హోమ్ /వార్తలు /బిజినెస్ /

LPG Gas Cylinder Price: మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర... ఈసారి రూ.100 పైనే పెంపు

LPG Gas Cylinder Price: మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర... ఈసారి రూ.100 పైనే పెంపు

LPG Gas Cylinder Price: మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర... ఈసారి రూ.100 పైనే పెంపు
(ప్రతీకాత్మక చిత్రం)

LPG Gas Cylinder Price: మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర... ఈసారి రూ.100 పైనే పెంపు (ప్రతీకాత్మక చిత్రం)

LPG Gas Cylinder Price | కమర్షియల్ సిలిండర్ కొనేవారికి ఆయిల్ కంపెనీలు (Oil Companies) షాక్ ఇచ్చాయి. కమర్షియల్ సిలిండర్ ధరను ఏకంగా రూ.100 పైనే పెంచాయి. కానీ సామాన్యులకు మాత్రం ఊరటనిచ్చాయి కంపెనీలు.

వ్యాపార అవసరాల కోసం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ (Commercial Gas Cylinder) కొనేవారికి ఆయిల్ కంపెనీలు మరోసారి షాక్ ఇచ్చాయి. కమర్షియల్ సిలిండర్ ధరను ఏకంగా రూ.100 పైనే పెంచాయి. బుధవారం కమర్షియల్ సిలిండర్ ధర రూ.103.50 పెరిగింది. పెరిగిన ధరలు అమలులోకి వచ్చాయి. హైదరాబాద్ మార్కెట్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2278 కి చేరుకుంది. ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర 2000.50 నుంచి రూ.2,104 ధరకు చేరుకుంది. కోల్‌కతాలో ప్రస్తుతం ఈ సిలిండర్ ధర రూ.2,174.50, ముంబైలో రూ.2,051, చెన్నైలో రూ.2,234.50. ఇక కమర్షియల్ సిలిండర్లను హోటళ్లతో పాటు ఇతర వ్యాపార అవసరాలకు ఉపయోగిస్తారన్న సంగతి తెలిసిందే. కమర్షియల్ సిలిండర్ల ధరలు పెరగడం పరోక్షంగా సామాన్యులపై భారం పడే అవకాశం ఉంది.

Post Office Scheme: రోజూ రూ.50 దాచుకుంటే... రూ.35 లక్షల వరకు రిటర్న్స్ పొందొచ్చు

గత నెలలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.265 పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో రూ.103.50 పెరిగింది. దీంతో రెండు నెలల్లోనే రూ.368.50 పెరగడం వ్యాపారులకు భారమే. డొమెస్టిక్ సిలిండర్ల విషయంలో ఆయిల్ కంపెనీలు కాస్త కనికరం చూపించాయి. డొమెస్టిక్ సిలిండర్ల ధరను పెంచలేదు. గత నెలలో ఉన్న ధరలే ఇప్పుడూ ఉన్నాయి. సామాన్యులు ఇళ్లల్లో ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్ ధర చివరిసారిగా అక్టోబర్ 6న పెరిగింది. ఆ తర్వాత నవంబర్‌లో డొమెస్టిక్ సిలిండర్ ధరను పెంచలేదు కంపెనీలు. డిసెంబర్ 1న కూడా ధరల్ని యథాతథంగా ఉంచాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.952 దగ్గర ఉంది. ఇళ్లల్లో ఉపయోగించే ఈ సిలిండర్ ధర రూ.1,000 కి చేరుకోవడానికి రూ.48 పెంచితే చాలు.

New Rules: డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే 11 కొత్త రూల్స్ ఇవే

ఈ ఏడాది డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర 8 సార్లు పెరిగితే ఒకసారి ధర తగ్గింది. ఫిబ్రవరి 1న రూ.25, ఫిబ్రవరి 15న రూ.50, ఫిబ్రవరి 25న రూ.25, మార్చిలో రూ.25 చొప్పున సిలిండర్ ధర పెరిగితే ఏప్రిల్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.10 తగ్గింది. ఆ తర్వాత జూలైలో రూ.25.5, ఆగస్టులో రూ.25, అక్టోబర్‌లో రూ.25 చొప్పున పెరిగింది.

ఈ ఏడాది మొత్తం గ్యాస్ సిలిండర్ ధర రూ.190.5 పెరిగింది. ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,000 పెరిగింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌పై రూ.48 పెరిగితే సామాన్యులు ఇక గ్యాస్ సిలిండర్ కొనడానికి రూ.1,000 చెల్లించాల్సిందే. అయితే సామాన్యులకు సబ్సిడీ విషయంలో ఊరట కలిగే అవకాశం ఉంది.

కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని భారీగా పెంచొచ్చన్న వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రూ.300 పైనే సబ్సిడీని లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేస్తుందన్న వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే గ్యాస్ సిలిండర్‌ను రూ.700 లోపే పొందొచ్చు. రూ.10,00,000 వార్షికాదాయం దాటినవారికి సబ్సిడీ తొలగించాలన్న ప్రతిపాదనల్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.

First published:

Tags: Bharat Gas, Check the Price of LPG, HP gas, Indane Gas, LPG, LPG Cylinder, LPG Cylinder New Rates, Lpg Cylinder Price

ఉత్తమ కథలు