OLA BIKE MODI GOOD NEWS OLA SHOCKING NEWS ELECTRIC BIKE PRICES INCREASE TERRIBLY EVK
Ola Bike: మోడీ గుడ్ న్యూస్, ఓలా షాకింగ్ న్యూస్.. ఎలక్ట్రికల్ బైక్ ధరలు భయంకరంగా పెంపు
తమ పార్లమెంట్ నియోజకవర్గాల్లో మురుగునీటిని ఉపయోగించి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసేందుకు చొరవ తీసుకోవాలని ఎంపీలను గడ్కరీ కోరారు. త్వరలో హైడ్రోజన్ చౌకైన ప్రత్యామ్నాయ ఇంధనంగా మారనుందని.. గరిష్టంగా, రెండేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతాయని అన్నారు. వాటి ధర పెట్రోల్-డీజిల్ వాహనాలతో సమానంగా ఉంటుందని చెప్పారు.
OLA E-bike Price | ఇటీవల పెట్రోల్ ధర పెరుగుదలతో చాలా మంది ఎలక్ట్రిక్ బైక్‌లపై ఆసక్తి పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్ ధరలపై ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఓలా బైక్ ధర భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకొంది.
ఇటీవల పెట్రోల్ ధర పెరుగుదలతో చాలా మంది ఎలక్ట్రిక్ బైక్ (Electric Bike) లపై ఆసక్తి పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్ ధర రూ.120పైగా పలుకుతోంది. ఐతే కేంద్రం పెట్రోల్ పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో లీటర్ పెట్రోల్ పై రూ.9.50పైసలు, డీజిల్ పై రూ.7 వరకు తగ్గే అవకాశముందని ప్రకటించింది. దీంతో పెట్రోల్ ధరలతో సామాన్యులకు ఊరట అందనుంది. పెట్రోల్ ధరలు తగ్గడంతో సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు అయితే.. ఈ గుడ్ న్యూస్‌తో పాటు.. ఈ-బైక్‌ల ప్రియులకు షాకింగ్ న్యూస్ తగిలింది. ఓలా ఎలక్ట్రిక్ S1 ప్రో మోడల్ ధరలో ధరను అమాంతం పెంచేసింది. కనిపించింది. S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కొత్త ధర రూ. 1,39,999గా పేర్కొంది. మొదట ధర రూ. 1,29,999 గా ఉండేది. కొత్త ధర కంపెనీ అధికారిక వెబ్సైట్లో అప్డేట్ చేసింది. అంటే దాదాపుగా రూ.10,000 ధర పెంచేసింది.
ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్స్ (Electric Scooters) తయారీదారు ఓలా (Ola electric scooter) కంపెనీకి ప్రత్యేక ఇంట్రో అవసరం లేదు. ఇది రివర్స్ మోడ్‌లో ఓలా స్కూటర్లను అన్బిలీవబుల్ స్పీడ్‌తో నడపొచ్చు అంటూ కొన్ని నెలల క్రితం ఓ టీజర్‌ను రిలీజ్ చేసి అందరిలో హైప్ పెంచింది. ఐతే కొన్ని రోజులుగా ఓలా స్కూటర్స్‌లో సాంకేతిక సమస్యలు బయటపడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఓలా ఎలక్ట్రిక్ బైక్ కాలిపోవడం ఎవరూ మర్చిపోలేరు.
అంతలోనే మరో డేంజరస్ సాఫ్ట్వేర్ గ్లిచ్ (Software Glitch) బయటపడింది. సాఫ్ట్వేర్ లోపం వల్ల ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro) ఆటోమేటిక్‌గా రివర్స్ మోడ్‌లో వెళ్లినట్లు ఒక రైడర్ ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు. ఈ ట్వీట్ థ్రెడ్ కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ట్వీట్ చేసి నాలుగు రోజులు గడుస్తున్నా దీనిపై ఓలా స్పందించకపోవడం గమనార్హం. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఇది చాలా డేంజరస్ అంటూ ఓలాపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఓలా బైక్ కోసం గతంలో రూ.499 టోకెన్ అమౌంట్ చెల్లించినవారికి బిల్లులో ఆ మొత్తాన్ని తగ్గిస్తారు. పేమెంట్ సెక్షన్లో ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. కేవలం నెలకు రూ.2,999 ఈఎంఐతో ఓలా ఎస్1 సొంతం చేసుకోవచ్చు. ఓలా ఎస్1 కొనాలంటే నెలకు రూ.3,199 ఈఎంఐ చెల్లించాలి. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా క్యాపిటల్ లాంటి సంస్థలు ఫైనాన్స్ ఆప్షన్స్ అందిస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిమిషాల్లోనే ప్రీ-అప్రూవ్డ్ లోన్స్ అందిస్తున్నాయి
అంతేకాదు ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంటలు అంటుకున్న సంఘటనల ఇటీవలి వరుస సంఘటనలు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రస్తుత భద్రతా ప్రమాణాల గురించి ఆందోళన కలిగిస్తున్నాయి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నుంచి ప్రతిస్పందనతో పాటు, నీతి ఆయోగ్ EV బ్యాటరీ మార్పిడి విధానం కోసం ముసాయిదాను కూడా రూపొందించింది
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.