హోమ్ /వార్తలు /బిజినెస్ /

NPS: పెన్షనర్లకు ఊరట.. ఈరోజు నుంచి కొత్త రూల్స్, మారే 2 అంశాలివే!

NPS: పెన్షనర్లకు ఊరట.. ఈరోజు నుంచి కొత్త రూల్స్, మారే 2 అంశాలివే!

Pension

Pension

Pension | నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్‌లో చేరిన వారికి ముఖ్యమైన అలర్ట్. ఎందుకంటే ఈరోజు నుంచి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. దీని వల్ల పెన్షనర్లకు ఊరట కలుగనుంది. ఏ ఏ మార్పులు చోటుచేసుకున్నాయో తెలుసుకుందాం.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  National Pension System | మీరు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) పథకంలో చేరారా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకని అనుకుంటున్నారా? ఈ రోజు కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. దీని వల్ల పెన్షనర్లకు ఊరట కలుగనుంది. నేటి నుంచి ఏ ఏ అంశాలు మారబోతున్నాయో ఇప్పుడు ఒకసారి తెలుకుందాం. కొత్త రూల్స్ ప్రకారం చూస్తే.. పెన్షనర్లు (Pension) పెన్షన్ కార్పస్ నుంచి వైదొలిగేటప్పుడు అంటే ఎన్‌పీఎస్ (NPS) నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునేటప్పుడు ప్రత్యేకంగా ప్రపోజల్ ఫామ్‌ను ఫిల్ చేయాల్సిన పని లేదు. ఎన్‌పీఎస్ రిటైరీస్ సమర్పించే ఎగ్జిట్ ఫామ్‌నే ప్రపోజల్ ఫామ్‌గా పరిగణలోకి తీసుకోవాలని కొత్త రూల్స్ పేర్కొంటున్నాయి. దీని వ్లల ఇన్సూరెన్స్ సంస్థలు తక్షణం యాన్యుటీ ప్రొడక్లును అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్‌డీఏఐ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ మేరకు సెప్టెంబర్ 13న ఒక సర్క్యూలర్ జారీ చేసింది.

  అంతేకాకుండా ఐఆర్‌డీఏఐ మరో వెసులుబాటు కల్పించింది. ఎన్‌పీఎస్ పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్‌ను డిజిటర్ మార్గంలో సమర్పించే అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఎన్‌పీఎస్ పెన్షనర్లు విత్‌డ్రాయెల్ సమయంలో ఎక్స్‌హాస్టివ్ ఎగ్జిట్ ఫామ్‌ను పీఎఫ్ఆర్‌డీఏకు సమర్పించాల్సి ఉంటుంది. తర్వాత ప్రపోజల్ ఫామ్‌ను సమర్పించాలి. ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ఫామ్‌ను అందిస్తాయి. యాన్యుటీ ప్లాన్స్ ఎంపిక కోసం ఈ ఫామ్ ఇవ్వాలి.

  ఉద్యోగులకు భారీ బోనస్.. 2 రోజుల్లో అకౌంట్లలోకి రూ.5 లక్షలు! వారికి మాత్రమే..

  ‘పీఎఫ్ఆర్‌డీఏ ఎన్‌పీఎస్ రిటైరీస్‌ నుంచి ఎక్స్‌హాస్ట్ ఫామ్‌ను తీసుకుంటోంది. ఇందులో ఇన్సూరెన్స్ కంపెనీల ప్రపోజల్ ఫామ్‌కు అవసరమైన వివరాలు కూడా ఉంటాయి’ అని ఐఆర్‌డీఏఐ తెలిపింది. డూప్లికేషన్, అలాగే సర్వీసులను మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో తాజా నిర్ణయం తీసుకున్నామని వివరించింది. ఎన్‌పీఎస్ రిటైరీస్‌ ఇప్పుడు తక్షణమే యాన్యుటీ ప్రొడక్టును ఎంచుకోవచ్చని తెలిపింది.

  క్రెడిట్ కార్డు వాడే వారికి షాక్.. ఇకపై..

  కాగా ప్రస్తుతం ఎన్‌పీఎస్ స్కీమ్‌లో చేరిన వారు మెచ్యూరిటీ సమయంలో డబ్బులు విత్‌డ్రా చేసుకునేటప్పుడు కచ్చితంగా 40 శాతం మొత్తంతో యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మిగిలిన 60 శాతం డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్ డబ్బులు రూ. 5 లక్షలు లేదా ఇంకా తక్కువగా ఉంటే అప్పుడు పూర్తి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. యాన్యుటీ ప్లాన్ కొనాల్సిన పని లేదు. అదే 60 ఏళ్ల కన్నా ముందుగానే ఎన్‌పీఎస్ డబ్బులు తీసుకోవాలని భావిస్తే.. అప్పుడు 80 శాతం డబ్బుతో యాన్యుటీ ప్లాన్ కొనాల్సి ఉంటుంది. అందువల్ల ముందుగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం కన్నా వేచి ఉండటం ఉత్తమం అని చెప్పుకోవచ్చు.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: National Pension Scheme, Nps, NPS Scheme, Pensions, Personal Finance

  ఉత్తమ కథలు