హోమ్ /వార్తలు /బిజినెస్ /

NPS సబ్‌స్క్రైబర్స్‌ కోసం PAN-PRAN- VPA(UPI) అథెంటికేషన్.. ఏంటీ సిస్టమ్? ఎలా పనిచేస్తుంది?

NPS సబ్‌స్క్రైబర్స్‌ కోసం PAN-PRAN- VPA(UPI) అథెంటికేషన్.. ఏంటీ సిస్టమ్? ఎలా పనిచేస్తుంది?

NPS సబ్‌స్క్రైబర్స్‌ కోసం PAN-PRAN- VPA(UPI) అథెంటికేషన్.. ఏంటీ సిస్టమ్?

NPS సబ్‌స్క్రైబర్స్‌ కోసం PAN-PRAN- VPA(UPI) అథెంటికేషన్.. ఏంటీ సిస్టమ్?

NPS సబ్‌స్క్రైబర్ల కోసం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ & డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) బ్యాంక్ అకౌంట్‌, PAN అథెంటికేషన్‌ ప్రక్రియను ప్రకటించింది. ఈ సిస్టమ్ NPCI ఫ్రేమ్‌వర్క్‌ ఆధారంగా పని చేస్తుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS) సబ్‌స్క్రైబర్లకు మెరుగైన సేవలు అందించేందుకు పెన్షన్‌ సెక్టార్‌ రెగ్యులేటర్‌ చర్యలు తీసుకుంటోంది. తాజాగా NPS సబ్‌స్క్రైబర్ల కోసం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ & డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) బ్యాంక్ అకౌంట్‌, PAN అథెంటికేషన్‌ ప్రక్రియను ప్రకటించింది. ఈ సిస్టమ్ NPCI ఫ్రేమ్‌వర్క్‌ ఆధారంగా పని చేస్తుంది. ఇది పూర్తిగా ఎండ్-టు-ఎండ్ డిజిటల్ ప్రాసెస్‌. ఈ లేటెస్ట్‌ ప్రాసెస్‌ ప్రయోజనాలు ఇలా..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) కలిసి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)ను ఏర్పాటు చేశాయి. ఇది భారతదేశంలో రిటైల్ పేమెంట్స్‌, సెటిల్‌మెంట్ సిస్టమ్స్‌ను ఆర్గనైజ్‌ చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు సంస్థలు, అసంఘటిత రంగాల ఉద్యోగులు సబ్‌స్క్రైబర్లుగా ఉన్న NPSను PFRDA నియంత్రిస్తుంది.

* PAN-PRAN- VPA(UPI) సిస్టమ్ అంటే ఏంటి?

PAN-PRAN- VPA (UPI) సిస్టమ్‌ అనేది NPS సబ్‌స్క్రైబర్‌ బ్యాంక్ అకౌంట్‌ వెరిఫికేషన్‌ అడ్వాన్స్‌డ్‌ మోడ్‌ అని PFRDA తెలిపింది. ఇక్కడ జాయింట్ హోల్డర్ వివరాలు, PAN, UPI ఐడీలను NPCI వెరిఫై చేస్తుంది. ఈ వివరాలు పర్మనెంట్‌ రిటైర్మెంట్‌ అకౌంట్‌ నంబర్‌(PRAN)తో మ్యాచ్‌ అవుతున్నాయో? లేదో? పరిశీలిస్తుంది.

* ఈ సిస్టమ్‌ ప్రయోజనాలు ఏంటి?

PFRDA తీసుకొచ్చిన కొత్త సిస్టమ్ ద్వారా.. బ్యాంక్ అకౌంట్‌ వివరాలు తప్పుగా ఉన్న కారణంగా నిధులు వెనక్కి రావడం గణనీయంగా తగ్గింది. ప్రాసెసింగ్ టర్నరౌండ్ టైమ్‌ కూడా మెరుగుపడింది. విత్‌డ్రా క్లెయిమ్స్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు లబ్ధిదారుల ఆధారాలను వెరిఫై చేయడానికి అదనపు యంత్రాంగంగా కొత్త సిస్టమ్‌ పని చేస్తోంది.

