హోమ్ /వార్తలు /బిజినెస్ /

Money: శుభవార్త.. వీరికి 2 రోజుల్లోనే అకౌంట్‌లోకి డబ్బులు!

Money: శుభవార్త.. వీరికి 2 రోజుల్లోనే అకౌంట్‌లోకి డబ్బులు!

Money: శుభవార్త.. వీరికి 2 రోజుల్లోనే అకౌంట్‌లోకి డబ్బులు!

Money: శుభవార్త.. వీరికి 2 రోజుల్లోనే అకౌంట్‌లోకి డబ్బులు!

NPS withdrawal | నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో చేరిన వారికి గుడ్ న్యూస్. ఇకపై పాక్షిక విత్‌డ్రాయెల్స్ గడువు తగ్గింది. కేవలం టీ ప్లస్ 2 రోజుల్లోనే సెటిల్‌మెంట్ జరిగిపోతుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

National Pension System | పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) తాజాగా శుభవార్త అందించింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) స్కీమ్‌లో చేరిన వారికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. టీ ప్లస్ 2 విధానంలోకి మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు పాక్షిన విత్‌డ్రాయెల్ (Money) ఫెసిలిటీని కూడా టీ ప్లస్ 2 విధానంలోకి తీసుకువచ్చినట్లు తెలిపింది.

ఎన్‌పీఎస్ స్కీమ్ నుంచి పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలని భావించే వారు ఇకపై ఆథరైజేషన్ తర్వాత రెండు రోజులోనే డబ్బులు పొందొచ్చు. గతంలో పీఎఫ్‌ఆర్‌డీఏ నేషనల్ పెన్షన్ సిస్టమ్ విత్‌డ్రాయెల్ టైమ్‌లైన్‌ను టీ ప్లస్ 4 నుంచి టీ ప్లస్ 2కు తగ్గించిన విషయం తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్ నెలలో పీఎఫ్ఆర్‌డీఏ ఈ కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పుడు ఎన్‌పీఎస్ పాక్షిక విత్‌డ్రాయెల్ టైమ్‌లైన్‌ను కూడా తగ్గించింది.

హైదరాబాద్‌లో కొత్త ఇల్లు కొనాలనుకునే వారికి షాక్

పీఎఫ్ఆర్‌డీఏ లేటెస్ట సర్క్యూలర్ ప్రకారం చూస్తే.. పాక్షిక విత్‌డ్రాయెల్స్ రిక్వెస్ట్‌లను ప్రాసెస్ చేయడానికి టైమ్‌లైన్‌ను టీ ప్లస్ 2కు తగ్గించాం. అన్ని సీఆర్ఏలకు ఇది వర్తిస్తుంది. ఉదాహరణకు సోమవారం రోజున పాక్షిక విత్‌డ్రాయెల్ రిక్వెస్ట్‌ను ఆథరైజ్డ్ చేస్తే.. అప్పుడు వారికి బుధవారం రోజున అకౌంట్‌లో డబ్బులు క్రెడిట్ అవుతాయి. మూడు రోజుల్లో సెటిల్‌మెంట్ జరుగుతుంది.

బ్యాంక్ కస్టమర్లకు అదిరే శుభవార్త.. ఆర్‌బీఐ కీలక ప్రకటన, కొత్త సర్వీసులు!

ఇకపోతే నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్‌లో చేరడం వల్ల పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. మెచ్యూరిటీ సమయంలో ఒకే సారి భారీ మొత్తం పొందొచ్చు. అంతేకాకుండా ప్రతి నెలా పెన్షన్ లభిస్తుంది. ఇంకా పన్ను మినహాయింపు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అంటే ఒక్క స్కీమ్‌తో మూడు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. అయితే ఎన్‌పీఎస్ స్కీమ్‌లో చేరిన వారు ఒక విషయం గుర్తించుకోవాలి. 60 ఏళ్లు వచ్చే వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటంది. 75 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం ప్రాతిపదికన మీకు లభించే రాబడి కూడా ఆధారపడి ఉంటుంది. వచ్చే మొత్తంలో కనీసం 40 శాతం యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయాలి.

ఉదాహరణకు మీరు ప్రతి నెలా రూ. 5 వేలు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారు. మీ వయసు 30 ఏళ్లు. ఇలా మీరు 60 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఇలా చేస్తే మీకు మెచ్యూరిటీ సమయంలో చేతికి రూ. 68 లక్షలు వస్తాయి. అలాగే ప్రతి నెలా రూ. 22 వేలకు పైగా పెన్షన్ వస్తుంది. అందుకే ఈ స్కీమ్‌లో చేరితే అదిరే బెనిఫిట్స్ ఉంటాయి.

First published:

Tags: Money, National Pension Scheme, Nps, NPS Scheme

ఉత్తమ కథలు