Home /News /business /

OLA ELECTRIC CAR OR NEW S1 EV OLA CEO BHAVISH AGGARWAL DROPS MAJOR HINT AT AUGUST 15 LAUNCH GH SK

Ola Electric Car: ఓలా ఎలక్ట్రిక్ నుంచి మరో బిగ్ సర్‌ప్రైజ్.. ఆగస్ట్ 15న మెగా ఈవెంట్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ కారుతో పాటు, తక్కువ ధరకు న్యూ S1, ఓలా సెల్‌ ఫ్యాక్టరీ, కొత్త కలర్‌లో S1 అందుబాటులోకి తీసుకొచ్చే ఆప్షన్‌లతో భవిష్‌ అగర్వాల్‌ టిట్టర్‌లో పోల్‌ పెట్టారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
Ola Electric Car:  ఓలా ఎలక్ట్రిక్‌(Ola Electric) భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15న ఒక పెద్ద ఈవెంట్‌ను ప్లాన్‌ చేసింది. ఆగస్టు 15న భారీ అంచనాల మధ్య కంపెనీ తొలి ఎలక్ట్రిక్ కారును లాంచ్‌ చేయబోతోంది. అయితే ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన పోల్ ఆధారంగా.. ఇతర ప్రొడక్ట్‌లను కూడా లాంచ్‌ చేసే అవకాశం కనిపిస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ కారుతో పాటు, తక్కువ ధరకు న్యూ S1, ఓలా సెల్‌ ఫ్యాక్టరీ, కొత్త కలర్‌లో S1 అందుబాటులోకి తీసుకొచ్చే ఆప్షన్‌లతో భవిష్‌ అగర్వాల్‌ టిట్టర్‌లో పోల్‌ పెట్టారు.

ఆగస్టు 15న మరిన్ని అప్‌డేట్‌లు..
అగర్వాల్ గతంలో ఆగస్టు 15న లాంచ్ ఈవెంట్ గురించి టీజర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ట్వీట్‌లో స్పెసిఫిక్‌ డీటైల్స్‌ ఏవీ లేకపోయినప్పటికీ.. ఈ ఆగస్టు 15న కొత్త ప్రొడక్ట్‌ను లాంచ్‌ చేయడంపై చాలా సంతోషంగా ఉందని ఓలా చీఫ్ భవిష్‌ అగర్వాల్‌ చెప్పారు.



కంపెనీ బిగ్‌ సర్‌ప్రైజ్‌ను ప్లాన్‌ చేసి ఉండకపోతే కేవలం ఒక ప్రొడక్ట్‌ మాత్రమే లాంచ్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్ద భవిష్యత్తు ప్రణాళికల గురించి మరింత పంచుకుంటాను అని టీజర్‌లో అగర్వాల్ పేర్కొన్నారు. కంపెనీ పోర్ట్‌ఫోలియో విస్తరణకు సంబంధించిన ఓలా సెల్ ఫ్యాక్టరీ వంటి అప్‌డేట్‌ల గురించి ప్రకటించవచ్చని భావిస్తున్నారు.

ఇంతకు ముందే కారు టీజర్‌ రిలీజ్‌
ఓలా ఎలక్ట్రిక్ కారు పైప్ డ్రీం కాదు. కంపెనీ ఇప్పటికే కారు గ్లింప్‌లను ప్రివ్యూ చేసింది. జూన్‌లో జరిగిన ఓలా కస్టమర్ డేలో, కారు వీడియో టీజర్‌ను షేర్ చేసింది. దాని LED DRLలు ఎరుపు రంగులో కనిపించాయి. కారు ముందు, వెనుక డిజైన్ కూడా టీజర్‌లో స్పష్టంగా తెలిసింది. రెండు వైపులా ఓలా లోగో ఉంది. ఓలా ఎలక్ట్రిక్ కారుకు సంబంధించి అధికారికంగా స్పష్టమైన సమాచారం వెలువడలేదు. అయితే లైవ్ మింట్ నివేదిక ప్రకారం.. నాలుగు డోర్‌లతో కూపే-స్టైల్‌ రూఫ్‌లైన్‌తో కారు అందుబాటులోకి రానుంది.



ఉబర్‌తో కలిసే ఉద్దేశమే లేదు?
ఇటీవల ఓలా కంపెనీ వర్క్‌ఫోర్స్‌ను చాలా తగ్గించింది. ఓలా తన శ్రామిక శక్తిలో ఎక్కువ మందికి పింక్ స్లిప్‌లను అందజేసింది. కేవలం లేఆఫ్‌లు మాత్రమే కాదు, ఓలా ఎలక్ట్రిక్‌లోని అనేక మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లు కొన్ని నెలల వ్యవధిలో రాజీనామా చేశారు. కంపెనీ వ్యాపార దృక్పథం గురించి ప్రశ్నలు లేవనెత్తారు. ప్రత్యర్థి ఉబెర్‌తో వ్యాపారాన్ని విలీనం చేయడానికి కంపెనీ చూస్తోందని ఇటీవల వచ్చిన నివేదికను కూడా అగర్వాల్ ఖండించారు. దీనికి సంబంధించి ఆయన చేసిన ఓ ట్వీట్‌లో..‘ పూర్తిగా ఆ నివేదికలోని అంశాలు అసత్యం. మేం చాలా లాభదాయకంగా, బాగా అభివృద్ధి చెందుతున్నాం. ఇతర కంపెనీలు భారతదేశం నుంచి తమ వ్యాపారాన్ని నిష్క్రమించాలనుకుంటే వారికి స్వాగతం! మేం ఎప్పటికీ విలీనం కాలేం' అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Business, Ola electric, Ola Electric Car, Ola Electric Scooter

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు