Ola Electric : ఇండియాలో ఎలక్ట్రిక్ టూవీలర్లతో(Electric Two Wheelers) గుర్తింపు తెచ్చుకున్న ఓలా(Ola) కంపెనీ నుంచి మరో కొత్త ఇ-స్కూటర్ రిలీజ్ అయింది. ‘ఓలా S1 ఎయిర్’ పేరుతో అధికారికంగా లాంచ్ అయిన ఈ వెహికల్ దేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్(Electic Scooter)గా నిలుస్తోంది. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 85,000 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్, సుజుకి యాక్సెస్, యమహా ఫాసినోలతో పోటీ పడనుంది. అయితే హోండా యాక్టివా సిరీస్‌కు ఈ కొత్త ఈవీని పోటీగా నిలపాలని ఓలా భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఓలా ఎలక్ట్రిక్ నుంచి ఇండియాలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లో ఉండగా, తాజాగా రిలీజ్ అయినది మూడో మోడల్. ఓలా S1, ఓలా S1 ప్రో ధరలు వరుసగా రూ. 99,999, రూ. 1,29,000 వరకు ఉన్నాయి. ఓలా ఎస్1లో 3kWh బ్యాటరీ 141 కి.మీ రేంజ్‌ను, ఓలా ఎస్1 ప్రో మోడల్లోని 4kWh బ్యాటరీ 181km రేంజ్‌ను అందిస్తాయి.
ఓలా S1 ఎయిర్ ప్రత్యేకతలు
కొత్త ఇ-స్కూటర్ పాత ఓలా మోడళ్లకు సక్సెసర్‌గా వస్తున్నప్పటికీ, దీని రేంజ్ తక్కువగా ఉంది. దీంట్లో 2.5KWh బ్యాటరీని అందించారు. ఓలా ఎస్1 ఎయిర్ ఈవీ కోరల్ గ్లామ్, జెట్ బ్లాక్, లిక్విడ్ సిల్వర్, నియో మింట్, పింగాణీ వైట్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది. తాజా MoveOS 3తో వచ్చే ఈ లేటెస్ట్ స్కూటర్ 76కిమీ రైడింగ్ రేంజ్‌ను అందిస్తుంది. ఓలా ప్రొడక్ట్స్ అన్నీ ఇప్పుడు మూవ్ OS 3.0 సాఫ్ట్వేర్ అప్డేట్ను పొందాయి. ఈ మోడల్‌తో కంపెనీ కేవలం టైర్ 1 నగరాలను మాత్రమే కాకుండా, టైర్ 2, టైర్ 3 మార్కెట్లను కూడా లక్ష్యంగా పెట్టుకుంది.
Padampani School: ఆ స్కూల్ లో ఫీజుకు బదులుగా ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకుంటున్నారు
హోండా యాక్టివాతో పోటీ
హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI), 2001లో యాక్టివా బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దీన్ని మూడు వేరియంట్లలో విక్రయిస్తోంది. బేస్ మోడల్ ధర రూ. 73,086- రూ. 75,586, యాక్టివా 125 ధర రూ. 76,025- రూ. 88,960, యాక్టివా ప్రీమియం రూ. 76,587గా (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ ధరలు) ఉంది. ప్రస్తుతం ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్. గత క్యాలెండర్ ఇయర్లో దాదాపు 2,23,621 యూనిట్లు సేల్ అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో ఓలా దూసుకుపోతోంది. పేలవమైన డిమాండ్ కారణంగా ఈ సంవత్సరం ప్రారంభంలో నిలిపివేసిన ఓలా S1 వేరియంట్ అమ్మకాలను ఆగస్టు 15న అదే ధరతో తిరిగి ప్రవేశపెట్టారు. దీంతో ఈ బ్రాండ్ ఈవీల అమ్మకాలు పెరిగాయి. గత నెలలో మొత్తం అమ్మకాల్లో 9,800 యూనిట్లకు పైగా ఇదే మోడల్ ఉండటం విశేషం. తద్వారా E2W విభాగంలో ఓలా మళ్లీ అగ్రస్థానానికి చేరింది. ప్రభుత్వ వెబ్సైట్ వాహన్ డేటా ఈ గణాంకాలను వెల్లడించింది.
వాటికంటే ముందు..
E2W విభాగంలో ఒకినావా, హీరో ఎలక్ట్రిక్, ఆంపియర్, అథర్ ఎనర్జీ, TVS, బజాజ్ ఆటో కంటే ఓలా చాలా ముందు ఉంది. రూ.80,000 కంటే తక్కువ ధరలో తాజాగా ఇ-స్కూటర్‌ను లాంచ్ చేసిన కంపెనీ.. తన ప్రస్తుత స్థానాన్ని మరింత మెరుగుపర్చుకోవడంతో పాటు మొత్తం సేల్స్‌లో హోండా యాక్టివాను మించి పోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఓలా ఎలక్ట్రిక్ నుంచి ఎలక్ట్రిక్ కారు కూడా విడుదల కానుంది. 500 కిమీ రేంజ్‌ను అందించే ఈ ఎలక్ట్రిక్ కారు 2024 నాటికి మార్కెట్లోకి రానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Electric Scooter, Ola bikes