ఎల్ఐసీ పాలసీహోల్డర్లకు శుభవార్త. ఇక మీరు ఎల్ఐసీ ప్రీమియం చెల్లించాలంటే నేరుగా ఐడీబీఐ బ్యాంకుకు వెళ్లి చెల్లింపులు చేయొచ్చు. అంతేకాదు... కొత్తగా ఏదైనా పాలసీ తీసుకోవాలన్నా ఐడీబీఐ బ్యాంకులోనే తీసుకోవచ్చు. ఈ మేరకు ఐడీబీఐ బ్యాంక్, లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మధ్య ఒప్పందం కుదిరింది. ఇకపై ఎల్ఐసీకి ఐడీబీఐ బ్యాంక్ కార్పొరేట్ ఏజెంటుగా వ్యవహరిస్తుంది. ఐడీబీఐ బ్యాంకుకు చెందిన 1,800 బ్రాంచుల్లో ఎల్ఐసీ పాలసీల అమ్మకాలు, ప్రీమియం చెల్లింపులు చేసే సదుపాయం మొదలైంది. బ్యాంకు తమ 1.8 కోట్ల మంది రీటైల్ కస్టమర్లకు ఎల్ఐసీ పాలసీలను ఆఫర్ చేయనుంది.
Read this: PM-Kisan scheme: ఏప్రిల్ 1న రైతుల అకౌంట్‌లోకి మరో రూ.2,000... ఆధార్ తప్పనిసరి కాదు
@LICIndiaForever, the biggest insurance company in India, and IDBI Bank Ltd, have entered into a Service Level Agreement to offer LIC’s insurance products through IDBI Bank’s branches. Read on to know more: https://t.co/Q2XLz88rZQ pic.twitter.com/0Ai4U7IGCc
— IDBI BANK (@IDBI_Bank) February 28, 2019
ఐడీబీఐ బ్యాంకుల్లో ఎల్ఐసీ పాలసీలు, ప్రీమియం చెల్లింపుల ద్వారా బ్యాంకులోకి నిధుల రాక పెరుగుతుందని అంచనా. మరోవైపు తన సొంత లైఫ్ ఇన్స్యూరెన్స్ సబ్సిడరీ అయిన ఐడీబీఐ ఫెడరల్ లైఫ్ ఇన్స్యూరెన్స్‌లో వాటాలు అమ్మేందుకు ఆలోచిస్తోంది ఐడీబీఐ బ్యాంకు. ఈ వాటాలను కొనేందుకు మ్యాక్స్ లైఫ్ ఆసక్తి కూడా చూపించింది. చాలా బ్యాంకులకు లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఉండగా, లైఫ్ ఇన్స్యూరెన్స్ సంస్థ అయిన ఎల్ఐసీ ఏకంగా ఐడీబీఐ బ్యాంకులో వాటాలు తీసుకోవడం మరో విశేషం.
Photos: రెడ్‌మీ నోట్ 7 ప్రో రిలీజ్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
ATM Rules: మీ ఏటీఎం కార్డును మీ భార్య వాడినా తప్పే... RBI రూల్స్ తెలుసుకోండి
Link PAN: బ్యాంక్ అకౌంట్‌కి పాన్ లింక్ చేస్తేనే ఐటీఆర్ రీఫండ్
పవర్ బ్యాంక్ కొంటున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Idbi, Insurance, LIC, Personal Finance