హోమ్ /వార్తలు /బిజినెస్ /

Petrol Price: కంపెనీలకు ఒక్కో లీటరు పెట్రోల్‌పై రూ.10 లాభం.. మరి రేట్లు ఎందుకు తగ్గడం లేదు?

Petrol Price: కంపెనీలకు ఒక్కో లీటరు పెట్రోల్‌పై రూ.10 లాభం.. మరి రేట్లు ఎందుకు తగ్గడం లేదు?

Petrol Price: కంపెనీలకు ఒక్కో లీటరు పెట్రోల్‌పై రూ.10 లాభం.. మరి రేట్లు ఎందుకు తగ్గడం లేదు?

Petrol Price: కంపెనీలకు ఒక్కో లీటరు పెట్రోల్‌పై రూ.10 లాభం.. మరి రేట్లు ఎందుకు తగ్గడం లేదు?

Petrol Rate | ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఒక్కో లీటరు పెట్రోల్‌పై రూ. 10 మేర లాభం వస్తోంది. మరి ఇలాంటప్పుడు పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు?

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Diesel Rate | పెట్రోల్, డీజిల్.. వీటి గురించి వింటే సామాన్యులకు జేబుకు పడుతున్న చిల్లులే కనిపిస్తాయి. ఎందుకంటే వీటి రేటు బాగా పెరిగింది. అంతే కిందకు మాత్రం దిగడం లేదు. గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ (Crude) రేట్లు ఎలా ఉన్నా కూడా మన దగ్గర మాత్రం పెట్రోల్ (Petrol) కొట్టించాలంటే లీటరుకు రూ. 110 చెల్లించాలి. డీజిల్ కోసం రూ.100 ఇవ్వాలి. ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది. అయితే సాధారణంగా క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినప్పుడు దేశంలో ఫ్యూయెల్ రేట్లు కూడా దిగిరావాల్సి ఉంది.

నివేదికల ప్రకారం చూస్తే.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఒక్క లీటరు పెట్రోల్‌పై రూ. 10 లాభం వస్తోందని తెలుస్తోంది. అయినా కూడా పెట్రోల్ రేటు తగ్గడం లేదు. అయితే ఇక్కడ ఇందుకు ఒక కారణం ఉంది. డీజిల్ అమ్మకాలపై ఒక్కో లీటరుకు ఆయిల్ కంపెనీలకు రూ. 6.5 మేర నష్టం కలుగుతోంది. అంతేకాకుండా గతంలో క్రూడ్ ఆయిల్ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఆయిల్ కంపెనీలు ఫ్యూయెల్ రేట్లను పెంచలేదు. దీంతో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రేటు తగ్గినప్పుడు కంపెనీలు గత నష్టాలను భర్తీ చేసుకుంటున్నాయి. గత నష్టాలు, ప్రస్తుత డీజిల్ నష్టం కారణంగా క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినా కూడా దేశంలో ఫ్యూయెల్ రేట్లు స్థిరంగానే ఉన్నాయి.

పడిపోయిన బంగారం.. మళ్లీ పరుగులు పెట్టింది, నేటి రేట్లు ఇలా!

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) వంటివి గత 15 నెలలుగా ఫ్యూయెల్ రేట్లను స్థిరంగానే కొనసాగిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి.

లక్ష్మీ కటాక్షం అంటే ఇదే.. రూ.1 షేరుతో రూ.50 లక్షల లాభం!

‘ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు 2022 జూన్ 24తో ముగిసిన వారంలో లీటరు పెట్రోల్‌పై రూ. 17.4, లీటరు డీజిల్‌పై రూ. 27.7 మేర నష్టం వాటిల్లింది. 2022 అక్టోబర్ – డిసెంబర్ త్రైమాసికంలో పెట్రోల్‌పై మార్జిన్లు రూ.10 ఉండొచ్చనే అంచనా. అయితే డీజిల్‌పై లీటరుకు రూ. 6.5 నష్టం కలగొచ్చు’ అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రంగానికి చెందిన మూడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 2022 ఏప్రిల్ 6 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా కొనసాగిస్తూ వస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో ముడి చమురు ధరల్లో చాలా వ్యత్యాసం కనిపించింది. జూన్ నెలలో క్రూడ్ ఆయిల్ రేటు బ్యారెల్‌కు 116 డాలర్ల స్థాయికి చేరింది. అలాగే ఇప్పుడు ఈ నెలలో క్రూడ్ ఆయిల్ రేటు 78 డాలర్లకు దిగి వచ్చింది. క్రూడ్ ఆయిల్ రేట్లు పెరినప్పుడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీకలు భారీ నష్టాలు కలిగాయి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో నికరంగా రూ. 21 వేల కోట్ల నష్టం సంభవించింది.

First published:

Tags: Crude Oil, Diesel price, Diesel rate, Oil prices, Petrol, Petrol Price, Petrol rate

ఉత్తమ కథలు