Stock Market | మీరు స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. బోనస్ షేర్లు (Bonus Shares)పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? ఇప్పటికే రెండు కంపెనీలు బోనస్ షేర్లను ప్రకటించాయి. వీటి రికార్డ్ డేట్ ఈ వారంలో ఉంది. అంటే రికార్డు డేట్ కన్నా ముందు ఈ షేర్లు కలిగిన వారికి బోనస్ షేర్లు లభిస్తాయని చెప్పుకోవచ్చు. ఒక్క స్టాక్‌కు (Stocks) 5 షేర్లు వస్తాయి.
నైకా, పునీత్ కమర్షియల్స్ అనే రెండు కంపెనీలు ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను జారీ చేయనున్నాయి. ఈ వారంలోనే షేర్లు ఎక్స్ బోనస్ ధరకే ట్రేడ్ అవుతాయి. ఈ కంపెనీలు ఒక ఈక్విటీ షేరుకు ఐదు బోనస్ షేర్లను ఇవ్వనున్నాయి. వీటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కారు కొనాలనుకునే వారికి శుభవార్త.. టాటా కార్లపై భారీ డిస్కౌంట్!
నైకా బోనస్ షేర్ల విషయానికి వస్తే.. వీటికి రికార్డ్ డేట్ నవంబర్ 11గా ఉంది. కంపెనీ అక్టోబర్ 3 నాటి మీటింగ్‌లో బోనస్ షేర్ల నిర్ణయం తీసుకుంది. బీఎస్ఈ ప్రకారం ఈ షేరు నవంబర్ 10న ఎక్స్ బోన్స్ ధరకు ట్రేడ్ అవుతుంది. కాగా ఈ కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ రెండింటిలోనూ ట్రేడ్ అవుతున్నాయి. కంపెనీ షేరు ధర రూ. 1132 వద్ద ఉంది.
మారుతీ కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు.. కొత్త కారు కొనే వారికి పండగే!
ఇకపోతే పునీత్ కమర్షియల్స్ బోనష్ షేర్ల విషయానికి వస్తే.. ఈ బోనస్ షేర్లకు రికార్డ్ తేదీ నవంబర్ 9గా ఉంది. అంటే ఈరోజే అని చెప్పుకోవాలి. ఈ షేరు ధర రూ. 51 వద్ద ఉంది. అక్టోబర్ 3 నాటి మీటింగ్‌లో కంపెనీ ఈ బోనస్ షేర్ల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా బోనస్ షేర్లు జారీ చేస్తే.. షేరు ధర కూడా ఆ మేరకు తగ్గతుంది. రిటైల్ ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి కంపెనీలు బోనస్ షేర్లను జారీ చేస్తూ ఉంటాయి.
ఎక్స్ బోనస్ తర్వాత ధర తగ్గిన తర్వాత షేరు ధర మళ్లీ పైకి కదిలితే అప్పుడు ఇన్వెస్టర్లకు అధిక రాబడి వస్తుందని చెప్పుకోవచ్చ. షేరు ధర తక్కువగా ఉన్నప్పుడు కొనే వారు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే కంపెనీలు బోనస్ షేర్లు, స్టాక్ స్ల్పిట్ వంటివి చేస్తూ ఉంటాయి. కాగా స్టాక్ మార్కెట్లో భారీ రిస్క్ ఉంటుందని గుర్తించుకోవాలి. డబ్బులు పెట్టడానికి ముందు ఇన్వెస్ట్మెంట్ నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Multibagger stock, Share Market Update, Stock Market, Stocks