ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఆధరణ పెరుగుతోంది. వాతావరణ కాలుష్యానికి అడ్డుకట్ట వేయవచ్చనే ఉద్దేశంతో చాలా దేశాలు ఎలక్ట్రిక్ బైక్‌లు, కార్లపై తగ్గింపులు, ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. మన దేశంలో పెద్ద కంపెనీలతో పాటు చిన్న స్టార్టప్‌లు కూడా వీటి ఉత్పత్తిపై దృష్టి పెట్టాయి. ఈ సంవత్సరం నిర్వహించిన ‘ఆటో ఎక్స్‌పో- 2020’ (Auto Expo- 2020)లో ఒకినవా సంస్థ ఆవిష్కరించిన ‘ఒకినవా ఒకి 100’ (Okinawa Oki100) ఎలక్ట్రిక్ బైక్ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ బైక్‌ను భారత్‌లో విడుదల చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే సంవత్సరం మార్చిలో ఇది మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. దీన్ని మన కస్టమర్ల కోసం దేశీయంగా అభివృద్ధి చేయనున్నారు. Okinawa Oki100 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్.. 125cc-150cc ఇంజిన్ సామర్థ్యమున్న బైక్‌తో సమానమైన పనితీరును అందిస్తుందని ఆ సంస్థ చెబుతోంది.
కొత్త కనెక్టివిటీ ఫీచర్లు..
ప్రస్తుతానికి భారత్‌లో విడుదల చేయనున్న కొత్త బైక్ మోడల్, డిజైన్ గురించి పూర్తి సమాచారాన్ని ఒకినవా వెల్లడించలేదు. గతంలో ప్రదర్శించిన ఒకినావా ఎలక్ట్రిక్ బైక్ ప్రోటోటైప్ డిజైన్ మాత్రం ఆకట్టుకునేలా ఉంది. ఓవల్ హెడ్‌ల్యాంప్(oval-shaped headlamp), తక్కువ సైజులో ఉండే సైడ్ ప్యానెల్లు, కాస్త పెద్దగా ఉన్న హ్యాండిల్‌బార్‌తో బైక్‌ను రూపొందించారు. ఒకినవా ఒకి ఎలక్ట్రిక్ బైక్‌కు కనెక్టివిటీ సిస్టమ్ సపోర్ట్ ఫీచర్ కూడా ఉంది. యాప్ ద్వారా బైక్ కనెక్టివిటీ ఫీచర్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. దీని ద్వారా జియో ఫెన్సింగ్, వేకిల్ మానిటర్, బ్యాటరీ ఛార్జ్‌ను చెక్ చేసుకోవడం.. వంటి ఫీచర్లను కస్టమర్లు ఉపయోగించుకోవచ్చు.
బ్యాటరీ సామర్థ్యం
Okinawa Oki100 బైక్ 2.5 కిలోవాట్ల మోటార్‌తో లభిస్తుంది. దీంట్లో స్వాప్ చేయగలిగే లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఈ బైక్‌పై అత్యధికంగా గంటకు 100కి.మీ వేగాన్ని అందుకోవచ్చు. దీని బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేసి, 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Electric vehicle