Home /News /business /

OFFERS ON XIAOMI SMARTPHONE UP TO RS 2000 DISCOUNT ON REDMI NOTE 9 PRO MAX REDMI NOTE 9 AND OTHER REDMI PHONES NS GH

Offers on Xiaomi smartphones: ఆ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్స్.. ఎంత తగ్గాయో తెలిస్తే వెంటనే కొనేస్తారు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చిన్న సంస్థగా ప్రారంభమై ప్రస్తుతం మన దేశంలోని స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అతి పెద్ద కంపెనీల్లో ఒకటిగా మారింది షియోమీ. ప్రస్తుతం ఈ సంస్థ తన రెడ్ మీ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ధరలను భారీగా తగ్గించింది.

చిన్న సంస్థగా ప్రారంభమై ప్రస్తుతం మన దేశంలోని స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అతి పెద్ద కంపెనీల్లో ఒకటిగా మారింది షియోమీ. ప్రస్తుతం ఈ సంస్థ తన రెడ్ మీ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ధరలను భారీగా తగ్గించింది. ఈ సిరీస్‌లో వచ్చిన మోడళ్లపై రూ.2,000 వరకు డిస్కౌంట్ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్‌ కొన్నిరోజులకే పరిమితమని సంస్థ వెల్లడించింది. ఆన్‌లైన్‌లో, రిటైల్ అవుట్‌లెట్లలో ఫోన్లు కొనేవారికి ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఇప్పుడు కస్టమర్లు రెడ్‌మి నోట్ 9 ప్రో మ్యాక్స్, రెడ్‌మి నోట్ 9 ప్రో, రెడ్‌మి నోట్ 9, రెడ్‌మి 9i, రెడ్‌మి 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్లను డిస్కౌంట్‌ ధరలతో సొంతం చేసుకోవచ్చు. Mi.com, అమెజాన్‌లో కూడా వీటిని కొత్త ధరలకే అమ్మనున్నారు. రెడ్‌మి మొత్తం 10 వేరియంట్లపై ఆఫర్లు ప్రకటించింది. మోడల్‌ను బట్టి రూ.200 నుంచి రూ.2000 వరకు తగ్గింపు ఉంటుంది.

రెడ్‌మి నోట్ 9 ప్రో మ్యాక్స్‌పై ప్రస్తుతం రూ.2,000 డిస్కౌంట్ ఉంది. గతంలో దీని ప్రారంభ రూ.16,999గా ఉండగా.. ప్రస్తుతం రూ.14,999కు తగ్గింది. రెడ్‌మి నోట్ 9 ప్రో (4GB+128GB) వేరియంట్‌పై కూడా రూ.2,000 డిస్కౌంట్ ఉంది. ఆఫర్లో దీని ధర రూ.13,999కు తగ్గింది. రెడ్‌మి నోట్ 9 ప్రో మ్యాక్స్ (6GB+128GB), రెడ్‌మి నోట్ 9 ప్రో (4GB+64GB), రెడ్‌మి నోట్ 9 (6GB+128GB), రెడ్‌మి నోట్ 9 (4GB+64GB), రెడ్‌మి 9 ప్రైమ్ (4GB+128GB).. వంటి ఐదు స్మార్ట్ ఫోన్లపై రూ.1000 డిస్కౌంట్ ఉంది. రెడ్‌మి నోట్ 9 (4GB+128GB), రెడ్‌మి 9 ప్రైమ్ (4GB+64GB), రెడ్‌మి 9i (4GB + 64GB)వంటి మూడు వేరియంట్లపై రూ.500 వరకు డిస్కౌంట్ ఉంది.

ఆఫర్లు ఎప్పటివరకు?
ఈ ఆఫర్లు మార్చి నెలాఖరు వరకు ఉండే అవకాశం ఉంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలతో పాటు రిటైల్ స్టోర్లలో కూడా ఆఫర్లు అందుబాటులో ఉంటాయని షియోమి తెలిపింది. మన దేశంలో నోట్ 10 సిరీస్‌ ఫోన్లను విడుదల చేస్తున్న నేపథ్యంలో పాత మోడళ్లపై తగ్గింపులు ప్రకటించినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. కొత్తగా బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను కొనాలనుకునేవారు రెడ్‌మి ఆఫర్లను వినియోగించుకోవచ్చు. కొత్త నోట్ 10 సిరీస్ వేరియంట్లు కూడా అమెజాన్ ఇండియా, Mi.com ప్లాట్‌ఫాంలలో అందుబాటులోకి వచ్చాయి. కొన్ని బ్యాంకుల కార్డుల ద్వారా వీటిని కొనుగోలు చేసేవారికి రూ.1500 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను షియోమి అందిస్తోంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Redmi, Smartphones, Xiaomi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు