నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI కొత్త రూల్స్‌ని అమలు చేస్తోంది. యూపీఐ ట్రాన్సాక్షన్స్ విషయంలో పరిమితిని విధించబోతోంది. ఎన్‌పీసీఐ రూల్స్ ప్రకారం మొత్తం యూపీఐ ద్వారా జరిగే లావాదేవీల్లో ఒక యాప్ ద్వారా గరిష్టంగా 30 శాతం వరకు మాత్రమే లావాదేవీల పరిమితిని విధిస్తోంది. ఉదాహరణకు ఒక రోజులో ఒక కోటి యూపీఐ లావాదేవీలు జరుగుతాయనుకుంటే ఒక యాప్ అంటే గూగుల్ పే లేదా ఫోన్‌పే లాంటి యాప్స్ అందులో 30 శాతం వాటా మాత్రమే పొందగలవు. అంటే 30 లక్షల వరకు మాత్రమే లావాదేవీలు చేయడం సాధ్యం అవుతుంది. మొత్తం యూపీఐ ఎకోసిస్టమ్‌ను కాపాడటంతో పాటు ఒకే యూపీఐ యాప్ మార్కెట్ లీడర్‌గా మారకుండా అడ్డుకోవడం ఈ కొత్త రూల్స్ ఉద్దేశం. అయితే కొత్త నియమనిబంధనలు భవిష్యత్తులో యూజర్లపైనా ప్రభావం చూపిస్తాయి. ఈ కొత్త రూల్స్ 2021 జనవరి 1న అమలులోకి రానున్నాయి.
WhatsApp Payments: మీ వాట్సప్ నుంచి డబ్బులు పంపడం ఈజీ... ఈ స్టెప్స్ ఫాలో అవండి
Jio New Plans: జియో నుంచి కొత్త ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే
ప్రస్తుతం భారతదేశంలో 21 థర్డ్ పార్టీ యూపీఐ యాప్స్ ఉన్నాయి. అందులో లేటెస్ట్‌గా అనుమతి లభించిన వాట్సప్ పేమెంట్స్ కూడా ఒకటి. ఇక ప్రస్తుతం చూస్తే ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే ప్రధానమైన యూపీఐ ప్లాట్‌ఫామ్స్. మొత్తం యూపీఐ లావాదేవీల్లో 80 శాతం లావాదేవీలు ఫోన్‌పే, గూగుల్ పే ద్వారానే జరుగుతాయి. 2020 అక్టోబర్‌లో ఫోన్‌పే ద్వారా 83.5 కోట్ల లావాదేవీలు జరిగితే గూగుల్ పే ద్వారా 82 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇక పేటీఎం ద్వారా 24.5 కోట్ల లావాదేవీలు, అమెజాన్ పే ద్వారా 12.5 కోట్ల లావాదేవీలు జరిగాయి. 2020 అక్టోబర్‌లో మొత్తం 207.16 కోట్ల లావాదేవీలు జరిగినట్టు యూపీఐ ప్రకటించింది. ఇందులో గూగుల్‌పే, ఫోన్‌పే, అమెజాన్ పే, పేటీఎం ద్వారా జరిగిన లావాదేవీలే 97 శాతం ఉన్నాయి. మిగతా 17 యాప్స్ ద్వారా 3 శాతం లావాదేవీలు మాత్రమే జరిగాయి. అందుకే 30 శాతం పరిమితి నిబంధనను అమలు చేయనుంది ఎన్‌పీసీఐ. ఈ నిర్ణయం గూగుల్‌పే, ఫోన్‌పే, అమెజాన్ పే, పేటీఎంతో పాటు ఈ యాప్స్ యూజర్లపై ప్రభావం చూపిస్తుంది.
మీ EPF Account Transfer ఆన్‌లైన్‌లో ఈజీగా చేయండిలా
Indane Gas: వాట్సప్‌లో ఇండేన్ గ్యాస్ సిలిండర్ బుక్ చేయండిలా
ఈ కొత్త రూల్స్ అమలులోకి వస్తే మార్కెట్ లీడర్స్‌గా ఉన్న గూగుల్ పే, ఫోన్‌పే యూజర్లు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. వారికి లిమిట్స్ విధించే అవకాశం ఉంది. అంటే రోజూ 5 లావాదేవీలు మాత్రమే అని లిమిట్ పెట్టొచ్చు. లేదా గంటకు ఒక యూపీఐ ట్రాన్సాక్షన్ మాత్రమే చేయాలని రూల్ తీసుకురావొచ్చు. లేదా రూ.1,000 కన్నా ఎక్కువ లావాదేవీలను మాత్రమే అనుమతిస్తామని చెప్పొచ్చు. అదే జరిగితే ఎక్కువ లావాదేవీలు జరిపే యూజర్లు వేర్వేరు యూపీఐ యాప్స్ ఉపయోగించాల్సి రావొచ్చు. ఇతర యూపీఐ యాప్స్ చూస్తే ఎంఐ పే, మొబీ క్విక్, సాంసంగ్ పే లాంటి యాప్స్ ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AMAZON PAY, BHIM UPI, Google pay, MI PAY, Paytm, Personal Finance, PhonePe, UPI