హోమ్ /వార్తలు /బిజినెస్ /

NPS Withdrawal: ఎన్‌పీఎస్ చందాదారులకు గుడ్​న్యూస్​.. ఒకేసారి రూ. 5 లక్షలు విత్​డ్రా చేసుకునే అవకాశం

NPS Withdrawal: ఎన్‌పీఎస్ చందాదారులకు గుడ్​న్యూస్​.. ఒకేసారి రూ. 5 లక్షలు విత్​డ్రా చేసుకునే అవకాశం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నేషనల్​ పెన్షన్​ స్కీమ్​లో చేరిన వారికి గుడ్ న్యూస్. వారి పీఎఫ్​ విత్​డ్రా లిమిట్​ పెంచుతూ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎఫ్‌ఆర్‌డిఎ) నిర్ణయం తీసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

నేషనల్​ పెన్షన్​ స్కీమ్​లో చేరిన వారికి మోదీ సర్కార్​ గుడ్​న్యూస్​ చెప్పింది. వారి పీఎఫ్​ విత్​డ్రా లిమిట్​ పెంచుతూ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎఫ్‌ఆర్‌డిఎ) నిర్ణయం తీసుకుంది. తద్వారా పెన్షనర్లు, తమ పెన్షన్​ కార్పస్​ ఫండ్​ను ఒకేసారి విత్​డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇది ఎంతో మంది పెన్షనర్లకు ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు. తాజా నిర్ణయం ప్రకారం, చందాదారుల పెన్షన్​ కార్పస్​ ఫండ్​ రూ. 5 లక్షల వరకు ఉంటే.. ఆ మొత్తాన్ని ఒకేసారి విత్​డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. వారు యాన్యుటీలు కొనుగోలు చేయకుండానే ఈ మొత్తాన్ని విత్​డ్రా చేసుకోవచ్చు. ఇందుకు పీఎఫ్​ఆర్​డిఏ చందాదారులను అనుమతించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం, పదవీ విరమణ సమయంలో లేదా 60 ఏళ్లు నిండిన తర్వాత చందాదారులు పెన్షన్​ కార్పస్ నుంచి​ ఒకేసారి రూ. 2లక్షల కంటే ఎక్కువ తీసుకునే వీలులేదు. ఈ పరిమితి దాటిన తర్వాత పెన్షనర్లు తమ కాంట్రిబ్యూషన్​లో 60 శాతం మాత్రమే విత్​డ్రా చేసుకునే అవకాశం ఉండేది. మిగిలిన 40 శాతంతో బీమా సంస్థలు ఆఫర్​ చేసే యాన్యుటీ ప్లాన్లలో పెట్టుబడి పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ నియమాన్ని తొలగిస్తూ చందాదారులకు పెద్ద ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అంటే, ఎటువంటి యాన్యుటీని కొనుగోలు చేయకుండానే ఇకపై రూ. 5 లక్షల వరకు పెన్షన్​ కార్పస్​ ఫండ్​ను ఉపసంహరించుకోవచ్చు.

PAN Aadhaar Linking: పాన్-ఆధార్ లింకింగ్‌కు 2 వారాలే గడువు... చేయకపోతే ఈ చిక్కులు తప్పవు

75 ఏళ్ల వరకు ఎన్​పిఎస్​లో చేరొచ్చు..

దీనితో పాటు, ఏక మొత్తంలో చేసే ఎన్​పీఎస్​ ముందస్తు విత్​డ్రా లిమిట్​ను​ కూడా రూ. 2.5 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్​లో​ పేర్కొంది. కాగా, గతంలో ఈ పరిమితి రూ. 1 లక్ష వరకు మాత్రమే ఉండేది. ఇక, తాజా నిర్ణయంతో చందాదారుడి పర్మనెంట్​ రిటైర్​మెంట్​ అకౌంట్​లో జమ అయిన మొత్తం రూ. 5 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉన్నట్లైతే వారు ఎటువంటి యాన్యుటీ కొనుగోలు చేయకుండానే ఆ మొత్తాన్ని విత్​డ్రా చేసుకోవచ్చు.

ఇక, రెగ్యులేటర్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పిఎస్) ప్రవేశ వయస్సును గరిష్టంగా 65 నుంచి 75 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అంటే, ఇకపై 70 సవంత్సరాల వయస్సులోనూ ఎన్​పీఎస్​ స్కీమ్​లో పెట్టుబడి పెట్టవచ్చు. పదవీ విరమణ అనంతరం ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించడానికి ఈ ఎన్​పీఎస్​ పథకంలో ఇన్వెస్ట్​ చేస్తుంటారు. ఇందులో చేరిన వారికి ప్రతి నెలా పెన్షన్​ లభిస్తుంది.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Central governmennt, Narendra modi, National Pension Scheme, Pension Scheme

ఉత్తమ కథలు