Ola Electric : ప్రపంచ దేశాలు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నాయి. అందుకే అన్ని దేశాలు ఎలక్ట్రిక్ వాహనాలను(Electric Vehicles) ప్రోత్సహిస్తున్నాయి. ఇండియాలో కూడా కొన్ని సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ కనిపిస్తోంది. ఇండియాలో ఆటో దిగ్గజాలు ఎలక్ట్రిక్ బైక్, ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేస్తున్నాయి. ఇప్పటికే టాటా మోటార్స్ అత్యధికంగా ఈవీ కార్లను విక్రయించిన కంపెనీగా రికార్డ్ నెలకొల్పింది. అయితే ఎలక్ట్రిక్ బైక్‌ల సెగ్మెంట్లో ఓలా ఎలక్ట్రిక్(Ola Electric) కంపెనీ దూసుకెళ్తోంది. ఈ కంపెనీ తమిళనాడు(Tamilnadu)లోని కృష్ణగిరిలోని ఫ్యూచర్ ఫ్యాక్టరీలో మొత్తం లక్ష బైక్‌లను తయారు చేసిన మైలురాయిని చేరుకొంది. ఇటీవలే ఫ్యూచర్ ఫ్యాక్టరీ నుంచి లక్షవ స్కూటర్‌ను లాంచ్ చేసింది. గత ఏడాది నవంబర్ చివరిలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రారంభించిన కంపెనీ కేవలం 10 నెలల్లోనే ఈ ఘనత సాధించడం గమనార్హం.
20,000 యూనిట్ల విక్రయం
2021లో ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. 2022 అక్టోబర్‌లో ఓలా 20,000 యూనిట్ల ఎలక్ట్రిక్ బైక్‌లను విక్రయించింది. ఇండియన్ మార్కెట్లోని ఇతర ఈవీ బ్రాండ్లకంటే ఓలా చాలా ముందుంది. ఇది మొత్తం EV సెగ్మెంట్‌ను రెండు రెట్లు అధిగమించి. నెలవారీగా 60 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఓలా ఇప్పుడు ప్యాసింజర్ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. కొత్త ఈవీ కార్‌ను 2024 నాటికి లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 15న ఓలా తొలిసారిగా కార్ గ్లింప్స్‌ను అందించింది. దీన్ని భారతదేశంలోనే అత్యంత స్పోర్టియస్ట్ కార్గా కంపెనీ పేర్కొంది.
మరో లక్ష అతి త్వరలో అందుకుంటాం
ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఇండియాలో ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి, వినియోగదారులకు మెరుగైన పెట్రోల్ ప్రత్యామ్నాయాలను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పుడు చేరుకున్న మైలురాళ్లు ప్రారంభం మాత్రమే అని చెప్పారు. ఈవీల కొనుగోళ్ల వేగం పెరిగిందని, తదుపరి లక్షను అతి తక్కువ కాలంలోనే చేరుకుంటామని చెప్పారు. మిషన్ ఎలక్ట్రిక్‌ను చేరుకోవడానికి భారతదేశం చాలా దగ్గరగా ఉందని పేర్కొన్నారు. భవిష్ అగర్వాల్ నేతృత్వంలోని బ్రాండ్ తన D2C అనుభవ కేంద్రాలను దేశవ్యాప్తంగా 50 యాక్టివిటీస్‌తో విస్తరిస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి వివిధ ఫార్మాట్లలో ఇటువంటి 200 కేంద్రాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
2023లో S1 ఎయిర్ అందుబాటులోకి
కొన్ని రోజుల క్రితం ఓలా మూడో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను S1 ఎయిర్‌ను లాంచ్ చేసింది. ఈ బైక్‌ను రూ.84,999కి అందుబాటులోకి తీసుకొచ్చింది. S1, S1 ప్రోతో పోలిస్తే ఈ లేటెస్ట్ బైక్ అతి తక్కువ ధరకు లభిస్తోంది. ఈ బైక్ డెలివరీలు 2023 ఏప్రిల్‌లో ప్రారంభమవుతాయి. బుకింగ్‌లు రెండు నెలల ముందు 2023 ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ola e Scooter, Tamilnadu