Ola Electric: ఓలా నుంచి మరో సంచలనం.. ఎలక్ట్రిక్ బైక్‌లు, కార్లపై కీలక ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

Ola Electric: భవిష్యత్తులో భారత ఎలక్ట్రిక్​ వాహన​ విభాగాన్ని మరింత విస్తరిస్తామని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ తెలిపారు. ఓలా త్వరలోనే ఎలక్ట్రిక్ బైక్, ఎలక్ట్రిక్ కార్ విభాగాల్లోకి ప్రవేశిస్తుందని వెల్లడించారు.

  • Share this:
భారత్​లో ఎలక్ట్రిక్​ వాహనాల హవా ప్రారంభమైంది. సమీప భవిష్యత్తులో రోడ్లపై అంతా ఎలక్ట్రిక్​ వాహనాలే చక్కర్లు కొట్టనున్నాయి. ఇప్పటికే పలు ఆటోమొబైల్​ కంపెనీలతో పాటు కొత్త స్టార్టప్​లు సైతం ఈ రంగంలోకి అడుగుపెట్టాయి. ఈ మార్కెట్​లో ఓలా అన్నింటికంటే ముందు వరుసలో ఉంది. స్పష్టమైన ప్రణాళికతో ఓలా ఈ రంగంలోకి అడుగుపెట్టింది. ఓలా ఇటీవల విడుదల చేసిన ఎస్​1, ఎస్​1 ప్రో ట్రిమ్​ వేరియంట్లకు అద్బుతమైన స్పందన వచ్చింది. కేవలం రెండు రోజుల్లోనే రూ. 1,100 కోట్ల విలువైన అమ్మకాలను నమోదు చేసింది. ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో భారత ఎలక్ట్రిక్​ వాహన​ విభాగాన్ని మరింత విస్తరిస్తామని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ తెలిపారు. ఓలా త్వరలోనే ఎలక్ట్రిక్ బైక్, ఎలక్ట్రిక్ కార్ విభాగాల్లోకి ప్రవేశిస్తుందని  ఆయన వెల్లడించారు. ఈ మేరకు అగర్వాల్ గురువారం తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఒక బ్లాగ్ పోస్ట్‌ని పంచుకున్నారు.

‘‘కరోనా కారణంగా భారత్​లో వ్యక్తిగత వాహనాలకు ప్రాధాన్యత పెరిగింది. మరోవైపు, ఇంధన ధరలు పెరగడం, ప్రభుత్వ రాయితీల కారణంగా ఎలక్ట్రిక్​ వాహనాల వైపు చూసే వారి సంఖ్య కూడా పెరిగింది. అందుకే, రాబోయే కాలంలో ఎలక్ట్రిక్ బైక్, ఎలక్ట్రిక్ కార్ స్పేస్‌లోకి ప్రవేశించనున్నాం. మా ఓలా సంస్థ గతంలో టూవీలర్​, ఫోర్​ వీలర్​ మార్కెట్​లో లేదు. కేవలం క్యాబ్​ సేవలు మాత్రమే అందించేది. ఎందుకంటే ఇంధన ఆధారిత వాహనాల నిర్వహణ ఖరీదైనది. అంతేకాదు, ఇది పర్యావరణానికి కూడా హానికరం. అందుకే నేరుగా ఈవీ మార్కెట్​పై దృష్టిపెట్టాం.’’ అని భవిష్ అగర్వాల్ వెల్లడించారు.

Detel e-bike: రూ.40 వేలకే ఎలక్ట్రిక్ టూవీలర్... డీటెల్ ఈజీ ప్లస్ ఫీచర్స్ ఇవే



Audi e-tron GT: ఆడి నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు లాంచ్.. ధర ఎంతో  తెలుసా?

నవంబర్ 1 నుంచి ఆన్​లైన్​ విండో రీఓపెన్​..

సంస్థకు చెందిన ఎలక్ట్రిక్​ వాహనాలను ఏఐ ఆధారిత టెక్నాలజీతో రూపొందిస్తున్నామని భవిష్ తెలిపారు. 1.3 బిలియన్ కస్టమర్ల విభిన్న మొబిలిటీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేస్తున్నామని చెప్పారు. కస్టమర్లకు చౌక ధరలోనే బెస్ట్ ఎలక్ట్రిక్​ వాహనాలను అందించాలనే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రెండో దశ ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్ల అమ్మకాలు తిరిగి నవంబర్​ 1 నుంచి ప్రారంభం అవుతాయని ఓలా సీఈఓ పేర్కొన్నారు. ఇప్పటికే బుకింగ్​ చేసుకున్న కస్టమర్లకు సెప్టెంబర్ 8 నుంచి ఈ–స్కూటర్​ డెలివరీలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల డెలివరీలు అక్టోబర్​కు వాయిదా పడ్డాయి. ఫస్ట్​ ఫేజ్​లో బుకింగ్​ చేసుకున్న కస్టమర్ల ఇంటికి నేరుగా వీటిని డెలివరీ చేయనున్నారు.
Published by:Shiva Kumar Addula
First published: