పెట్రోల్, డీజిల్ ధరల ఎఫెక్ట్.. రూటు మార్చిన వాహనదారులు.. సరికొత్త ప్లాన్ తో రేట్లు ఎంత పెరిగినా నో ప్రాబ్లమ్..!

ప్రతీకాత్మక చిత్రం

రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నాయి. ఆ ధరల భారం నుంచి తప్పించుకునేందుకు రూటు మార్చుతున్నారు. కొత్త ప్లాన్ వేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత పెరిగినా ఇబ్బందులేమీ లేకుండా ఉండేలా..

  • Share this:
పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం దేశంలో చాలా నగరాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.100లకు దగ్గరలో ఉంది. ఫలితంగా విద్యుత్ వాహనాలకు డిమాండ్ ఎక్కువగా పెరుగుతుంది. ఇందుకు ఉదాహరణే ఒకినావా సంస్థ. ఈ కంపెనీ విడుదల చేసే విద్యుత్ స్కూటర్ల విక్రయాలు అమాంతం పెరిగాయి. ప్రారంభంలో తక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం అగ్రస్థానంలో దూసుకుపోతోందీ సంస్థ. దీని తర్వాత హీరో సంస్థ రెండో స్థానంలో ఉంది. ఇటీవల కాలంలో పెట్రోల్ ధరలు పెరిగిన కారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం చూస్తున్నారు వాహన ప్రియులు. ఒకినావాకి చెందిన గత మూడు నెలల విక్రయాలను గమనిస్తే 30 శాతం వృద్ధి చెందింది. పెరుగుతున్న ఇంధన ధరలే ఇందుకు కారణమని ఆ కంపెనీ కూడా ఒప్పుకుంది. అమ్మకాలు మాత్రమే కాదు. పెరుగుతున్న స్కూటర్ల సంఖ్యతో పాటు విచారణలను కూడా పరిష్కరిస్తుంది. ఇది వినియోగదారులను 3 రెట్లు పెరుగుదలకు దోహదపడుతోంది.

విద్యుత్ స్కూటర్ల వృద్ధి..
ఒకినావా ఆటోటెక్స్ స్టేట్స్ ఎండీ, వ్యవస్థాపకులు జితేందర్ శర్మ మాట్లాడుతూ.. విద్యుత్ వాహనాలు భారత్ లో క్రమేణా వృద్ధి చెందుతున్నాయని చెప్పారు. గత మూడేళ్ల కాలంలో ఈ పెరుగుదల ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇందుకు తగిన ముందడుగు వేస్తున్నాయని, ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో ఇంధన ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు ప్రత్యామ్నాయంగా విద్యుత్ వాహనాల వైపు చూస్తునారని తెలిపారు. తాము కూడా ఐసీఈ ఇంజిన్ తో వీటి ఉత్పత్తిని పెంచాలని చూస్తున్నట్లు స్పష్టం చేశారు.

Okinawa electric scooters, Okinawa, Okinawa Sales increase ఒకినావా విద్యుత్ స్కూటర్లు, ఒకినావా అమ్మకాల వృద్ధి
Okinawa electric scooters (Image Credit: Twitter)

ఇది కూడా చదవండి: హైదరాబాద్.. రోడ్డు పక్కనే ఓ అట్టపెట్టె చుట్టూ కుక్కలు చేరి అరుపులు.. ఏముందా అని ఓపెన్ చేసి చూసిన వాళ్లందరికీ..

పెట్రోల్ ధర లీటరుకు 100 రూపాయలకు దగ్గరగా కొనసాగుతున్నందున విద్యుత్ ద్విచక్రవాహనాల డిమాండ్ ఎక్కువగా ఉందని. కాలక్రమేణా ఈ స్కూటర్ల గురించి అవగాహన పెరుగుతుంది. ప్రస్తుతం ఒకినావా ఆటోమేటిక్ స్కూటర్ అమ్మకాలు ఒక్క ఈ ఏడాదే 35 నుంచి 40 శాతానికి పెరిగింది. ప్రస్తుత మార్కెట్ డైనమిక్స్ ఈ స్కూటర్ల వృద్ధికి బాగా సహాయపడింది. 2020లో ఈ కంపెనీ విక్రయాల్లో 2వ స్థానంలో నిలిచింది.

హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.
ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రొడక్ట్ పోర్ట్ ఫోలియోను ఇప్పుడు ఆరు ఎలక్ట్రిక్ స్కూటర్లను రూ.50 వేల నుంచి రూ.1.14 లక్షలకు విస్తరించింది. 2021లో ఒకినావా మరో రెండు కొత్త హైస్పీడ్ ద్విచక్రవాహనాలను విడుదల చేయాలని చూస్తోంది. విద్యుత్ స్కూటర్ల విభాగం రాబోయే కాలానికి పూనాది వేస్తుండటంతో ప్రభుత్వం రాయితీ విధానాలు ఉత్పత్తి వృద్ధిని ప్రభావితం చేస్తున్నాయి. ప్రభుత్వ సబ్సిడీల వల్ల విద్యుత్ స్కూటర్ల తయారీదారులు అలాంటి రాయితీలు ఉన్న వాహనాలను ఎంచుకోవడానికి మొగ్గుచూపుతారు.
ఇది కూడా చదవండి: నా డబ్బు.. నా ఇష్టమంటూ.. 60 ఏళ్ల వృద్ధ డాక్టర్ నిర్వాకం.. అమ్మాయిలతో చాటింగ్ కోసం రూ.70 లక్షలు..!
First published: