WhatsApp Pay: వాట్సాప్ పే యూజర్లకు గుడ్ న్యూస్

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి WhatsApp Payకు అనుమతి లభించింది. ఇకపై యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేజ్ (UPI) చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

news18-telugu
Updated: November 5, 2020, 10:08 PM IST
WhatsApp Pay: వాట్సాప్ పే యూజర్లకు గుడ్ న్యూస్
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తీసుకొచ్చిన WhatsApp Pay సేవలకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి WhatsApp Payకు అనుమతి లభించింది. ఇకపై యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేజ్ (UPI) చెల్లింపులకు అనుమతి ఇచ్చింది. 20 మిలియన్ల యూజర్లతో సర్వీసులను ప్రారంభించి, ఆ తర్వాత దశల వారీగా పెంచుకోవడానికి ఎన్‌‌పీసీఐ అనుమతి ఇచ్చింది. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ భారతదేశంలో పేమెంట్ సేవల్ని ప్రారంభించాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులతో వాట్సాప్ పే ఒప్పందం కుదుర్చుకుంది. ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి బీటా టెస్టింగ్ ప్రారంభించింది వాట్సప్.

‘వాట్సప్‌లో అందరు యూజర్లకు పేమెంట్ సేవల్ని అందించేందుకు ప్రభుత్వంతో కలిసి మేం పనిచేస్తున్నాం. వాట్సప్‌లో పేమెంట్ సేవలు ప్రారంభమైతే భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ పుంజుకుంటాయి. కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలోని 40 కోట్ల మంది యూజర్లు సురక్షితంగా లావాదేవీలు జరిపేందుకు ఇది ఉపయోగపడుతుంది.’ అని వాట్సప్ ప్రతినిధి ఒకరు ఈ ఏడాది మేలో మనీకంట్రోల్ వెబ్‌సైట్‌తో అన్నారు. భారతదేశంలో గూగుల్ పే సేవల్ని కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు అందిస్తున్నాయి. వాట్సప్ పేమెంట్స్ సేవల్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI 2018 ఫిబ్రవరిలో నిలిపివేసిన సంగతి తెలిసిందే. చట్టపరమైన, నియంత్రణ అడ్డంకుల కారణంగా అనుమతులకు రెండేళ్ల గడువు పట్టింది. ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 5, 2020, 10:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading