Ola E-Scooter: ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ ప్రారంభ తేదీపై కీలక ప్రకటన.. వివరాలివే..

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ (image: ola electric)

Ola E-Scooter: ట్విట్టర్‌లో ఓలా సీఈఓ భవిష్‌ అగర్వాల్‌ ఓలా ఎలక్ట్రిక్ ఇ-స్కూటర్ ను లాంచ్ చేసే తేదీ గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఎంత వీలుంటే అంత త్వరగా ఓలా స్కూటర్ ను లాంచ్ చేస్తామంటూ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    ప్రపంచవ్యాప్తంగా ఓలా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ పై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. జూలై 15 సాయంత్రం ఇ-స్కూటర్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఓలా ఎలక్ట్రిక్ యొక్క ఇ-స్కూటర్ కంపెనీ తన బుకింగ్‌లను ప్రారంభించినప్పుడు మార్కెట్‌లో కొంత సంచలనం కలిగించింది. బుకింగ్స్ ప్రారంభించిన మొదటి 24 గంటల్లో ఇది 1 లక్షకు పైగా రిజర్వేషన్లను పొందింది. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా బుక్ చేసుకున్న స్కూటర్‌గా నిలిచింది. అప్పటి నుంచి ఓలా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది. వస్తే దాని మైలేజీ ఎలా ఉంటుంది అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. బైక్స్ లవర్స్ ను కూడా ఈ బైక్ లాంచింగ్ కోసం కళ్లల్లో ఒత్తులు పెట్టుకొని మరీ వెయిట్ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఓలా సీఈఓ భవిష్‌ అగర్వాల్‌ బెంగళూరు రోడ్లపై చక్కెర్లు కొట్టిన ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌ వీడియోల్ని షేర్‌ చేశారు. అప్పటి నుంచి ఓలా ఈవీ టూవీలర్‌ స్పీడ్‌ ఎంత? ఎంత మైలేజ్‌ ఇస్తుంది.

    దాని ఫీచర్లేంటో తెలుసుకునే పనిలో పడ్డారు ఔత్సాహికులు. అయితే వారి ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తూ భవిష్‌ అగర్వాల్‌ బైక్‌ గురించి ట్వీట్‌ చేస్తున్నారు. తాజాగా ఈ బైక్‌ ఎప్పుడొస్తుందో చెప్పే ప్రయత్నం చేశారు. వారు ఓ పచ్చని చెట్లపై కూర్చొని కాఫీని తాగుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అత్యంత త్వరలోనే ఈ బైక్ ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి ఎవరినీ వెయిట్ చేయించం.. ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా లాంచింగ్ ఉంటుందన్నారు. అంతేకాదు మీ బైక్‌ ను ఎలా కొనాలని అనుకుంటున్నారు? అంటూ రెండు ఆప్షన్‌లు ఇచ్చారు భవిష్‌ అగర్వాల్‌ .






    అందులో ఒకటి ఆన్‌లైన్‌ హోండ్‌ డెలివరీ కాగా రెండో ఆప్షన్‌ ఫిజికల్‌ డీలర్‌ షిప్‌/ స‍్టోర్‌ లో కొనుగోలు చేయాలని అనుకుంటున‍్నారా అని ప్రశ్నించారు. భవిష్‌ ట్వీట‍్లపై స్పందించిన నెటిజన్లు ఆన్‌ లైన్‌ హోం డెలివరీ కావాలని అడుగుతుండగా.. వారిలో ఎక్కువ మంది ఫ్యూయల్‌ బైక్‌ పై ఎక్సేంజ్‌ ఆఫర్‌ లో ఓలా ఈవీ బైక్‌ ను అందించాలని కోరుతున్నారు. అంతే కాకుండా ఈ ఓలా లక్ట్రిక్‌ వెహికల్ బైక్ మైలేజీ ఎంత ఉండాలని కోరుకుటున్నారని పోల్ పెట్టగా.. ఎక్కువ శాతం మంది 100 kmph ఉండాలంటూ పోల్ లో పాల్గొన్నారు. ఈ ట్వీట్ ను జూలై 24 న పోస్ట్ చేశారు.
    Published by:Veera Babu
    First published: