మళ్లీ పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు...ఎందుకో తెలుసా?

అమెరికా-చైనాలు ట్రేడ్ వార్‌ను తాత్కాలికంగా వాయిదావేసుకోవడంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్‌కు డిమాండ్ పెరిగింది. ఫలితంగా ఇంధన అవసరాల కోసం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన దేశాల్లో ఇంధన ధరలు పెరగనున్నాయి.

news18-telugu
Updated: December 3, 2018, 11:43 AM IST
మళ్లీ పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు...ఎందుకో తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం..
  • Share this:
గత రెండు మాసాలుగా దిగువస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా-చైనాల మధ్య ట్రేడ్ వార్ తాత్కాలికంగా వాయిదాపడింది. 90 రోజుల పాటు వాణిజ్య యుద్ధాన్ని వాయిదావేసుకోవాలని ఆ రెండు అగ్రదేశాలు అర్జెంటీనాలో జరుగుతున్న జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులో నిర్ణయించాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలకు మళ్లీ డిమాండ్ పెరిగింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరిగాయి. అమెరికా టెస్ట్ టెక్సాస్ ఇంటెర్మీడియట్ (డబ్ల్యూటీఐ)లో క్రూడాయిల్ ధర బ్యారల్‌పై 2.45 డాలర్లు పెరిగి 53.38 డాలర్లుగా నమోదయ్యింది. క్రితం ముగింపుతో పోల్చితే బ్యారల్ క్రూడాయిల్ 4.8 శాతం పుంజుకుంది.

అటు అంతర్జాతీయ బ్రెంట్ క్రూడాయిల్ బ్యారల్‌పై 2.38 డాలర్లు పెరిగి 61.84 డాలర్లుగా ధర పలుకుతోంది. త్వరలో సమావేశం కానున్న ఒపెక్ దేశాల సమావేశంలో ఉత్పత్తిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయన్న కథనాలు కూడా ఇంధన ధరలు పెరగడానికి కారణం అవుతోంది. అమెరికా-చైనాలు ట్రేడ్ వార్‌ను వాయిదావేసుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధనానికి డిమాండ్ పెరగనుంది. ఇంధన అవసరాలకు ఎక్కువగా దిగుబడులపై ఆధారపడిన భారత్ సహా మిగిలిన దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశముంది.

సోమవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలహీనపడింది. రూపాయి విలువ 42 పైసలు క్షీణించి డాలర్‌తో పోల్చితే 70కి ఎగువునకు చేరింది. కొద్దిసేపటి క్రితం ఫోరెక్స్‌లో రూపాయి మారం విలువ 70.01గా ఉంది.


అటు బుల్లియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు కూడా పెరిగాయి. 10 గ్రాముల బంగారం రూ.260 పెరిగి రూ.30,500గా ట్రేడ్ అవుతోంది. అటు వెండిధర రూ.563 పెరిగి రూ.35,730 వద్ద ట్రేడ్ అవుతోంది.
First published: December 3, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading