Electric scooter | మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ ఇచ్చింది. ఒడిస్సే ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV) అనే కంపెనీ కొత్ ఇ-స్కూటర్ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని పేరు ఒడిస్సే ట్రోట్. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 99,999. ఇది బీ2బీ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. హెవీ డ్యూటీ స్కూటర్‌ను (Scooter) లాజిస్టిక్స్ లక్ష్యంగా మార్కెట్‌లోకి తీసుకువచ్చారు. దీని లోడింగ్ కెపాసిటీ 250 కేజీలు. ఒక్కసారి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు చార్జింగ్ పెడితే ఏకంగా 75 కిలోమీటర్ల వరకు వెళ్తుందని కంపెనీ పేర్కొంటోంది.
అంతేకాకుండా ఇంకా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో హైటెక్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఐఓటీ కనెక్టివిటీ ఉంది. అంటే ట్రాకింగ్, ఇమ్మోబిలైజేషన్, జియో ఫెన్సింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 250 వాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. ఇందులో 32 ఏహెచ్ వాటర్‌ప్రూఫ్ డీటచబుల్ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ ఫుల్ కావడానికి 4 గంటలు టైమ్ పడుతుంది.
ఫోన్‌పే వాడే వారికి గుడ్ న్యూస్.. 2 కొత్త సర్వీసులు!
ఇంకా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో డ్రమ్ బ్రేక్ సిస్టమ్ ఉంటుంది. ముందు భాగంలో ఇది ఉంటుంది. అదే వెనుక భాగంలో చూస్తే.. డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఎల్ఈడీ డిస్‌ప్లే కూడా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యెల్లో, బ్లాక్, రెడ్, మెరూన్ రంగుల్లో కస్టమర్లకు అందుబాటులో ఉంది. డెలివరీ రంగంలోని అవసరాలకు అనుగుణంగా ఈ స్కూటర్‌లోని టెక్నాలజీ, ఫీచర్లను అప్‌డేట్ చేస్తూ వస్తామని కంపెనీ పేర్కొంటోంది. అలాగే హెవీ గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ కోసం కస్టమర్లకు కస్టమైజ్డ్ యాక్ససిరీస్ అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది.
రైతులకు బ్యాంక్ అదిరే శుభవార్త.. ఉచితంగా క్రెడిట్ కార్డు, లాభాలెన్నో!
కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని బ్యాటరీపై మూడేళ్ల వరకు వారంటీ ఇస్తుంది. ఇంకా పవర్‌ట్రైన్ మీద ఏడాది గ్యాంరటీ ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఒడిస్సే డీలర్‌షిప్ వద్దకు వెళ్లి ఈ స్కూటర్ కొనుగోలు చేయొచ్చు. గ్యాస్ సిలిండర్లు, హెవీ హార్డ్‌వేర్ ఎక్విప్‌మెంట్, వాటర్ క్యాన్స్ వంటి తదితర వాటిని తీసుకెళ్లడానికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు అనువుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కాగా ప్రస్తుతం మార్కెట్‌లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఫుల్ డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు. నెలవారీ అమ్మకాలను గమనిస్తే.. ఈ విషయం అర్థం అవుతోంది. అలాగే టీవీఎస్ ఐక్యూబ్, హీరో ఎలక్ట్రిక్, ఏథర్, బజాజ్ వంటి ఎలక్ట్రిక స్కూటర్లకు కూడా డిమాండ్ ఉంది. ఇకపోతే కొత్తగా మార్కెట్‌లోకి వచ్చి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఎలాంటి డిమాండ్ ఉంటుందో చూడాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: E scootor, Electric Scooter, Electric Vehicle, Ev scooters, SCOOTER