ఎస్1 ప్రో చీపెస్ట్ వర్షన్ ఓలా ఎస్1 (Ola S1) మోడల్‌ను కంపెనీ రిలీజ్ చేసింది. ఇంట్రడక్టరీ ధర రూ.99,999. బుకింగ్ ప్రారంభమైంది. ఆగస్ట్ 15 నుంచి ఆగస్ట్ 31 వరకు కేవలం రూ.499 చెల్లించి ప్రీ-రిజర్వ్ చేసుకోవచ్చు. ప్రీ-రిజర్వ్ చేసినవారికి సెప్టెంబర్ 1న పర్చేసింగ్ విండో ఓపెన్ అవుతుంది. ఇతర కస్టమర్లు సెప్టెంబర్ 2 నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ సెప్టెంబర్ 7న ప్రారంభం అవుతుంది. రూ.2,999 ఈఎంఐతో ఈ స్కూటర్ సొంతం చేసుకోవచ్చు. లోన్ ప్రాసెసింగ్ ఫీజును కూడా మినహాయించింది ఓలా ఎలక్ట్రిక్.

ఇక భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓలా ఎస్1 ప్రో మోడల్‌ని కొత్త కలర్‌తో రిలీజ్ చేసింది కంపెనీ. ఖాకీ కలర్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే మార్ష్‌మెల్లో, నియో మింట్, పోర్సిలైన్ వైట్, కోరల్ గ్లామ్, జెట్ బ్లాక్, లిక్విడ్ సిల్వర్, మ్యాట్ బ్లాక్, అంత్రసైట్ గ్రే, గెరువా కలర్ ఆప్షన్స్‌లో ఓలా ఎస్1 ప్రో లభిస్తోంది. ఓలా ఎస్1 ప్రో ధర రూ.1,49,999.

IRCTC Tirupati Tour: విశాఖపట్నం నుంచి తిరుపతి 3 రోజుల టూర్... ప్యాకేజీ వివరాలివే


ఓలా ఎస్1 ఫీచర్స్ ఇవే


ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్ చూస్తే ఇందులో 3KWh ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. ఇకో, స్పోర్ట్స్, నార్మల్ మోడ్స్ ఉన్నాయి. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఇకో మోడ్‌తో 128 కిలోమీటర్లు, స్పోర్ట్స్ మోడ్‌తో 90 కిలోమీటర్లు, నార్మల్ మోడ్‌తో 101 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. గంటకు గరిష్టంగా 95 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు.

Aadhaar Center: రైల్వే స్టేషన్‌లో ఆధార్ సెంటర్... ఈ సేవలు ఉచితం

ఓలాకు చెందిన మూవ్ఓఎస్ 3 ద్వారా ఇది పనిచేస్తుంది. సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ ఈఏడాది దీపావళి నాటికి లభిస్తుంది. 7 అంగుళాల టచ్ స్క్రీమ్, 8కోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, బ్లూటూత్, వైఫై, జీపీఎస్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఐదు కలర్స్‌లో లభిస్తుంది. రెడ్, జెట్ బ్లాక్, పోర్సిలైన్ వైట్, నియో మింట్ (బ్లూ), లిక్విడ్ సిల్వర్ కలర్స్‌లో కొనొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ లాంటి ప్రముఖ బ్యాంకుల నుంచి ఈఎంఐ ఆఫర్స్ ఉన్నాయి. 12 శాతం వడ్డీతో ప్రీ-అప్రూవ్డ్ లోన్స్ లభిస్తాయి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Ola e Scooter, Ola electric

తదుపరి వార్తలు