Home /News /business /

OLA ELECTRIC CAR AN ELECTRIC CAR COMING FROM OLA WITH AUTONOMOUS DRIVING FEATURE IT WILL BE LAUNCHED ON THAT DATE GH VB

Ola Electric Car : ఓలా నుంచి అటానమస్ డ్రైవింగ్‌ ఫీచర్‌తో రానున్న ఎలక్ట్రిక్ కారు.. లాంచ్ ఎప్పుడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా (Ola) ఇండియాలో ఈ-స్కూటర్లను రిలీజ్ చేసి బాగా పాపులర్ అయింది. అయితే ఇప్పుడు ఈ కంపెనీ ఓ ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్‌ని (Four Wheeler Electric Vehicle) కూడా ఇండియాలో లాంచ్ చేసేందుకు రెడీ అయింది.

ఇంకా చదవండి ...
దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) తయారీ సంస్థ ఓలా (Ola) ఇండియా(India)లో ఈ-స్కూటర్లను(E Scooters) రిలీజ్(Release) చేసి బాగా పాపులర్(Popular) అయింది. అయితే ఇప్పుడు ఈ కంపెనీ ఓ ఫోర్ వీలర్(Four Wheeler) ఎలక్ట్రిక్ వెహికల్‌ని (Four Wheeler Electric Vehicle) కూడా ఇండియాలో లాంచ్ చేసేందుకు రెడీ అయింది. ఈ ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్‌లో అటానమస్ లేదా ఆటోనమస్ (Autonomous) టెక్నాలజీని అందిస్తామని ఓలా ప్రకటించడం విశేషం. ఓ ఎలక్ట్రిక్ కారు (Electric Car)తో అటానమస్ వాహనాల విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు తాజాగా ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ప్రకటించారు. అయితే ఈ అటానమస్ లేదా సెల్ఫ్-డ్రైవింగ్ ఫీచర్‌ను తమ టూవీలర్ల ఎస్1 సిరీస్‌తో లాంచ్ చేయడం లేదని ఆయన తెలిపారు. ఈ టెక్నాలజీని ఎలక్ట్రిక్ కారు కోసమే అభివృద్ధి చేస్తున్నామన్నారు. అటానమస్ వెహికల్‌ని ఓలా కంపెనీ టెస్ట్ చేయడం ప్రారంభించిందని, ఇది దాదాపు రెండేళ్లలో గ్లోబల్ మార్కెట్‌లోకి విడుదలవుతుందని భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు.

శనివారం తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలోని ఓలా ఫ్యూచర్‌ఫ్యాక్టరీలో భవిష్ అగర్వాల్ విలేకరులతో ముచ్చటించారు. ఓలా దేశీయంగా అభివృద్ధి చేసిన అటానమస్ టెక్నాలజీతో మాస్-లెవల్ వెహికల్‌గా ఉండే ఓ కారును లాంచ్ చేయడానికి సిద్ధమవుతోందని ఈ సందర్భంగా వెల్లడించారు. టెస్లా (Tesla), రివియన్ (Rivian) వంటి కార్లకు ఏ మాత్రం తీసుపోని విధంగా రాబోయే ఫోర్-వీలర్ ఈవీని అటానమస్ ఫీచర్‌తో అభివృద్ధి చేస్తున్నట్లు అగర్వాల్ తెలిపారు. టెస్టింగ్, డెవలప్‌మెంట్ పూర్తయిన తర్వాత ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కారును ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి, ఓలా ఎలక్ట్రిక్ అటానమస్ డ్రైవింగ్ ఫీచర్ డెవలప్‌మెంట్ స్టేజీలోనే ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఫైనల్ ప్రొడక్ట్ వెర్షన్‌తో ఈ టెక్నాలజీ లాంచ్ అవుతుంది.

Top Automatic Cars: కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? రూ.7 లక్షలలోపు లభిస్తున్న ఈ కార్లపై ఓ లుక్కేయండి..


"ఓలా ఎలక్ట్రిక్ దాదాపు ఆరు నెలల క్రితం అటానమస్ వెహికల్‌ని టెస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. 2023 చివరి నాటికి లేదా 2024 ప్రారంభంలో దీనిని ప్రపంచ మార్కెట్లలో విడుదల చేస్తుంది" అని అగర్వాల్ చెప్పారు. అతని ప్రకారం, ఓలా ఎలక్ట్రిక్ సుమారు రూ.10 లక్షలతో ఈ కారును లాంచ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ధరలతో తీసుకొస్తే చాలామంది కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని కంపెనీ భావిస్తోంది. అయితే కేవలం భారతదేశాన్ని మాత్రమే కాకుండా, ప్రపంచ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ఫీచర్ అభివృద్ధి చేస్తున్నామని భవిష్ అగర్వాల్ స్పష్టం చేశారు.

ఓలా ఎలక్ట్రిక్ ప్రోటోటైప్ అటానమస్ వెహికల్‌లో 3 లైడార్ సెన్సార్లు, ఒక జీపీఎస్ సెన్సార్, ఆబ్జెక్ట్ డిటెక్షన్ కోసం ఒక కెమెరా ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ ప్రోటోటైప్ వాహనంలో ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్, ఆటో డ్రైవింగ్, క్రాష్ అవాయిడ్, ఆటోమేటిక్ బ్రేకింగ్, ఆటో స్పీడ్ కంట్రోల్ వంటి అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీ ఉందని సమాచారం.

ప్రస్తుతం, ఓలా S1, S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లతో కోసం త్వరలోనే MoveOS 2.0 ఆపరేటింగ్ సిస్టమ్‌ను విడుదల చేయనుంది. ప్రస్తుతానికి, ఈ సాఫ్ట్‌వేర్ బీటా మోడ్‌లో ఉంది. ఫ్యూచర్ ప్లాన్స్‌లో భాగంగా ఓలా ఎలక్ట్రిక్ ఈ ఏడాది చివర్లో తక్కువ ధర కలిగిన ఓలా ఎస్1 స్కూటర్‌ను కూడా విడుదల చేయాలని యోచిస్తోంది.
Published by:Veera Babu
First published:

Tags: Electric cars, Electric Vehicles, Ola Electric Car

తదుపరి వార్తలు