జనం నెత్తిన గ్యాస్ బండ... మళ్లీ పెరిగిన సిలిండర్ ధర..
ఇక సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర రూ.494.35 యధావిధిగా కొనసాగుతుంది.
నెలవారీ ధరల సవరింపులో భాగంగా ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) 14.2 కేజీల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరను పెంచింది. అదే నాన్ సబ్సీడీ 14.2కేజీల ఎల్పీజీల సిలిండర్ ధర ఏకంగా రూ.25 పెరిగింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూఇదే పరిస్థితి ఉంది. సవరించిన ధరలు జూన్ 1 నుంచి అమలుకానున్నాయి.
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. ఎల్పీజీ ధర పెరుగుతూ రావడం ఇది వరుసగా 4వ నెల. . నెలవారీ ధరల సవరింపులో భాగంగా ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) 14.2 కేజీల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరను పెంచింది. అదే నాన్ సబ్సీడీ 14.2కేజీల ఎల్పీజీల సిలిండర్ ధర ఏకంగా రూ.25 పెరిగింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూఇదే పరిస్థితి ఉంది. సవరించిన ధరలు జూన్ 1 నుంచి అమలుకానున్నాయి.
సబ్సీడీ సిలిండర్ ధరలు ప్రాంతాల వారీగా..
ఢిల్లీలో గ్యాస్ ధరలు పెంపునకు ముందు రూ.496.14గా ఉండే ధరలు.. పెరిగిన తర్వాత రూ.497.37 గా ఉన్నాయి. కోల్కతాలో రూ.499.29 గా ఉండే గ్యాస్ ధర.. రూ.500.52 గా మారింది. ముంబైలో రూ.493.86 గా ఉండే ధర రూ.495.09 గా ఉంది. చెన్నైలో రూ.484.02 గా ఉండే ధర రూ.485.25 గా మారింది.
నాన్ సబ్సీడీ సిలిండర్ ధరలు ప్రాంతాల వారీగా..
ఢిల్లీలో గ్యాస్ ధరలు పెంపునకు ముందు రూ.712.5గా ఉండే ధరలు.. పెరిగిన తర్వాత రూ.737.5 గా ఉన్నాయి. కోల్కతాలో రూ.763.5 గా ఉండే గ్యాస్ ధర.. రూ.738.5 గా మారింది. ముంబైలో రూ.684.5 గా ఉండే ధర రూ.709.5 గా ఉంది. చెన్నైలో రూ.728 గా ఉండే ధర రూ.753 గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.