Home /News /business /

OLA ELECTRIC CAR CONCEPT DESIGN IMAGE REVEALED NEW FUTUREFACTORY ON THE CARDS GH VB

Ola Electric Car: ఆకట్టుకుంటున్న ఓలా ఎలక్ట్రిక్ కారు డిజైన్.. మార్కెట్​లోకి ఎప్పుడొస్తుందంటే..

ఫోటోను ట్వీట్​ చేసిన సీఈవో భవిష్​ అగర్వాల్​..

ఫోటోను ట్వీట్​ చేసిన సీఈవో భవిష్​ అగర్వాల్​..

భారత గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఓలా సీఈవో రాబోయే ఎలక్ట్రిక్​ కారు టీజర్​ ఫోటోను ట్వీట్​ చేశారు. సిల్వర్​ కలర్‌లో టాప్​ మొత్తం బ్లాక్ కలర్ గ్లాస్​తో కవర్​ చేసి ఉన్న ఈ కారు అందర్నీ ఆకట్టుకుంటోంది.

భారత ఎలక్ట్రిక్​ టూవీలర్(Electric Two Wheeler)​ మార్కెట్​లో దూసుకుపోతున్న ఓలా(Ola)  సంస్థ ఇప్పుడు ఎలక్ట్రిక్​ ఫోర్​ వీలర్​ వాహనాలపై దృష్టి పెట్టింది. సంస్థ నుంచి త్వరలోనే తొలి ఎలక్ట్రిక్​ కారును లాంచ్​ చేయనున్నట్లు ఓలా సీఈఓ(CEO) భవిష్ అగర్వాల్ గతేడాది ట్వీట్​ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత దీనికి సంబంధించిన ఎటువంటి అప్​డేట్​ ఇవ్వలేదు. భారత గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఓలా సీఈవో రాబోయే ఎలక్ట్రిక్​ కారు టీజర్​ ఫోటోను ట్వీట్(Tweet)​ చేశారు. సిల్వర్​ కలర్‌లో టాప్​ మొత్తం బ్లాక్ కలర్ గ్లాస్​తో కవర్​ చేసి ఉన్న ఈ కారు అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇది అచ్చం నిస్సాన్​ లీఫ్​ ఈవీ కారు మాదిరిగా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్​ చేస్తున్నారు. ఓలా విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్​ కారు డిజైన్​ ‘కాన్సెప్ట్’​ మాదిరిగా కనిపిస్తోందని మరిందరు నెటిజన్లు చెబుతున్నారు. ఇది స్టైలిష్​ బ్యాటరీ ఎలక్ట్రిక్​ హ్యాచ్​బ్యాక్​గా ఉండనుంది.

స్మాల్​ హ్యాచ్​బ్యాక్​తో టెస్లా మోడల్​ 3 లాగా ఓలా ఎలక్ట్రిక్​ కారు ఉందన్న కామెంట్స్​ సైతం వినిపిస్తున్నాయి. చిత్రంలో ఉన్న కారు డిజైన్​ను పరిశీలిస్తే.. విండ్‌షీల్డ్, లైట్ స్ట్రిప్, వెనుక హాంచ్‌లు, పెద్ద చక్రాలతో చాలా ఫ్యూచరిస్టిక్‌గా కనిపిస్తుంది. ఫోటోలోని డిజైన్​లో ఎలక్ట్రిక్ కారును ఉత్పత్తి చేయడానికి చాలా ఖర్చవుతుందని నిపుణులు చెబతున్నారు. కాగా, ఓలా ఎలక్ట్రిక్​ కారు ఎప్పుడు విడుదలవుతుంది? అని నెటిజన్లు అడగ్గా.. 2023లో విడుదల చేయనున్నట్లు ఓలా సీఈవో బదులిచ్చారు.



2023లో మార్కెట్​లోకి ఓలా ఎలక్ట్రిక్​ కార్లు..
ఎలక్ట్రిక్ కార్ల రంగంలోకి ప్రవేశించాలని కంపెనీ గతంలోనే నిర్ణయించింది. కంపెనీ ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్లపై పని చేస్తుందని, తమ మొదటి కారును 2023లో ప్రవేశపెట్టనున్నామని భవిష్ అగర్వాల్ గతంలోనే ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు జపాన్​కు చెందిన సాఫ్ట్​ బ్యాంక్​ గ్రూప్​ మద్దతు ఇస్తుందని భవిష్ అగర్వాల్​ గతంలో చెప్పారు. భారతదేశాన్ని గ్లోబల్​ ఎలక్ట్రిక్​ వాహనాల హబ్​గా మార్చడమే తమ సంస్థ ముందున్న లక్ష్యంగా ఆయన నొక్కి చెప్పారు.

ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్లు తమిళనాడులోని ఈవీ ఫ్యూచర్​ ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి. ఈ తయారీ యూనిట్​ ప్రస్తుతం ఎలక్ట్రిక్​ స్కూటర్ల కోసం పనిచేస్తున్న ప్రపంచంలోనే అతి పెద్ద ప్లాంట్​గా పేరొందింది. అయితే, ఈ ఫ్యాక్టరీలో ఫోర్​ వీలర్లను తయారు చేసే అవకాశం లేదు. అందువల్ల, ఎలక్ట్రిక్​ కార్ల తయారీ కోసం కంపెనీ త్వరలోనే కొత్త ఫ్యూచర్‌ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
Published by:Veera Babu
First published:

Tags: Ola electric, Ola Electric Car

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు