NPS CALCULATOR SAVE RS 5000 PER MONTH IN NATIONAL PENSION SYSTEM SCHEME AND GET RS 1 LAKH PENSION PER MONTH SS
Pension Scheme: ఈ ప్రభుత్వ పథకంలో పొదుపు చేస్తే నెలకు రూ.1 లక్ష పెన్షన్... వివరాలు తెలుసుకోండి
Pension Scheme: ఈ ప్రభుత్వ పథకంలో పొదుపు చేస్తే నెలకు రూ.1 లక్ష పెన్షన్... వివరాలు తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)
Pension Scheme | దీర్ఘకాలం పొదుపు చేస్తే మంచి రిటర్న్స్ ఉంటాయని చెబుతుంటారు పర్సనల్ ఫైనాన్స్ (Personal Finance) నిపుణులు. రిటర్న్స్ మాత్రమే కాదు... వృద్ధాప్యంలో మంచి పెన్షన్ కూడా పొందొచ్చు. ఓ స్కీమ్‌లో పొదుపు చేయడం ద్వారా నెలకు రూ.1 లక్ష పెన్షన్ తీసుకోవచ్చు.
ఏదైనా పెన్షన్ స్కీమ్‌లో చేరాలనుకునేవారికి అలర్ట్. కేంద్ర ప్రభుత్వం వృద్ధులకు వృద్ధాప్యంలో ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (National Pension System) లేదా ఎన్పీఎస్ స్కీమ్ అందిస్తోంది. ఈ స్కీమ్‌లో నెలకు రూ.5,000 పొదుపు చేయడం ద్వారా రిటైర్మెంట్ తర్వాత ప్రతీ నెలా రూ.1,00,000 పెన్షన్ పొందొచ్చు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ రిటైర్మెంట్ను సమర్థవంతంగా ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడే ఆకర్షణీయమైన దీర్ఘకాలిక పొదుపు మార్గం. 2004 జనవరిలో ఈ స్కీమ్ కేవలం ప్రభుత్వ ఉద్యోగుల కోసం మాత్రమే ప్రారంభమైంది. 2009లో ఈ స్కీమ్‌ను అన్ని వర్గాలకు అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్‌ను నిర్వహిస్తోంది. ఇందుకోసం PFRDA నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్‌ను (NPST) ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్‌లో ప్రతీ నెలా కొంత మొత్తం చొప్పున పొదుపు చేయాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ వరకు పొదుపు చేసి రిటైర్మెంట్ తర్వాత ప్రతీ నెలా కొంత మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో పొదుపు చేసే మొత్తానికి వచ్చే రిటర్న్స్ రెగ్యులేటెడ్ మార్కెట్‌పై ఆధారపడి ఉంటాయి.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ ప్రభుత్వ ఉద్యోగులకు, ఇతరులకు రెండు కేటగిరీల్లో ఉంటుంది. 2004 జనవరి 1 తర్వాత కేంద్ర ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి గల సంస్థల్లో చేరిన ఉద్యోగులందరూ ఈ స్కీమ్ కింద కవర్ అవుతారు. ఇక 2009 మే 1 నుంచి ఈ స్కీమ్ పౌరులందరికీ అందుబాటులోకి వచ్చింది. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు గలవారు ఎవరైనా ఈ స్కీమ్‌లో చేరొచ్చు.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్‌లో చేరినవారు పాయింట్ ఆఫ్ ప్రజెన్స్, ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్, ఫండ్ మేనేజర్లను ఎంచుకునే, మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈక్విటీ, కార్పొరేట్ బాండ్, ప్రభుత్వ సెక్యురిటీలు, ఇతర ఆస్తుల్లోకి తమ ఇన్వెస్ట్మెంట్స్ మార్చుకోవచ్చు. ఇందులో కనీసం రూ.500 నుంచి పొదుపు చేయొచ్చు. ఆదాయపు పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 80సీసీడీ (1బీ) ప్రకారం పన్ను మినహాయింపు పొందొచ్చు.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్‌లో టైర్ 1, టైర్ 2 పేరుతో రెండు రకాల ఎన్పీఎస్ అకౌంట్స్ ఉంటాయి. టైర్ 1 ఆప్షన్ ఎంచుకుంటే జమ చేసిన మొత్తంలో 60 శాతం విత్‌డ్రా చేయొచ్చు. ఈ మొత్తానికి పన్ను మినహాయింపు ఉంటుంది. మిగతా 40 శాతాన్ని యాన్యుటీగా పొందొచ్చు. టైర్ 2 ఆప్షన్ ఎంచుకుంటే మాత్రం నెలకు కనీసం రూ.1,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాలి. జమ చేసిన మొత్తాన్ని ఎప్పుడైనా విత్‌డ్రా చేయొచ్చు. ఎలాంటి పన్ను ప్రయోజనాలు ఉండవు.
ప్రతీ నెలా రూ.1,00,000 పెన్షన్
ఈ స్కీమ్‌లో ప్రతీ నెలా పొదుపు చేయాల్సి ఉంటుంది. 25 ఏళ్ల వయస్సు ఉన్న ఓ వ్యక్తి ప్రతీ నెలా రూ.5,000 చొప్పున పొదుపు చేస్తే రిటైర్మెంట్ వరకు అంటే 35 ఏళ్లపాటు పొదుపు చేస్తే పొదుపు చేసిన మొత్తం రూ.21 లక్షలు అవుతుంది. వార్షిక వడ్డీ 10 శాతం చొప్పున లెక్కిస్తే రూ.1.87 కోట్ల రిటర్న్స్ వస్తాయి. అందులో 35 శాతం విత్‌డ్రా చేసుకొని 65 శాతాన్ని యాన్యుటీగా మార్చుకుంటే రూ.1.22 కోట్లు అవుతుంది. ఆ మొత్తానికి యాన్యుటీ రేట్ 10 శాతంగా లెక్కిస్తే ఏటా రూ.12 లక్షలు అంటే నెలకు రూ.1,00,000 చొప్పున పెన్షన్ పొందొచ్చు. దీంతో పాటు రూ.65 లక్షలు ముందే విత్‌డ్రా చేసుకుంటారు కాబట్టి ఆ మొత్తాన్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.