SBI IPO Loan: రేపే నైకా ఐపీఓ ప్రారంభం... ఇన్వెస్ట్‌మెంట్ కోసం లోన్ ఇస్తున్న ఎస్‌బీఐ

SBI IPO Loan: రేపే నైకా ఐపీఓ ప్రారంభం... ఇన్వెస్ట్‌మెంట్ కోసం లోన్ ఇస్తున్న ఎస్‌బీఐ (ప్రతీకాత్మక చిత్రం)

SBI IPO Loan | ఇన్వెస్టర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న నైకా ఐపీఓ (Nykaa IPO) సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 28న ప్రారంభం కానుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఐపీఓలో పెట్టుబడులు పెట్టడానికి రుణాలు ఇస్తోంది.

  • Share this:
    ఇండియన్ స్టాక్ మార్కెట్‌లోకి ఐపీఓల వరద (Upcoming IPO) కొనసాగుతోంది. నైకా, పాలసీబజార్, పేటీఎం లాంటి బడా కంపెనీలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ద్వారా స్టాక్ మార్కెట్లోకి వస్తున్నాయి. గత ఏడాది కాలంగా ఐపీఓలకు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అనేక ఐపీఓలు అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చాయి. ఇటీవల వచ్చిన పరస్ డిఫెన్స్, జొమాటో, క్లీన్ సైన్స్, హ్యాపియెస్ట్ మైండ్స్ లాంటి ఐపీఓలు అదిరిపోయే రిటర్న్స్ ఇవ్వడంతో ఇన్వెస్టర్లు ఐపీఓల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఒకేసారి ఎక్కువ ఐపీఓలు రావడంతో వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి సరిపడా క్యాపిటల్ లేక ఇబ్బందులు పడుతున్నారు ఇన్వెస్టర్లు. అలాంటివారిని బ్యాంకులు ఆదుకుంటున్నాయి. ఐపీఓల్లో పెట్టుబడి పెట్టేందుకు రుణాలు ఇస్తున్నాయి.

    ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల కోసం రుణాలు ఇస్తోంది. ఐపీఓల్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈ రుణాలు ఉపయోగించుకోవచ్చు. ఐపీఓలు, రైట్స్ ఇష్యూస్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఈ రుణాలను ఇస్తోంది ఎస్‌బీఐ. కనీసం రూ.50,000 లోన్ తీసుకోవచ్చు. గరిష్టంగా రూ.20 లక్షల వరకు రుణం లభిస్తుంది.

    New Rules: పిల్లల్ని బైక్ పైన తీసుకెళ్తున్నారా? ఈ కొత్త రూల్స్ పాటించాల్సిందే

    ఇన్వెస్టర్లు ఈ రుణాలు పొందాలంటే ప్రస్తుతం ఉన్న షేర్లను తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. తమ షేర్లు తాకట్టు పెట్టి రూ.50,000 నుంచి రూ.20,00,000 లోన్ తీసుకోవచ్చు. ఒకవేళ ఐపీఓల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే తాకట్టు పెట్టే షేర్లకు గరిష్టంగా రూ.10,00,000 లోన్ మాత్రమే వస్తుంది. షేర్లు మాత్రమే కాదు మ్యూచువల్ ఫండ్స్, డ్యూయెల్ అడ్వాంటేజ్ ఫండ్స్, సావరిన్ గోల్డ్ బాండ్స్ కూడా తాకట్టు పెట్టొచ్చు. ఈ రుణాలకు 0.75 శాతం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. దీంతో పాటు రూ.1,000 వరకు జీఎస్‌టీ చెల్లించాలి.

    myAadhaar Portal: ఆధార్ కొత్త వెబ్‌సైట్‌లో ఈ 11 రకాల సేవలు పొందొచ్చు

    ప్రస్తుత కస్టమర్లకు మాత్రమే ఎస్‌బీఐ ఈ రుణాలు ఇస్తోంది. ఎస్‌బీఐతో సదరు కస్టమర్‌కు ఉన్న గత చరిత్రను బ్యాంకు పరిశీలిస్తుంది. గతంలో హోమ్ లోన్, కార్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని ఉంటే వాయిదాలు ఎలా చెల్లించారో పరిశీలిస్తుంది. ఎలాంటి బకాయిలు లేనివారికి మాత్రమే ఐపీఓ కోసం రుణం పొందే అవకాశం ఉంటుంది.

    ఇక ఈ లోన్ కోరుకునే కస్టమర్లు ఎస్‌బీఐ క్యాప్ సెక్యూరిటీస్ డీమ్యాట్ అకౌంట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అలాంటివారికే లోన్ లభిస్తుంది. లోన్ కోరుకునే కస్టమర్లు గత రెండేళ్ల ఐటీ రిటర్న్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వడ్డీ రేట్ల వివరాలు చూస్తే షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, డ్యూయెల్ అడ్వాంటేజ్ ఫండ్స్ తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు 9.75 శాతం వడ్డీ ఛార్జ్ చేస్తుంది ఎస్‌బీఐ. సావరిన్ గోల్డ్ బాండ్స్ తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటే 9.25 శాతం వడ్డీ వర్తిస్తుంది.
    Published by:Santhosh Kumar S
    First published: