OLA COMPANY IS IN THE PROCESS OF FURTHER EXPANDING ITS ELECTRIC VEHICLE MARKET THATS WHY NOW FOCUSING ON THE MANUFACTURE OF ELECTRIC BIKES PRV GH
Ola Electric: వచ్చే ఏడాదిలో ఈ-బైక్స్ తీసుకురానున్న ఓలా.. మార్కెట్ విస్తరణే లక్ష్యంగా ముందుకు..
ప్రతీకాత్మక చిత్రం
ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ ఓలా తమ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌ను మరింత విస్తరించే పనిలో పడింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ల లాంచింగ్‌తో దూకుడుమీదున్న ఓలా.. ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీపై దృష్టి పెట్టింది.
ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ (Electric vehicle) స్టార్టప్ ఓలా తమ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌ను మరింత విస్తరించే పనిలో పడింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ల (Electric scooters) లాంచింగ్‌తో దూకుడుమీదున్న ఓలా (OLA).. ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీపై దృష్టి పెట్టింది. వచ్చే ఏడాది నుంచి ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేస్తామని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ (Bhavesh Agarwal) పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ-స్కూటర్ మార్కెట్లో ఉన్న ఓలా.. త్వరలోనే ఈ–బైక్, ఈ–కార్ మార్కెట్ (E car market) కు వ్యాపారాన్ని విస్తరించాలని యోచిస్తోంది. ఈ వివరాలను ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ తన బ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు.
ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు (Electric motor cycles), చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తికి సంబంధించిన ట్విట్టర్ పోస్ట్‌ను ఆయన రీట్వీట్ చేస్తూ “అవును.. వచ్చే ఏడాది నుంచి ఎలక్ట్రిక్ సైకిళ్లను మార్కెట్లోకి తెస్తాం. భారత్ ఎలక్ట్రిక్ మార్కెట్లో అగ్రస్థానమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాం.” అని రాసుకొచ్చారు. ఓలా సంస్థ సెప్టెంబర్‌లో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు, కార్లను అభివృద్ధి చేయడానికి 200 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 1500 కోట్లు)ను సేకరించింది. ఓలా తన ‘మిషన్ ఎలక్ట్రిక్’ను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ నిధులను సమీకరించినట్లు భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు. 2025 నాటికి దేశీయ రోడ్లపై పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనం ఉండదని కంపెనీ అంచనా వేస్తోంది.
డిసెంబర్ 16 నుంచి రెండో విడత అమ్మకాలు..
ఓలా ఈ సంవత్సరం ఆగస్టులో మొదటి బ్యాటరీ ఆధారిత స్కూటర్ అయిన Ola S1, S1 ప్రో మోడళ్లను విడుదల చేసింది. ఈ మోడల్‌ను ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, అహ్మదాబాద్ వంటి నగరాల్లో టెస్ట్ డ్రైవ్‌ల కోసం అందుబాటులోకి తెచ్చింది. టెస్ట్ రైడ్‌లో ఇవి అద్భుతమైన పనితీరు కనబర్చాయి. వాహన డెలివరీలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయంపై ఇంకా స్పష్టత లేనప్పటికీ.. టెస్ట్ రైడ్లు ముగిసిన వెంటనే మొదటి బ్యాచ్ డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఈ కంపెనీ మొదటి విడత ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలను సెప్టెంబర్ (September)లో ప్రారంభించింది. వాటికి అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో మొదటి విడత (first term) స్టాక్ క్లోజ్ అయ్యింది. రెండో విడత అమ్మకాలు డిసెంబర్ 16 న ప్రారంభంకానున్నాయి. ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు S1, S1 ప్రో అనే రెండు ట్రిమ్ వేరియంట్లలో లభిస్తున్నాయి. ఓలా S1 ధర రూ.1 లక్షగా ఉంది. S1 ప్రో స్కూటర్ రూ.1.30 లక్షల ధర వద్ద అందుబాటులో ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.