Saving Schemes | మార్చి 31 డెడ్‌లైన్ అందరూ గుర్తించుకోవాల్సిందే. ఎందుకంటే పాన్ కార్డు కలిగిన వారు కచ్చితంగా ఈ తేదీ లోపు ఆధార్ కార్డుతో (Aadhaar) లింక్ చేసుకోవాలి. లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పాన్ కార్డు చెల్లుబాటు కాదు. అలాగే పెనాల్టీల భారం మోయాల్సి వస్తుంది. అంతేకాకుండా నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) స్కీమ్‌లో చేరిన వారు కూడా కచ్చితంగా పాన్ కార్డును (Pan Card) ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి. లేదంటే మాత్రం చిక్కుల్లో పడాల్సి వస్తుంది.
ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ పెన్షన్ రెగ్యులేటర్ పీఎఫ్‌ఆర్‌డీఏ కొత్త రూల్స్ ప్రకారం చూస్తే.. ఎన్‌పీఎస్ సబ్‌స్క్రైబర్లు కచ్చితంగా పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలి. లేదంటే లావాదేవీలపై పరిమితులు లేదా ఆంక్షలు అమలులోకి వస్తాయని వెల్లడించింది. ఏప్రిల్ 1 నుంచే ఈ రూల్స్ అమలులోకి వస్తాయని తెలియజేసింది.
గుడ్ న్యూస్.. ఆధార్ పాన్ కార్డు లింక్ చేసుకోవాల్సిన పని లేదు.. వారికి కేంద్రం ఊరట!
’పాన్ కార్డు అనేది కీలకమైన గుర్తింపు సంఖ్య. కస్టమర్ కేవైసీ తెలుసుకోవడానికి నమ్మకమైన డాక్యుమెంట్. ఎన్‌పీఎస్ అకౌంట్లకు కచ్చితంగా పాన్ కార్డు కావాలి. అందువల్ల ప్రతి ఒక్క ఎన్‌పీఎస్ సబ్‌స్క్రైబర్ కచ్చితంగా కేవైసీ కలిగి ఉండాలి’ అని పీఎఫ్ఆర్‌డీఏ వెల్లడించింది. అందువల్ల ఈ స్కీమ్‌లో చేరిన వారు ఉంటే.. వెంటనే ఈ పని పూర్తి చేసుకోవాలి.
రూ.66 వేల ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం రూ.38 వేలకే కొనండి.. భారీ డిస్కౌంట్ ఆఫర్!
ఆదాయపు పన్నుచట్టం ప్రకారం చూస్తే.. పాన్ కార్డు కలిగిన వారు కచ్చితంగా ఆధార్ కార్డుతో దాన్ని లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పనిని నిర్ణీత గడువులోగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోకపోతే మాత్రం ఆ పాన్ కార్డు చెల్లుబాటు కాదు. సీబీడీటీ ప్రకారం చూస్తే.. 2023 మార్చి 31 నాటికి పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోకపోతే అప్పుడు అలాంటి పాన్ కార్డులు చెల్లుబాటు కావు. అలాగే ఇలాంటి వారు పాన్ కార్డును కలిగి లేకపోతే అప్పుడు ఆదాయపు పన్ను చట్టం కింద రూల్స్‌ను అధిగమించినట్లు అవుతుంది.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్‌లో చేరిన వారు ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేసుకోకపోతే అప్పుడు వారు కేవైసీ కలిగి లేనట్లు అవుతుంది. అప్పుడు ఎన్‌పీఎస్ ట్రాన్సాక్షన్లపై ఆంక్షలు అమలులోకి వస్తాయి. అందువల్ల పాన్ కార్డు కలిగిన వారు వెంటనే ఆధార్‌తో దాన్ని లింక్ చేసుకోండి. లేకపోతే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎన్‌పీఎస్ స్కీమ్‌ను పీఎఫ్ఆర్‌డీఏ చూసుకుంటుంది. ఎన్‌పీఎస్ అనేది బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్స్‌లో ఒకటిగా కొనసాగుతూ వస్తోంది. లో కాస్ట్ పెన్షన్ స్కీమ్‌గా కూడా దీనికి గుర్తింపు ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aadhaar Card, AADHAR, Nps, NPS Scheme, PAN card