Google Pay | ఫోన్ పే, గూగుల్ పే వాడే వారికి ముఖ్యమైన అలర్ట్. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాతో (RBI) చర్చలు జరుపుతోంది. ఫోన్‌పే, గూగుల్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్‌పై యూపీఐ పేమెంట్ సర్వీసులకు చెందిన మొత్తం ట్రాన్సాక్షన్లపై (మార్కెట్ వాటాపై) పరిమితులు విధించాలని యోచిస్తోంది. 30 శాతానికి పరిమితం చేయాలని సిద్ధమౌతోంది. ఈ నిర్ణయాన్ని డిసెంబర్ 31ను డెడ్‌లైన్‌గా నిర్దేశించుకుంది.
ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్ పే వంటి వాటిపై ట్రాన్సాక్షన్లకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి పరిమితులు లేవు. దీని వల్ల ఈ రెండు కంపెనీల మార్కెట్ వాటా ఇప్పుడు దాదాపు 80 శాతంగా ఉంది. అయితే ఈ మార్కెట్ వాటాను 30 శాతానికి పరిమితం చేయాలని ఎన్పీసీఐ యోచిస్తోంది. లేదంటే మార్కెట్లో గుతాధిపత్యం రావొచ్చని పేర్కొంటోంది.
పోస్టాఫీస్‌లో 4 అదిరే స్కీమ్స్.. రూ.400 పొదుపుతో చేతికి రూ.కోటి!
2022 నంబర్ నెలలో ఎన్పీసీఐ థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్లకు ట్రాన్సాక్షన్లను 30 శాతానికి పరిమితం చేయాలని ప్రతిపాదించింది. మోనోపాలీ రిస్క్ లేకుండా చూడటం ఇందుకు ప్రధాన కారణం. ఈ మేరకు అన్నీ అంశాలను చర్చించడానికి ఒకే సమావేశం కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్‌లో ఆర్బీఐ , ఆర్థిక శాఖ, ఎన్పీసీఐ అధికారులు పాల్గొన్నారు.
ధర రూ.4 లక్షలు.. మైలేజ్ 33 కిలోమీటర్లు, చౌక ధరకే లభిస్తున్న 4 కార్లు ఇవే!
ఎన్పీసీఐ ఈ నెల చివరి కల్లా యూపీఐ మార్కెట్ లిమిట్ అంశంపై ఒక తుది నిర్ణయానికి రావొచ్చని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇకపోతే యూపీఐ ట్రాన్సాక్షన్లు 2022 అక్టోబర్ నెలలో 7.7 శాతం మేర పెరిగాయి. 730 కోట్లకు చేరాయి. వీటి విలువ రూ. 12.11 లక్షల కోట్లు. 2022 సెప్టెంబర్ నెలలో యూపీఐ ట్రాన్సాక్షన్లు 678 కోట్లుగా ఉన్నాయి. వీటి మొత్తం విలువ రూ. 11.16 లక్షల కోట్లు. 2022 అక్టోబర్ నెలలో ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్లు 48.25 కోట్లుగా ఉన్నాయి. వీటి విలువ రూ. 4.66 లక్షల కోట్లు. అంటే యూపీఐ లావాదేవీలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. చాలా మంది గూగుల్ పే, ఫోన్ పే, భీమ్ యాప్, పేటీఎం వంటి వాటి ద్వారా యూపీఐ ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తూ ఉంటారు. దీంతో వీటి సంఖ్య భారీగా నమోదు అవుతోంది. చిన్న చిన్న మొత్తాలకు యూపీఐ సర్వీసులు ఉపయోగించే వారు చాలా మంది ఉన్నారని చెప్పుకోవచ్చు. యూపీఐ ద్వారా క్షణాల్లో పేమెంట్లను నిర్వహించొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google pay, PhonePe, Rbi, UPI, Upi payments