NPS Tier-II investment account : కొన్ని రోజుల్లో కొత్త ఫైనాన్షియల్ ఇయర్ మొదలుకాబోతోంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన మొత్తంపై ట్యాక్స్(Tax) కట్టేందుకు పన్ను చెల్లింపుదారులు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో అందరూ ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్‌లపై కసరత్తు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో కేంద్రం తీసుకున్న ఓ నిర్ణయం ఇన్వెస్టర్లను సందిగ్ధంలో పడేసింది. ఫైనాన్స్ బిల్లుకు ప్రతిపాదించిన సవరణల తర్వాత.. NPS టైర్-II గెయిన్స్ విత్‌డ్రాపై ఎలా ట్యాక్స్ విధిస్తారనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఈ నిర్ణయం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
సాధారణంగా డెట్ మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్(LTCG)పై ఇండెక్సేషన్‌తో 20%, ఇండెక్సేషన్ లేకుండా 10% ట్యాక్స్ విధిస్తారు. కనీసం మూడేళ్లకు మించి కొనసాగించిన ఇన్వెస్ట్‌మెంట్‌లు LTCG పరిధిలోకి వస్తాయి. ఇండెక్సేషన్ ట్యాక్స్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇన్వెస్ట్‌మెంట్ చేసిన సమయంలో ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని, ఇన్వెస్ట్‌మెంట్ కొత్త విలువలను లెక్కించవచ్చు. రియల్ క్యాపిటల్ గెయిన్ లెక్కించి ట్యాక్స్ సేవ్ చేయడంలో ఇండెక్సేషన్ ట్యాక్స్ సహాయపడుతుంది.
అయితే మార్చి 24న లోక్‌సభలో ఆమోదం పొందిన ఫైనాన్స్ బిల్లు, 2023 అమెండ్‌మెంట్ ద్వారా ఇండెక్సేషన్ బెనిఫిట్‌ను తొలగించారు. డెట్ ఫండ్స్ యూనిట్ హోల్డర్‌లకు వారి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్(LTCG) ట్యాక్స్‌పై ఈ బెనిఫిట్ ఇప్పటివరకు అందుబాటులో ఉంది. ఫైనాన్స్ బిల్లు LTCG బెనిఫిట్స్ తొలగించడంతో, ఇండెక్సేషన్ ప్రయోజనాలు ఉండవు.
* NPS టైర్-II ఇన్వెస్ట్‌మెంట్‌లపై ప్రభావం
మ్యూచువల్ ఫండ్స్ లాగా, నేషనల్ పెన్షన్ సిస్టమ్ టైర్-I (రిటైర్మెంట్), టైర్-II (ఇన్వెస్ట్‌మెంట్) అకౌంట్‌ల ద్వారా డెట్ (కార్పొరేట్ డెట్, ప్రభుత్వ సెక్యూరిటీలు), ఈక్విటీ, ప్రత్యామ్నాయ ఆస్తి పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు. టైర్-I యాక్టివేట్ అయిన తర్వాత టైర్-II ఓపెన్ చేసుకోవచ్చు. టైర్-I వలె కాకుండా NPS టైర్-IIలో విత్‌డ్రా ఆప్షన్ ఉంటుంది. NPS టైర్-II గెయిన్స్ విత్‌డ్రాపై ఎలా ట్యాక్స్ విధిస్తారనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.
* టైర్-II క్యాపిటల్ గెయిన్స్‌పై సందిగ్ధం
టైర్-II ట్యాక్స్‌పై ప్రభుత్వం అధికారికంగా సమాచారం వెల్లడించలేదు. మనీకంట్రోల్ రిపోర్ట్ ప్రకారం.. దీనిపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నిపుణులు NPS టైర్-II గెయిన్స్‌పై ట్యాక్స్ మ్యూచువల్ ఫండ్‌ల మాదిరిగానే ఉండాలని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఈక్విటీలు లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు పొందిన క్యాపిటల్ గెయిన్స్ ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష దాటితే 10 శాతం ట్యాక్స్ ఉంటుంది.
షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై 15 శాతం ట్యాక్స్ విధిస్తారు. డెట్ ఫండ్స్ విషయంలో, మూడు సంవత్సరాలకు మించి హోల్డ్ చేస్తే లాంగ్ టర్మ్‌గా పరిగణిస్తారు. ఇండెక్సేషన్‌తో కలిపి 20 శాతం ట్యాక్స్ ఉంటుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, ఆదాయానికి యాడ్ అవుతాయి. వర్తించే స్లాబ్ రేటు ఆధారంగా దీనిపై ట్యాక్స్ ఉంటుంది.
* ట్యాక్స్ సేవింగ్ సీజన్లో NPSపై ఫోకస్
డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ను ప్రభావితం చేసే మార్చి 24 అమెండ్‌మెంట్ వల్లనే కాకుండా, ఎన్‌పీఎస్ అందించే ట్యాక్స్ బెనిఫిట్స్ గురించి చర్చ జరుగుతోంది. ట్యాక్స్ సేవింగ్ సీజన్‌లో ఎక్కువ మందిని ఆకర్షించే సెక్షన్ 80C అందులో ఒకటి.
Home Loan: కొత్త ఇల్లు కొంటున్నారా? హోమ్ లోన్‌తో ట్యాక్స్ ఇలా సేవ్ చేసుకోండి..
* NPS మల్టి లేయర్డ్ ట్యాక్స్ బెనిఫిట్స్
చివరి నిమిషాల్లో లాంగ్ టర్మ్‌కి ఉద్దేశించిన ఎన్‌పీఎస్ వంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయకూడదు. చాలా మంది మార్చి చివరి నాటికి అదే చేస్తారు. సెక్షన్ 80C రూ.1.5 లక్షలకు మించి అందించే బెనిఫిట్స్ కారణంగా NPS ఆటోమేటిక్ ఆప్షన్ అవుతోంది. అదనంగా ఆదాయ పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80CCD (1B) ప్రకారం రూ.50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్‌ను క్లెయిమ్ చేయవచ్చు.
అదే విధంగా సెక్షన్ 80CCD (2) కింద యజమాని NPS అకౌంట్‌కు బేసిక్ పే, డియర్‌నెస్ అలవెన్స్‌లో 10 శాతం (ప్రభుత్వ ఉద్యోగులకు 14 శాతం) కాంట్రిబ్యూట్ చేస్తే ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చు. ప్రభుత్వ ఉద్యోగి అయితే, ఎన్‌పిఎస్ టైర్-II అకౌంట్ ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చు. టైర్ I సెక్షన్ 80 సి కింద ట్యాక్స్ డిడక్షన్‌కు అర్హత పొందుతుంది. ఈ పెట్టుబడులు మూడు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌తో ముడిపడి ఉంటాయి.
* టైర్-I విత్‌డ్రాపై స్పష్టత
టైర్-I రిటైర్మెంట్ అకౌంట్ విషయంలో, విత్‌డ్రాపై ట్యాక్స్ రూల్స్ స్పష్టంగా ఉన్నాయి. 60 ఏళ్లు దాటిన తర్వాత కార్పస్‌లో 60 శాతం వరకు ట్యాక్స్ ఫ్రీ లంప్‌సమ్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 40 శాతం ఈక్విటీలలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇల్లు కొనుగోలు, తీవ్రమైన అనారోగ్యానికి చికిత్స, పిల్లల విద్య వంటి ముఖ్యమైన అవసరాలకు మధ్యంతర కాలంలో పార్షియల్ విత్‌డ్రా చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.