Electric Scooter | ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ తాజాగా కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌ను ఆవిష్కరించింది. కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ (Ola) కొనుగోలుదారుల కోసం ఈ కొత్త ప్లాన్స్‌ను తీసుకువచ్చింది. ఓలా కేర్, ఓలా కేర్ ప్లస్ అనే రెండు ప్లాన్లను ఆవిష్కరించింది. ఓలా కేర్ ధర ఏడాదికి రూ. 1999గా ఉంది. అలాగే ఓలా కేర్ ప్లస్ ధర ఏడాదికి రూ. 2,999గా ఉందని కంపెనీ వెల్లడించింది. దీనికి జీఎస్‌టీ (GST) అదనం.
ఓలా కేర్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌లో భాగంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన వారికి ఫ్రీ హోమ్ సర్వీసింగ్ లభిస్తుంది. అంటే ఇంటి వద్దకే వచ్చి ఓలా స్కూటర్ తీసుకెళ్తారు. సర్వీసింగ్ అయిపోయిన తర్వాత మళ్లీ ఇంటికి స్కూటర్‌ను తిరిగి తెచ్చిస్తారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండానే సర్వీసింగ్ పని అయిపోతుంది. ఇంకా థెఫ్ట్ అసిస్టెన్స్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటివి కూడా ఉంటాయి.
ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్స్.. ఇక వారికి 2 రోజుల్లోనే అకౌంట్‌లోకి డబ్బులు!
అలాగే నాన్ యాక్సిడెంటల్, నాన్ ఇన్సూరెన్స్ వంటి పరిస్థితుల్లో కస్టమర్లకు ఉచితంగానే కన్సూమబుల్ రీప్లేస్‌మెంట్ బెనిఫిట్ లభిస్తుంది. అలాగే ఓలా కేర్ ప్లాన్ ద్వారా ఫ్రీ లేబర్ ఆన్ సర్వీస్, థెఫ్ట్ అసిస్టెన్స్, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి ప్రయోజనాలు పొందొచ్చు. అలాగే ఓలా కేర్ ప్లస్ ప్లాన్ ద్వారా అయితే వార్షిక సమగ్ర డయాగ్నసిస్, ఫ్రీ హోమ్ సర్వీస్, పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ, ఫ్రీ కన్సూమబుల్స్, 24 గంటలు డాక్టర్ అండ్ అంబులెన్స్ సర్వీస్ వంటివి పొందొచ్చు.
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే వారికి శుభవార్త.. ఏకంగా 6 ఆఫర్లు, భారీ తగ్గింపు పొందండిలా!
అలాగే ఓలా కేర్ ప్లస్ ప్లాన్‌లో ఇంకా ఉచిత ట్యాక్సీ రైడ్ బెనిఫిట్ కూడా పొందొచ్చు. ఓలా స్కూటర్ ట్రబుల్ ఇస్తే.. అప్పుడు ఈ సదుపాయం లభిస్తుంది. ఇంకా వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రేక్ డౌన్ అయితే అప్పుడు అక్కడ ఉచితంగానే హోటల్ అకామోడేషన్ లభిస్తుంది. అలాగే వెహికల్ కస్టడీ సర్వీస్ కూడా లభిస్తుంది.
ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖందేల్‌వాల్ మాట్లాడుతూ.. కస్టమర్ సెంట్రిక్ బ్రాండ్‌గా కొనసాగుతూ వస్తున్నామని, అందుకే వారి కోసం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ తీసుకువచ్చామని వెల్లఢించారు. స్కూటర్ కొనుగోలు తర్వాత కూడా కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించాలనే లక్ష్యంతో ఈ కొత్త ప్లాన్స్ ఆవిష్కరించామని తెలిపారు. ఇకపోతే ఓలా ఎలక్ట్రిక్ మూడు రకాల మోడళ్లను అందిస్తోంది. ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో, ఓలా ఎస్1 ఎయిర్ అనేవి ఇవి. ఓలా ఎస్1 ఎయిర్ అనేది ఆఫర్డబుల్ స్కూటర్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Electric Scooter, Ev scooters, Ola e Scooter, Ola Electric Scooter, SCOOTER