* PAN-PRAN- VPA(UPI) ప్రయోజనాలు

ఈ సిస్టమ్‌ ద్వారా పే అవుట్ ప్రక్రియలో ఎర్రర్స్‌ తొలగిపోయాయి. బైనరీ, సింప్లిఫైడ్‌ NPCI యాక్టివ్/ఇనాక్టివ్ రెస్పాన్స్‌ ప్రాసెస్‌ను సులభతరం చేసింది. అంతకు ముందు నేమ్‌ మ్యాచింగ్‌ ఫజీ లాజిక్‌పై ఆధారపడిన పెన్నీ డ్రాప్‌ ఫ్రేమ్‌వర్క్‌పై పని చేసేది. PRAN, బ్యాంక్ అకౌంట్‌కి అందించిన పాన్ వివరాలు సరిపోల్చుతుంది. బ్యాంకు అకౌంట్‌ జాయింట్ హోల్డర్ అయిన సబ్‌స్క్రైబర్లు విత్‌డ్రా ప్రాసెస్‌ను సకాలంలో పూర్తి చేసేలా ఉపయోగపడుతుంది. PAN-PRAN- VPA(UPI) విధానం NPCI ఫ్రేమ్‌వర్క్‌పై పని చేస్తుంది.

* సబ్‌స్క్రైబర్‌ను గుర్తించే దశలు

NPCI నెట్‌వర్క్‌లో PAN, VPA (UPI), బ్యాంక్‌ అకౌంట్‌త PAN లింక్‌ అయిందో లేదో పరిశీలిస్తుంది. అకౌంట్‌ నంబర్ లింక్ అయిందో లేదో తనిఖీ చేయడానికి వినియోగదారు PAN + అకౌంట్‌ నంబర్ + IFSC (సబ్‌స్క్రైబర్‌ పేర్కొన్న బ్యాంక్ కోడ్) NPCIకి రిక్వెస్ట్‌ రూపంలో వెళ్తాయి.

బ్యాంక్‌లో అకౌంట్‌ నంబర్, PAN లింక్ అయితే, NPCI బ్యాంక్‌లో ఖాతాదారుడి పేరుతో పాటు Yని రెస్పాన్స్‌గా పంపుతుంది. ఇది UPI ID (ఉంటే), అకౌంట్‌ రకం, బ్యాంక్ అకౌంట్‌ స్టేటస్‌ (యాక్టివ్/ఇనాక్టివ్ అయినా) వంటి వివరాలను కూడా అందిస్తుంది. బ్యాంక్‌లో అకౌంట్‌ నంబర్, PAN లింక్ చేయకపోతే, NPCI సబ్‌స్క్రైబర్‌ వివరాలు లేకుండా Nను రెస్పాన్స్‌గా పంపుతుంది.

ఈ లేటెస్ట్‌ ప్రాసెస్‌లో వేగవంతమైన, ఇన్‌స్టంట్‌ రెస్పాన్స్‌ ఉంటుంది. సబ్‌స్క్రైబర్ అకౌంట్‌కి రెండు లేదా మూడో హోల్డర్‌గా ఉన్నప్పుడు కూడా పని చేస్తుంది. పెన్నీ-డ్రాప్ ప్రక్రియగా పొడవైన పేర్ల నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలను తొలగిస్తుంది. కొన్నిసార్లు అసంపూర్ణమైన / తగ్గించబడిన పేర్లను అందిస్తుంది. నేమ్‌ మ్యాచింగ్‌ ఫజీ లాజిక్‌పై పని చేసే పెన్నీ డ్రాప్‌ ఫ్రేమ్‌ వర్క్‌ కంటే సులువుగా, లాజికల్ అప్రోచ్‌ ద్వారా సేవలు అందిస్తుంది.

First published:

Tags: Investment Plans, Nps, NPS Scheme

ఉత్తమ కథలు