కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌కు షాక్‌...ట్రేడింగ్‌ లైసెన్స్‌ సస్పెండ్‌ చేసిన ఎన్‌ఎస్‌ఈ

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్ లిమిటెడ్‌ లైసెన్స్‌ను బీఎస్‌ఈ, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీ, ఎంఎస్‌ఈఐలు కూడా రద్దు చేశాయి. అన్ని విభాగాలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని స్టాక్‌ ఎక్స్ఛేంజీలు తెలిపాయి.

news18-telugu
Updated: December 2, 2019, 3:24 PM IST
కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌కు షాక్‌...ట్రేడింగ్‌ లైసెన్స్‌ సస్పెండ్‌ చేసిన ఎన్‌ఎస్‌ఈ
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌కు ట్రేడింగ్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేస్తూ నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆ సంస్థపై సెబీ నిషేధం విధించగా.. తాజా నిర్ణయంతో భారీ షాక్ తగిలింది. మింట్ కథనం ప్రకారం కార్వీ బ్రోకింగ్ సంస్థ దాదాపు రూ.2800 కోట్ల విలువైన క్లయింట్ల సెక్యూరిటీలను దుర్వినియోగం అయ్యిందని, అది మార్కెట్ రెగ్యులేటర్ అంచనా వేసిన రూ.2000 కోట్ల నిధుల దుర్వినియోగం కన్నా ఎక్కువని కథనం పేర్కొంది. అయితే అంతేకాదు ఫోరెన్సిక్ అనాలిసిస్ ద్వారా విచారణ చేపడితే ఈ మొత్తం మరింత పెరగవచ్చని పేరింది. ఇదిలా ఉంటే కార్వీ స్టాక్‌ బ్రోకింగ్ లిమిటెడ్‌ లైసెన్స్‌ను బీఎస్‌ఈ, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీ, ఎంఎస్‌ఈఐలు కూడా రద్దు చేశాయి. అన్ని విభాగాలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని స్టాక్‌ ఎక్స్ఛేంజీలు తెలిపాయి. సెబీ విధించిన పలు మార్గదర్శకాలను పాటించని కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది.

ఖాతాదారుల సెక్యూరిటీలను దుర్వినియోగం చేసినట్లు, ఇతర అవసరాలకు వినియోగించినట్లు గుర్తించడంతో గత నెల 22న సెబీ చర్యలు తీసుకుంది. అలాగే కొత్త ఖాతాదారులను తీసుకోకుండా సెబీ ఆంక్షలు విధించింది. అంతేకాదు.. ప్రస్తుతం ఉన్న ఖాతాదాలకు సంబంధించిన పవర్‌ ఆఫ్‌ ఆటార్నీపై కూడా ఆంక్షలు విధించింది. దీంతోపాటు కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌పై ఎక్స్ఛేంజీలు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.First published: December 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>