NSE apology: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ చరిత్రలో ఓ భారీ తప్పు జరిగిపోయింది. ట్విట్టర్లో NSEని ఫాలో అవుతున్నవారంతా షాక్ అయ్యారు. ఎందుకంటే… ట్విట్టర్ అకౌంట్లో టీవీ నటి మౌనీరాయ్ హాట్ ఫొటోలు దర్శనమిచ్చాయి. ఫాలోయర్లు ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ షేర్లు, వాటాల గురించి చెప్పే ఈ అకౌంట్లో మౌనీ రాయ్ ఫొటోలు ఎందుకొచ్చాయి? అవి కూడా హాట్ ఫొటోలు ఎందుకొచ్చాయి అని కన్ఫ్యూజ్ అయ్యారు. శనివారం మధ్యాహ్నం ఈ కలకరం రేగింది. ఫొటోలతోపాటూ… మౌనీ రాయ్ చూడ్డానికి ఏముంది… శనివారం ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయిగా… అనే కామెంట్ ఉంది. అంతేకాదు… beautifuldiva, 'sexydiva', 'hotgirl' అనే చిత్రమైన హ్యాష్‌ట్యాగ్స్ కూడా ఉన్నాయి.

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వివాదాస్పద ట్వీట్
స్పష్టత ఇచ్చిన NSE:
తన ట్వీట్‌పై దుమారం రేగడంతో… కాసేపటికే దాన్ని డిలీట్ చేసిన NSE… ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అనీ… దీనికి క్షణాపణ చెబుతున్నామని క్లారిటీ ఇచ్చింది. ఈ ట్వీట్‌ని మానవ తప్పిదంగా చెప్పుకొచ్చిన NSE… తమ అకౌంట్ హ్యాక్ కాలేదని తెలిపింది. ఫాలోయర్లకు అసౌకర్యం కలిగించినందుకు సిన్సియర్‌గా క్షమాపణలు కోరుతున్నాం అని తెలిపింది.
ఆటాడుకుంటున్న నెటిజన్లు:
NSE క్షమాపణలు చెప్పినా… నెటిజన్లు మాత్రం ఊరుకోవట్లేదు. స్టాక్ ఎక్స్ఛేంజ్ పరువు తీస్తూ… మీమ్స్ పెడుతున్నారు. ఇదో పర్ఫెక్ట్ ఎర్రర్ అని ఒకరు రాయగా… ఏ అకౌంట్లలో వెయ్యాల్సిన ట్వీట్లు ఆ అకౌంట్లలో వెయ్యాలి అని మరొకరు… ఇలా చాలా వస్తున్నాయి.
ఇది కూడా చదవండి:Makar Sankranti 2021: సంక్రాంతి నాడు ఈ పనులు తప్పక చేయండి... అదృష్టం మీదే
ఎవరీ మౌనీ రాయ్ (Mouni Roy):
ఈ కలకలంతో మౌనీ రాయ్ గురించి తెలియని చాలా మంది ఈమె ఎవరూ అని గూగుల్‌లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. మౌనీ రాయ్ ఇండియన్ టీవీ నటి. మోడల్. క్యూంకీ సాస్ భీ కభీ బహూ థీ సీరియల్తోపాటూ… మరికొన్ని పాత్రలతో పేరు తెచ్చుకుంది. 2014లో ఝలక్ దిఖలాజా డ్యాన్స్ షోలో ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఈ బ్యూటీకి కథక్ డాన్స్ కూడా వచ్చు. ఈ మధ్య మౌనీరాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. హాట్ పోజులతో విరుచుకుపడుతోంది. తద్వారా సెర్చ్ ట్రెండ్స్‌లో నిలుస్తోంది. చివరకు ఈ భామ ఎన్ఎస్ఈ ఉద్యోగులను కూడా ఆకర్షిస్తోందని అర్థమవుతోంది.
Published by:Krishna Kumar N
First published:January 10, 2021, 09:49 IST