మరింత తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..కారణాలు ఇవే

ఏప్రిల్ మాసం తర్వాత తొలిసారిగా శుక్రవారం క్రూడాయిల్ ధర బ్యారెల్ 70 డాలర్ల దిగువునకు పడిపోయింది. అక్టోబర్ మొదటివారంలో బ్యారల్ క్రూడాయిల్ నాలుగేళ్ల గరిష్ఠ స్థాయికి చేరగా...గత నెల రోజుల వ్యవధిలోనే బ్యారల్ ధర 18 శాతం మేర తగ్గింది.

news18-telugu
Updated: November 9, 2018, 6:09 PM IST
మరింత తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..కారణాలు ఇవే
అటు అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నాయి. బ్యారల్ క్రూడాయిల్ 62.77 డాలర్లుగా ధర పలుకుతోంది. అక్టోబర్ 3న బ్యారల్ క్రూడాయిల్ నాలుగేళ్ల గరిష్ట స్థాయిలో 86.29 డాలర్లుకు చేరగా...ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ బ్యారల్ ధర ఏకంగా 27 శాతం మేర పడిపోయింది.
  • Share this:
ధరాఘాతంతో కులేదవుతున్న సామాన్య ప్రజానీకానికి తీపికబురు. గత 24 రోజులుగా తగ్గుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు...ముందు ముందు మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో రోజురోజుకూ దిగివస్తున్న క్రూడాయిల్ ధరల ప్రభావంతో మన దేశంలోనే కొండెక్కి కూర్చుకున్న ఇంధన ధరలు దిగిరానున్నాయి. ఇంధన సప్లై పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఎనిమిది మాసాల కనిష్ఠ స్థాయికి చేరాయి.

ఏప్రిల్ మాసం తర్వాత తొలిసారిగా శుక్రవారం క్రూడాయిల్ ధర బ్యారెల్ 70 డాలర్ల దిగువునకు పడిపోయింది. అక్టోబర్ మొదటివారంలో బ్యారల్ క్రూడాయిల్ నాలుగేళ్ల గరిష్ఠ స్థాయికి చేరగా...గత నెల రోజుల వ్యవధిలోనే బ్యారల్ ధర 18 శాతం మేర తగ్గింది. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారల్ 69.70 డాలర్ల స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత కాస్త పుంజుకుని 68.85 డాలర్ల దగ్గర ట్రేడింగ్ అయ్యింది.


అమెరికా, రష్యా, సౌదీ అరేబియా తదితర దేశాలు రికార్డు గరిష్ఠ స్థాయిలో ఇంధన ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే ట్రేడ్ వార్ భయాలు, ఆర్థిక వృద్ధిరేటు మందగమనం నేపథ్యంలో ఇంధన డిమాండ్ ప్రపంచ వ్యాప్తంగా చాలా వరకు తగ్గుముఖం పట్టింది. అటు ఇరాన్ దేశం నుంచి ఆయిల్ కొనుగోలుపై అమెరికా ఆంక్షలను పాక్షికంగా ఎత్తివేసింది. భారత్‌తో పాటు చైనా, జపాన్ ఇలా 8 దేశాలు ఇరాన్ నుంచి క్రూడాయిల్ దిగుమతి చేసుకునేందుకు గతంలో విధించిన ఆంక్షలను సడలించింది. మరో ఆరు మాసాల పాటు ఇంధనాన్ని దిగుమతి చేసుకునేందుకు అమెరికా అనుమతించింది.

దీంతో ఉత్పత్తి పెంచిన ఇరాన్, పలు దేశాలకు ఇంధన ఎగుమతులను గణనీయంగా పెంచింది. దీని ప్రభావంతో రాబోయే పక్షం రోజుల్లో లీటరు పెట్రోల్, డీజిల్‌పై దాదాపు రూ.5లు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
First published: November 9, 2018, 6:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading